కూల్ డ్రింక్స్‌లో మత్తు కలిపి అత్యాచారం

  అమరావతి: గుంటూరు జిల్లాలో ఓ యువతికి కూల్ డ్రింక్స్‌లో మత్తు పదార్థాలు ఇచ్చి అత్యాచారం చేశాడు ఓ యువకుడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కర్నూలు అమ్మాయి గుంటూరులో డిగ్రీ చదువుతోంది. హాస్టల్‌లో నుంచి ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేస్తూ యోగా క్షేమాలు అడిగి తెలుసుకునేది. యువతి సోదరుడు తన స్నేహితుడు బాలు ఫోన్ నుంచి తన చెల్లికి ఫోన్ చేశాడు. దీంతో బాలు పలుమార్లు అమ్మాయికి ఫోన్ చేసినా ఆమె తిరస్కరించింది. దీంతో అమ్మాయికి […] The post కూల్ డ్రింక్స్‌లో మత్తు కలిపి అత్యాచారం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

అమరావతి: గుంటూరు జిల్లాలో ఓ యువతికి కూల్ డ్రింక్స్‌లో మత్తు పదార్థాలు ఇచ్చి అత్యాచారం చేశాడు ఓ యువకుడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కర్నూలు అమ్మాయి గుంటూరులో డిగ్రీ చదువుతోంది. హాస్టల్‌లో నుంచి ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేస్తూ యోగా క్షేమాలు అడిగి తెలుసుకునేది. యువతి సోదరుడు తన స్నేహితుడు బాలు ఫోన్ నుంచి తన చెల్లికి ఫోన్ చేశాడు. దీంతో బాలు పలుమార్లు అమ్మాయికి ఫోన్ చేసినా ఆమె తిరస్కరించింది. దీంతో అమ్మాయికి ఫోన్ చేసి తాను లవ్ చేస్తున్నానని తనని ప్రేమించాలని బాలు బతిమాలాడు.

దీంతో అతడి మాటాలు నమ్మిన యువతి ప్రేమలో పడింది. ఒక రోజు కూల్ డ్రింక్స్‌లో మత్తు కలిపి ఇచ్చి ఆమెపై అత్యాచారం చేశాడు. ఎవరికైనా చెబితే సోషల్ మీడియాలో షేర్ చేస్తానని బెదిరించాడు. యువతి కుటుంబం గట్టిగా నిలదీయడంతో పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడు. స్థానిక ఎఎస్‌పి వైటి నాయుడుకు యువతి ఫిర్యాదు చేసింది. సదరు యువకుడిని ఎఎస్‌పి పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వడంతో పెళ్లి చేస్తుకుంటానని హామీ ఇవ్వడంతో పాటు ఒప్పంద పత్రాలు రాసుకున్నారు. కొన్ని రోజుల అనంతరం అమ్మాయి కుటుంబం 20 లక్షల రూపాయలు ఇస్తేనే పెళ్లి చేసుకుంటానని తాళి కట్టే ప్రసక్తేలేదని స్పష్టం చేశాడు. దీంతో తనకు న్యాయం చేయాలని యువతి తల్లిదండ్రులు, యువతి ధర్నా చేస్తున్నారు.

The post కూల్ డ్రింక్స్‌లో మత్తు కలిపి అత్యాచారం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: