ఆటోమొబైల్స్‌పై జిఎస్‌టి తగ్గింపు ఆర్థిక వ్యవస్థకు దోహదం: ఆనంద్ మహీంద్రా

  న్యూఢిల్లీ: ఆటోమొబైల్స్‌పై జిఎస్‌టి(వస్తు, సేవల పన్ను) తగ్గిస్తే అది దేశీయ ఆర్థిక వ్యవస్థకు దోహదం చేస్తుందని మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహింద్రా పేర్కొన్నారు. కంపెనీలన్నీ దీని కోసం పోరాటం చేస్తున్నాయని అన్నారు. బిఎస్6 పేరుతో జరిగిన ఓ సదస్సులో ఆయన మాట్లాడుతూ, చిన్న కంపెనీలు, ఉపాధి కల్పనపై ఆటోమొబైల్ రంగం పెను ప్రభావం చూపుతుందని, జిఎస్‌టి తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో మూడో వంతు ఉద్యోగాలు సృష్టించే ఆటోమొబైల్ రంగం మళ్లీ వృద్ధి దిశగా […] The post ఆటోమొబైల్స్‌పై జిఎస్‌టి తగ్గింపు ఆర్థిక వ్యవస్థకు దోహదం: ఆనంద్ మహీంద్రా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

న్యూఢిల్లీ: ఆటోమొబైల్స్‌పై జిఎస్‌టి(వస్తు, సేవల పన్ను) తగ్గిస్తే అది దేశీయ ఆర్థిక వ్యవస్థకు దోహదం చేస్తుందని మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహింద్రా పేర్కొన్నారు. కంపెనీలన్నీ దీని కోసం పోరాటం చేస్తున్నాయని అన్నారు. బిఎస్6 పేరుతో జరిగిన ఓ సదస్సులో ఆయన మాట్లాడుతూ, చిన్న కంపెనీలు, ఉపాధి కల్పనపై ఆటోమొబైల్ రంగం పెను ప్రభావం చూపుతుందని, జిఎస్‌టి తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో మూడో వంతు ఉద్యోగాలు సృష్టించే ఆటోమొబైల్ రంగం మళ్లీ వృద్ధి దిశగా పయనించాలంటే వాహనాలపై జిఎస్‌టిని తగ్గించాల్సిన అవసరం ఉందని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్(ఎఫ్‌ఎడిఎ) మాజీ అధ్యక్షుడు జాన్ కే పాల్ అన్నారు. ఇటీవలి కాలంలో ఆటోమొబైల్ విక్రయాలు తగ్గాయి. మే నెలలో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 20 శాతానికి పైగా తగ్గాయి.

Lowering GST on automobiles would help the economy

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఆటోమొబైల్స్‌పై జిఎస్‌టి తగ్గింపు ఆర్థిక వ్యవస్థకు దోహదం: ఆనంద్ మహీంద్రా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: