పంజాగుట్టలో ఆటోడ్రైవర్ల మధ్య ఘర్షన…

  హైదరాబాద్‌ : నగరంలోని పంజాగుట్టలోని ఒకే అడ్డలో ఆటోలు నడిపే ఇద్దరి అటో డ్రైవర్లు మధ్య జరిగిన ఘర్షణలో అన్వర్ అనే ఆటోడ్రైవర్ దారుణ హత్యకు గురయ్యాడు. తనకు హెచ్‌ఐవి ఉందని ప్రచారం చేపడుతున్న మహ్మద్ అన్వర్‌పై రియాసత్ ఆలీ కక్షకట్టాడు. వీరిద్దరు ఘర్షణపడటంతో 2016లోనూ రియాసత్ ఆలీపై కేసు నమోదైంది. గత రెండేళ్లుగా అన్వర్‌ను హత్య చేయాలని రియాసత్ ఆలీ కత్తిని కొనుగోలు చేసి ఆటోలోనే ఉంచుకున్నాడు. ఈ నేపథ్యంలో అన్వర్‌ను హత్య చేయాలని […] The post పంజాగుట్టలో ఆటోడ్రైవర్ల మధ్య ఘర్షన… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్‌ : నగరంలోని పంజాగుట్టలోని ఒకే అడ్డలో ఆటోలు నడిపే ఇద్దరి అటో డ్రైవర్లు మధ్య జరిగిన ఘర్షణలో అన్వర్ అనే ఆటోడ్రైవర్ దారుణ హత్యకు గురయ్యాడు. తనకు హెచ్‌ఐవి ఉందని ప్రచారం చేపడుతున్న మహ్మద్ అన్వర్‌పై రియాసత్ ఆలీ కక్షకట్టాడు. వీరిద్దరు ఘర్షణపడటంతో 2016లోనూ రియాసత్ ఆలీపై కేసు నమోదైంది. గత రెండేళ్లుగా అన్వర్‌ను హత్య చేయాలని రియాసత్ ఆలీ కత్తిని కొనుగోలు చేసి ఆటోలోనే ఉంచుకున్నాడు.

ఈ నేపథ్యంలో అన్వర్‌ను హత్య చేయాలని రియాసత్ ఆలీ పలుమార్లు ప్రయత్నించి విఫలమయ్యాడు. దీంతో బుధవారం సాయంత్ర పంజాగుట్టలోని అటో అడ్డాలో .రియాసత్ అలీ, మహ్మద్ అన్వర్‌ల మధ్య డబ్బుల విషయంలో గొడవ ప్రారంభమైంది. ఈ క్రమంలోనే ఇద్దరు కత్తులతో దాడి చేసుకున్నారు. ఆలీ చేసిన దాడిలో మహ్మద్ అన్వర్‌కు కడపులోని పేగులు బయటపడ్డాయి. తీవ్ర రక్తస్రావంతో ఉన్న అన్వర్ పంజాగుట్టలో పోలీస్ స్టేషన్ లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చి కుప్పకూలాడు.

విషయం గ్రహించిన పోలీసులు అహ్మద్ అన్వర్‌ను 108లో పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన అన్వర్ చికిత్స పొందుతూ మృతిచెందాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తున్నారు. నిందితుడు రియాసత్ ఆలీని అరెస్టు చేశామని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Auto Driver Brutally Murdered

Related Images:

[See image gallery at manatelangana.news]

The post పంజాగుట్టలో ఆటోడ్రైవర్ల మధ్య ఘర్షన… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: