ట్రేడ్ వార్ భారత్‌కు మంచి అవకాశం

  ప్రత్యామ్నాయం కోసం మల్టినేషనల్ సంస్థల చూపు ఆర్థికవేత్త అరవింద్ పనగారియా న్యూయార్క్: అమెరికా, చైనా దేశాల మధ్య ట్రేడ్ వార్(వాణిజ్య యుద్ధం) తీవ్రమైన నేపథ్యంలో బహుళజాతియ కంపెనీలను ఆకర్షించేందుకు భారత్‌కు ఇది మంచి అవకాశమని ప్రముఖ ఆర్థికవేత్త అరవింద్ పనగారియా అన్నారు. న్యూయార్క్‌లో భారత్ కాన్సులేట్ జనరల్ నిర్వహించిన ప్యానెల్ చర్చల్లో ఆయన మాట్లాడుతూ, అమెరికా చర్చలు జరపడం ద్వారా భారత్ దిగుమతి చేసుకునే మోటార్‌సైకిళ్లు, ఆటోమొబైళ్లపై సుంకాన్ని తగ్గించాలని పిలుపునిచ్చారు. ‘ఇది మల్టినేషనల్ సంస్థలు […] The post ట్రేడ్ వార్ భారత్‌కు మంచి అవకాశం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ప్రత్యామ్నాయం కోసం మల్టినేషనల్ సంస్థల చూపు
ఆర్థికవేత్త అరవింద్ పనగారియా

న్యూయార్క్: అమెరికా, చైనా దేశాల మధ్య ట్రేడ్ వార్(వాణిజ్య యుద్ధం) తీవ్రమైన నేపథ్యంలో బహుళజాతియ కంపెనీలను ఆకర్షించేందుకు భారత్‌కు ఇది మంచి అవకాశమని ప్రముఖ ఆర్థికవేత్త అరవింద్ పనగారియా అన్నారు. న్యూయార్క్‌లో భారత్ కాన్సులేట్ జనరల్ నిర్వహించిన ప్యానెల్ చర్చల్లో ఆయన మాట్లాడుతూ, అమెరికా చర్చలు జరపడం ద్వారా భారత్ దిగుమతి చేసుకునే మోటార్‌సైకిళ్లు, ఆటోమొబైళ్లపై సుంకాన్ని తగ్గించాలని పిలుపునిచ్చారు. ‘ఇది మల్టినేషనల్ సంస్థలు ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్నాయని, వాటిని ఆకర్షించేందుకు ఇది గొప్ప సమయం. వేతనాలు భారీగా పెరిగాయి, అమెరికా మార్కెట్లోకి మల్టినేషనల్ కంపెనీలకు వ్యతిరేక పరిస్థితులు ఉన్నాయి’ అని పనగారియా అన్నారు.

అయితే చైనా నుంచి బయటకి వస్తున్న కంపెనీలను ఆకర్షించేందుకు భారత్ తగిన ప్రోత్సాహకాలు అందించేందుకు సిద్ధమవుతున్నట్టు అధికార వర్గాల సమాచారం. కంపెనీలకు ఆకర్షించేందుకు వియత్నా అందించే ప్రిఫరెన్షియల్ టాక్స్ రేట్లు, టాక్స్ హాలిడే వంటి ఆర్థిక ప్రోత్సాహకాలు అందివ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఎలక్ట్రానిక్స్, కన్జూమర్ అప్లియెన్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, ఫుట్‌వేర్, టాయ్స్ సహా వంటి కంపెనీలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని వాణిజ్య మంత్రిత్వశాఖ నిర్ణయించినట్టు స్థానిక మీడియా సంస్థ వెల్లడించింది. వియత్నాం, మలేసియా వంటి ఆర్థిక వ్యవస్థలు ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా ప్రయోజనం పొందుతుండగా, భారత్ మాత్రం పెట్టుబడులను కోల్పోతోంది. దిగుమతులపై ఆధారపడకుండా, అలాగే ఎగుమతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టింది. దీనిపై స్పందించేందుకు వాణిజ్య మంత్రిత్వశాఖ నిరాకరించింది.

Trade war between the US and China

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ట్రేడ్ వార్ భారత్‌కు మంచి అవకాశం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: