పారిశుధ్ద్యం పాటించకుంటే…జరిమానాల కొరడా…

  వ్యాపార, అహార కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు మూడు రోజుల్లో 3,109 జరిమానాలు విధించిన మొత్తం రూ. 34,56,950లు బిర్యాని కేంద్రంపై రూ. 20 వేలు మూసాపేటలో మద్యం దుకాణాలకు రూ. 40,500లు తనిఖీలు కొనసాగిస్తున్న జిహెచ్‌ఎంసి హైదరాబాద్ : నగరంలోని వ్యాపార, ఆహారాల విక్రయ కేద్రాలూ… తస్మాత్ జాగ్రత్త…! పరిశుభ్రతను పాటించకపోతే జరిమానాలు తప్పవు. బిర్యానీ కేంద్రానికి రూ. 20 వేలు, మూసాపేట్ పరిధిలో నాలుగు మద్యం దుకాణాలపై రూ. 40,500లు, జూబ్లీహిల్స్ పరిధిలో రూ. […] The post పారిశుధ్ద్యం పాటించకుంటే… జరిమానాల కొరడా… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

వ్యాపార, అహార కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు
మూడు రోజుల్లో 3,109 జరిమానాలు
విధించిన మొత్తం రూ. 34,56,950లు
బిర్యాని కేంద్రంపై రూ. 20 వేలు
మూసాపేటలో మద్యం దుకాణాలకు రూ. 40,500లు
తనిఖీలు కొనసాగిస్తున్న జిహెచ్‌ఎంసి

హైదరాబాద్ : నగరంలోని వ్యాపార, ఆహారాల విక్రయ కేద్రాలూ… తస్మాత్ జాగ్రత్త…! పరిశుభ్రతను పాటించకపోతే జరిమానాలు తప్పవు. బిర్యానీ కేంద్రానికి రూ. 20 వేలు, మూసాపేట్ పరిధిలో నాలుగు మద్యం దుకాణాలపై రూ. 40,500లు, జూబ్లీహిల్స్ పరిధిలో రూ. 28,500లు, యూసుఫ్‌గూడలో రూ. 20వేలు, శేరిలింగంపల్లి పరిధిలో రూ. 16 వేలుగా పలు సంస్థలకు జరిమానాలను గ్రేటర్ అధికారులు విధించారు. మద్యం, ఆహార కేంద్రాల్లో అస్తవ్యస్తంగా నిర్వహణ ఉన్న అన్నిరకాల కేంద్రాలపై జిహెచ్‌ఎంసి అధికారులు ఆకస్మిక దాడులకు శ్రీకారం చుట్టారు. అపరిశుభ్రతగా ఉంటే చాలు చర్యలు తీసుకోవడంతోపాటు జరిమానాలు తప్పవని అధికార వర్గాలు తేల్చిచెప్పుతున్నాయి.

అందులో భాగంగానే ఈ నెల 24 నుంచి నగరంలోని ముఖ్యంగా వ్యర్థాలు పేరుకుపోతున్న, చెత్తను తరలించని, పరిశుభ్రతను పాటించని షాపులపై జరిమానాలు అధికంగా విధించి వారిలో మార్పును తీసుకురావాలని భావిస్తున్నది. 24 నుంచి 26వ తేదీ వరకు నిర్వహించిన తనిఖీల్లో 3,109 మందికి రూ. 34,56,950లు జరిమాన విధించినట్టు అధికరారవర్గాలు వెల్లడించాయి. అసలే వర్షాకాలం, తగ్గని ప్లాస్టిక్ వాడకం, మారిన వాతావరణ పరిస్థుతుల నేపథ్యంలో నగరవాసులు అనారోగ్యానికి గురికాకుండా, నగరం శుభ్రంగా ఉండేలా వ్యాపార, వాణిజ్య కేంద్రాలు, అహారం, మద్యం షాపులపై కన్నెర్ర చేయాలని గ్రేటర్ కమిషనర్ నిర్ణయించారు. ఈ తనిఖీలు కొనసాగుతాయని, జరిమానాలు విధించడం మరలమరల జరిగితే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అధికారులు స్పష్టంచేస్తున్నారు.

మద్యం దుకాణాలపై వరుసదాడులు

గ్రేటర్ హైదరాబాద్ పరిశుభ్రతకు జిహెచ్‌ఎంసి అధిక ప్రాధాన్యతనిస్తున్నది. ఇందులో భాగంగానే బుధవారం పలు సర్కిళ్ళ పరిధిలోని వ్యాపార, వాణిజ్య సంస్థలపై ఆకస్మిక తనిఖీలు నర్వహించి 71 షాపులకు రూ. లక్షా 60 వేలు వరకు జరిమానా విధించారు. నగరంలో రోడ్లపై చెత్త, వ్యర్థాలను వేసే వ్యాపార సంస్థలపై కఠినంగా వ్యవహరించాలని గ్రేటర్ అధికారులు భావిస్తున్నారు.

ముఖ్యంగా మద్యం, ఆహార కేంద్రాలు వంటి వాటి నుంచి నిత్యం వెలువడే వ్యర్థాలు, చెత్తను రీసైక్లింగ్ చేయడంలో యాజమాన్యాలు పట్టింపులేకుండా వ్యవహరిస్తున్నట్టు గ్రహించిన కమిషనర్ జరిమానాలు విధించాలని అధికారులను ఆదేశించినట్టు తెలిసింది. ఈ తనిఖీలు నిరంతరం జరిగేలా ప్రణాళికలను సిద్దంచేశారు. మరోవైపు సాఫ్, శాందార్ హైదరాబాద్ అంటూ కార్యక్రమాలను చేపడుతూ ప్రజల్లో నగర పరిసరాల పరిశుభ్రతపై అవగాహనను పెంచుతూ వస్తుండగా వ్యాపార కేంద్రాలు ఆ ఉద్దేశ్యాన్ని నీరుగారే ప్రయత్నం చేస్తుండటంపై తీవ్రంగా పరిగణిస్తున్నది. 30 సర్కిళ్ళ పరిధిలో గత రెండు రోజులు నిర్వహించిన తనిఖీల్లో 3,038 కేంద్రాలకు జరిమానాలుగా రూ. 32,96,750లను విధించారు.

Penalties for not practicing Sanitation

Related Images:

[See image gallery at manatelangana.news]

The post పారిశుధ్ద్యం పాటించకుంటే… జరిమానాల కొరడా… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: