మూడోస్సారి ముమ్మాటి తలాక్ బిల్లు

  న్యాయశాఖమంత్రి రవిశంకర్ ప్రసాద్ లోక్ సభలో మూడుసార్లు (28.12.17, 27.12. 18 సవరణ, 21.06.19) ‘ముస్లిం మహిళల వివాహ హక్కుల రక్షణ బిల్లు’ ప్రవేశపెట్టారు. రెండుసార్లు లోక్ సభ ఆమోదించినా రాజ్యసభ ఆమోదించనందున మోదీ ప్రభుత్వం 19.09.18న ఒక ఆర్డినెన్స్, ఫిబ్రవరి 2019లో మరో ఆర్డినెన్స్ జారీచేసింది. మూడో ఆర్డినెన్సూ అవసరమవచ్చు. పెద్దల మాట వినని వాళ్ళను మూర్ఖులంటాము. పెద్దల సభ ఆదేశాన్ని పాటించని ప్రభుత్వాన్ని ఏమనాలి? జూన్ 2016లో సంఘ్ ప్రేరేపిత ‘రాష్ట్రవాది ముస్లిం […] The post మూడోస్సారి ముమ్మాటి తలాక్ బిల్లు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

న్యాయశాఖమంత్రి రవిశంకర్ ప్రసాద్ లోక్ సభలో మూడుసార్లు (28.12.17, 27.12. 18 సవరణ, 21.06.19) ‘ముస్లిం మహిళల వివాహ హక్కుల రక్షణ బిల్లు’ ప్రవేశపెట్టారు. రెండుసార్లు లోక్ సభ ఆమోదించినా రాజ్యసభ ఆమోదించనందున మోదీ ప్రభుత్వం 19.09.18న ఒక ఆర్డినెన్స్, ఫిబ్రవరి 2019లో మరో ఆర్డినెన్స్ జారీచేసింది. మూడో ఆర్డినెన్సూ అవసరమవచ్చు. పెద్దల మాట వినని వాళ్ళను మూర్ఖులంటాము. పెద్దల సభ ఆదేశాన్ని పాటించని ప్రభుత్వాన్ని ఏమనాలి?
జూన్ 2016లో సంఘ్ ప్రేరేపిత ‘రాష్ట్రవాది ముస్లిం మహిళా సంఘ్’ ముస్లిం వ్యక్తిగత చట్టం షరియత్‌ను చట్టబద్ధీకరించమని సుప్రీం కోర్టును కోరింది. ముస్లిం స్త్రీల సామాజిక, ఆర్థిక స్థితి అధ్వానమని మోడీ సర్కారు కోర్టుకు అఫిడవిట్ ఇచ్చింది.

ఈ ప్రచారంతోనే యుపి ఎన్నికల్లో ముస్లిం మహిళల ఓట్లు సంపాదించారు. దీన్ని చట్టం చేస్తే లాభమని దురాశించారు. ఫలితమే ఈ బిల్లు. షమీమ్ ఆరా వర్సెస్ యుపి ప్రభుత్వం కేసులో తక్షణ తలాక్ చెల్లదని 2002 లో సుప్రీం కోర్టు తీర్పిచ్చింది. ముమ్మాటి తలాక్ రాజ్యాంగ విరుద్ధమని 22.08.17న అదే కోర్టు షాయరా బానో వర్సెస్ భారత ప్రభుత్వం కేసు కొట్టేసింది. ‘షరియత్ అనువర్తన చట్టం 1937’ ప్రకారం ముస్లిం మగాళ్ళు భార్యలకు ఏకపక్ష విడాకులివచ్చు. ముస్లిం మహిళ విడాకులివాలంటే ‘ముస్లిం వివాహ రద్దు చట్టం 1939’ ప్రకారం కోర్టుకు దరఖాస్తు చేసుకోవాలి.

ఈ చట్టాలను రాజ్యాంగ నిబంధన 14 పరిధిలో సవరించి, ముస్లిం మగాళ్ళ విడాకుల మార్గదర్శక చట్టం చేస్తామని అటార్నీ జనరల్ ఆగస్టు 2017లో సుప్రీం కోర్టుకు హామీ ఇచ్చారు. చట్ట సమానత్వం, సమాన చట్టరక్షణలను, జాతిమతకుల లింగస్థలాలతో, రాజ్యం ఎవరికీ నిరాకరించరాదని నిబంధన 14 చెప్పింది. ఈ బిల్లు, తక్షణ తలాక్ ను వారంట్ అక్కరలేని, బెయిల్ అవకాశంలేని క్రిమినల్ నేరంగా పరిగణించి, మూడేళ్ళ జైలు, జరిమానా విధించింది. కోర్టుకిచ్చిన హామీని తుంగలో తొక్కింది. ముస్లిం మహిళలకు రక్షణ. ముస్లిం మగాళ్ళకు శిక్ష. ఇతర బాధిత మహిళల రక్షణ, ఇతర నేర పురుషులకు శిక్ష లేవు. ఇది రాజ్యాంగ నిబంధన 14కి ఉల్లంఘన. ముస్లిం పెళ్లి సామాజిక ఒప్పందమే. పరస్పర ఆమోదంతో విడాకులు తీసుకోవచ్చు. మళ్ళీ పెళ్ళి చేసుకోవచ్చు. ముస్లిం పెళ్లిరద్దు పౌరనేరం. ఒప్పంద తప్పిదంగా సుప్రీం కోర్టు గుర్తించిన విడాకుల లోపాన్ని సరిచేయాలి కాని క్రిమినల్ నేరంగా శిక్షించరాదు.

ఈ చట్టంతో తలాక్ రద్దు కాదు. తక్షణ తలాక్ పై చర్యలుంటాయి. ఈ బిల్లులో పౌర, నేర చట్టాలను కలిపేశారు. చట్ట అమలు బాధ్యత కోర్టుకు కాకుండా పోలీసులకు అప్పజెప్పారు. దేశంలో 60% పోలీసులు, ఎక్కువ మంది వకీళ్ళు సంఘ్ కార్యకర్తలని ఒక సంఘ్ నాయకుడన్నాడు. పుకార్లతోనే ప్రాణాలు తీసే సంఘ్ సభ్యులు, సంఘ్‌తో మమేకమైన పోలీసులు, వకీళ్ళు ఏమైనా చేస్తారు. మత కక్ష తీర్చుకోవచ్చు. ముస్లిం మగాళ్ళపై సంఘ్ కర్రలు నర్తిస్తాయి. బిల్లులో క్రిమినాలిటీయే సమస్యని నాటి విదేశాంగ సహాయమంత్రి ఎమ్. జె. అక్బర్ బాధ. ఈ చట్టం బాధిత భార్యల కష్టాలు తొలగించదు, పెంచుతుంది. విడాకులిస్తానన్న భర్త జీవన భృతి చెల్లించాలి.

జైలు కెళ్ళిన భర్త భృతి ఎలా చెల్లిస్తాడు? బిల్లులో తాత్కాలిక సహాయ ప్రస్తావన లేదు. పరిహారం అందే వరకు బాధితురాలు ఎలా బతకాలి? బిల్లులో ప్రస్తావించిన జీవన భృతి ‘ముస్లిం మహిళల విడాకుల హక్కుల రక్షణ చట్టం 1986’ ప్రకారం చెల్లించే భృతికి అదనమా అన్న వివరణ లేదు. ముస్లిం వివాహ రద్దు చట్టం 1939 సెక్షన్ 2(3) ప్రకారం భర్తకు ఏడేళ్ళ జైలు పడితేనే ముస్లిం భార్య విడాకులకు అర్హురాలు. బిల్లులోని మూడేళ్ళ జైలుతో విడాకుల అర్హత రాదు. విడాకులు రానిదే మారుపెళ్ళి కుదరదు. ముస్లిం స్త్రీలను వేధించే బహుభార్యత్వం, నికాహ్ హలాలా వంటి దుశ్చర్యల నివారణ బిల్లులో లేదు.

మాజీ భర్తను మళ్ళీ పెళ్లాడాలంటే ముస్లిం స్త్రీ మరొకరిని పెళ్ళాడి అతనితో సంసారం చేయాలన్న నియమమే నికాహ్ హలాలా. దీనికి స్త్రీల సమ్మతి లేదు. దీనికీ భారీ రుసుం అద్దె మొగుళ్ళు తయారయ్యారు. 2018 సవరణ బిల్లు, భార్య వాదన విన్న తర్వాతే బెయిలు నిర్ణయించే అధికారం మేజిస్ట్రేటుకు ఇచ్చింది. రాజీకి అవకాశమిచ్చింది. భార్య లేదా ఆమె సన్నిహిత బంధువులే ఫిర్యాదు చేయాలంది. ఈ బిల్లు మానవత్వం, లింగసమానత, న్యాయం కోసమన్నారు. కానీ ఇది అమానవీయం. రాజ్యాంగ విరుద్ధం. శబరిమలలో స్త్రీల ప్రవేశాన్ని నిరోధించి లింగసమానతను సమాధిచేసిన బిజెపి ఈ బిల్లుతో లింగసమానత సాధిస్తుందట! భార్యను వదిలిన నేరానికి ముస్లిమేతర మగాళ్లకు ఏడాది శిక్ష ఉండగా ఈ బిల్లు ముస్లిం మగాళ్లకు మూడేళ్ళ జైలు శిక్ష విధించడం రాజ్యాంగ విరుద్ధం.

తలాక్‌తో, మతాలతో సంబంధం లేకుండా ముస్లిం స్త్రీలకు రక్షణ ఉంది. మహిళలందరికీ గృహ హింస నిరోధక చట్టం 2005, భారత శిక్షాస్మృతి 498(ఎ) అధికరణ వర్తిస్తాయి. సిపిసి 125 ప్రకారం భర్త భార్యాపిల్లలకు జీవనభృతి చెల్లించా లి. ముస్లిం స్త్రీలకు ’ముస్లిం మహిళల చట్టం’ రక్షణ కల్పిస్తుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం వివాహబంధంలో ఉన్న మహిళల్లో ముస్లింలు- 87.8%, హిందువులు -86.2%, క్రైస్తవులు- 83.7%, ఇతరులు-85.8%. వివాహబంధంలో ఎక్కువ ముస్లిం స్త్రీలే ఉన్నారు. పునర్వివాహ సౌకర్యం కారణం కావచ్చు. వితంతువుల్లో ముస్లింలు 11.1%, హిందువులు 12.9%, క్రైస్తవులు 14.6%, ఇతరులు 13.3%. ముస్లిం వితంతువులే తక్కువ. విడాకులు ఇవ్వకుండా వదిలేయబడిన మహిళల్లో హిందువులు- 0.69%, ముస్లింలు-0.67%, క్రైస్తవులు-1.19%, ఇతరులు-0.68%. వీళ్ళూ హిందువులే ఎక్కువ్.

దేశంలో అనాథ మహిళల సంఖ్య 24.5 లక్షలు. వీరిలో హిందువులు 20 లక్షలు. మస్లింలు 2.8 లక్షలు, క్రైస్తవులు 90 వేలు, ఇతరులు 80 వేలు. దేశంలో 4.3 కోట్ల మంది వితంతువులున్నారు. వారిలో 10 లక్షలు మంది ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నారు. పేద ధనిక, కుల మత భేదాలు లేకుండా ఏకవనిత జీవితం దుర్భరం. 46 ఏళ్ళ క్రితం వదిలేయబడ్డ జశోదా బెన్ మోదీ పిలిస్తే ఆయన దగ్గరకెళతానన్నారు. ఆయన పిలవనేలేదు. ఇందరు ఏకవనితలు ఏడుస్తోంటే ఎప్పుడో బాధపడబోయే ముస్లిం స్త్రీలే మోదీకి ఎందుకు కన్పించారు? ముస్లిం స్త్రీల ఓట్లు, ముస్లిం మగాళ్ల అణచివేత లక్షమా? తలాక్ ఖురాన్ సమ్మతమే. ముమ్మాటి తలాక్ కాదు.

సున్నీలోని 3 సంప్రదాయాల్లో తక్షణ తలాక్ చెల్లదు. నాల్గవ సంప్రదాయం దేవ్ బంద్ లోనే ఇది అమల్లో ఉంది. భారత ముస్లింలలో తక్షణ తలాక్ పాటించేవారి లెక్కలు ప్రభుత్వం దగ్గర లేవు. తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. ఒక స్వచ్ఛంద సంస్థ సర్వేలో 1% కంటే తక్కువ మంది ఈ పద్ధతిలో విడాకులిచ్చారని తేలింది. ఇంత తక్కువ మంది కోసం, సుప్రీంకోర్టు రెండు సార్లు రద్దుచేసిన తక్షణ తలాక్ పై హామీ తప్పిన బిల్లు అవసరమా?

రాజ్యాంగ నిబంధన 25(2) ప్రకారం ఆర్థిక, రాజకీయ ప్రగతికి మత అంశాల చట్టాలూ చేయచ్చు. తక్షణ తలాక్ బదులు ముస్లిం స్త్రీల ఆస్తి, వారసత్వ హక్కుల చట్టాలు చేయచ్చు. స్త్రీలందరికీ న్యాయం చేయాలి. మహిళా రిజర్వేషన్ తో స్త్రీలందరికీ మేలు జరిగేది. బిజెపికి లోక్ సభలో ఆధిక్యత ఉంది. కాంగ్రెస్ రాజ్యసభలో సహకరిస్తానంది. ఐనా మోదీ ఈ చట్టం ఊసెత్తరు. పాలకపక్షం రాజకీయలబ్ధికి మానవత్వం మరిచి రాజకీయం చేస్తోంది. లౌకికస్ఫూర్తి, సామాజిక చైత న్యం నేటి అవసరాలు. ఈ బిల్లు రాజ్యాంగ నిబంధన 14, కోర్టు ఆదేశం, కోర్టుకిచ్చిన హామీల వక్రీకరణ. నిబంధన 25(2) నిర్వీర్యమైంది. తాటిచెట్టు ఎక్కింది దూడగడ్డికన్నట్లు ఈ బిల్లు కుంటిసాకుల రాజ్యాంగ విరుద్ధ చర్య.

TS Rashtra Samithi May Skip Voting On Triple Talaq Bill

Related Images:

[See image gallery at manatelangana.news]

The post మూడోస్సారి ముమ్మాటి తలాక్ బిల్లు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: