నిన్ను చూసి దేశం గర్విస్తోంది: అమిత్ షా

శ్రీనగర్: తీవ్రవాదుల కాల్పులో అమరుడైన ఇన్‌స్పెక్టర్ అర్షద్ ఖాన్ కుటుంబాన్ని హోంశాఖ మంత్రి అమిత్ షా పరామర్శించారు. కుటుంబ సభ్యులకు దేశం ప్రజలు తోడుగా ఉంటారని ధైర్యం చెప్పారు. అర్షద్ ఖాన్ దేశం కోసం ప్రాణాలు విడిచిన గొప్ప వీరుడని పొగిడారు. తాను పోతూ కొన్ని వేల మంది ప్రాణాలను రక్షణ కల్పించారని ప్రశంసించారు. జూన్-12న అనంత్ నాగ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో అర్షద్ ఖాన్‌తో ఐదుగురు భద్రతా సిబ్బంది అమరులయ్యారు. అర్షద్ ఖాన్ కాల్పులో తీవ్రంగా గాయపడడంతో […] The post నిన్ను చూసి దేశం గర్విస్తోంది: అమిత్ షా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

శ్రీనగర్: తీవ్రవాదుల కాల్పులో అమరుడైన ఇన్‌స్పెక్టర్ అర్షద్ ఖాన్ కుటుంబాన్ని హోంశాఖ మంత్రి అమిత్ షా పరామర్శించారు. కుటుంబ సభ్యులకు దేశం ప్రజలు తోడుగా ఉంటారని ధైర్యం చెప్పారు. అర్షద్ ఖాన్ దేశం కోసం ప్రాణాలు విడిచిన గొప్ప వీరుడని పొగిడారు. తాను పోతూ కొన్ని వేల మంది ప్రాణాలను రక్షణ కల్పించారని ప్రశంసించారు. జూన్-12న అనంత్ నాగ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో అర్షద్ ఖాన్‌తో ఐదుగురు భద్రతా సిబ్బంది అమరులయ్యారు. అర్షద్ ఖాన్ కాల్పులో తీవ్రంగా గాయపడడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. అర్షద్ ఖాన్‌కు ఇద్దరు కుమారులు, భార్య, తమ్ముడు ఉన్నారు. జమ్ము కశ్మీర్ పోలీసులు గొప్ప వీరుడుని కోల్పోయిందని సంతాపం తెలిపారు. అంతిమ యాత్రలో అర్షద్ కుమారులు రోదన చూసి అందరూ కన్నీళ్లు పెట్టుకున్నా దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. జమ్ము కశ్మీర్‌లో భద్రతపై అధికారులతో అమిత్ షా సమావేశమయ్యారు. జమ్ము అభివృద్ధిపై స్థానిక బిజెపి నేతలు, గవర్నర్‌ సత్యపాల్ మాలిక్ తో  సమావేశమయ్యారు.

 

Amit Shah Visits Martyr Arshad Khan’s family

The post నిన్ను చూసి దేశం గర్విస్తోంది: అమిత్ షా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: