పాప ప్రాణమే ఆ క్యాచ్… (వైరల్ వీడియో)

భూమ్మీద నూకలు మిగిలి ఉంటే ఎంతటి ప్రమాదం నుంచైనా బయటపదవచ్చు. అయితే, టర్కీలోని ఇస్తాంబుల్‌లో చోటు చేసుకున్న ఓ సంఘటన ఈ విషయాన్ని మరోసారి నిరూపించింది. ఓ చిన్నారి తల్లి కిచెన్‌లో వంట చేస్తుండగా ఆ చిన్నారి కిటికీ నుంచి తొంగి చూస్తూ ప్రమాదవశాత్తు కింద పడిపోయింది. అయితే, ఓ యువకుడు అదే ఇంటి కింద నిలబడ్డాడు. ఊరికే అలా ఎందుకో ఓసారి పైకి చూశాడు. అంతే రెండో అంతస్తు నుంచి చిన్నారి కిటికీలోంచి కింద పడుతుండటం […] The post పాప ప్రాణమే ఆ క్యాచ్… (వైరల్ వీడియో) appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

భూమ్మీద నూకలు మిగిలి ఉంటే ఎంతటి ప్రమాదం నుంచైనా బయటపదవచ్చు. అయితే, టర్కీలోని ఇస్తాంబుల్‌లో చోటు చేసుకున్న ఓ సంఘటన ఈ విషయాన్ని మరోసారి నిరూపించింది. ఓ చిన్నారి తల్లి కిచెన్‌లో వంట చేస్తుండగా ఆ చిన్నారి కిటికీ నుంచి తొంగి చూస్తూ ప్రమాదవశాత్తు కింద పడిపోయింది. అయితే, ఓ యువకుడు అదే ఇంటి కింద నిలబడ్డాడు. ఊరికే అలా ఎందుకో ఓసారి పైకి చూశాడు. అంతే రెండో అంతస్తు నుంచి చిన్నారి కిటికీలోంచి కింద పడుతుండటం గమనించాడు. దీంతో తక్షణమే అప్రమత్తమైన ఆ యువకుడు ఆ చిన్నారి కింద పడకుండా క్యాచ్ పట్టుకుని తన ప్రాణాలు కాపాడాడు. యువకుడు ఆ చిన్నారిని పట్టుకోకపోతే ఆ చిన్నారి ప్రాణాలతో మిగిలేది కాదని అక్కడి ప్రజలు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో అక్కడి సిసిటివిలో నమోదైంది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాద్యమాల్లో వైరల్ గా మారింది. చిన్నారి ప్రాణాలు కాపాడిన ఆ యువకుడిపై నెట్టింట్లో ప్రశంసల జల్లు కురుస్తుంది.

 

Baby who fell from second floor Caught By Teenager

The post పాప ప్రాణమే ఆ క్యాచ్… (వైరల్ వీడియో) appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: