ఆ క్యారెక్టర్ ఛాలెంజింగ్‌గా అనిపించింది

ఆది సాయికుమార్, మిస్తీ చక్రవర్తి, నైరాషా హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘బుర్రకథ’. డైమండ్ రత్నంబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం విడుదల కానుంది.ఈ సందర్భంగా హీరో ఆదితో ఇంటర్వూ విశేషాలు… పూర్తి ఎంటర్‌టైనర్‌గా… ఫ్యామిలీ అందరూ కలిసి హ్యాపీగా నవ్వుకుంటూ చూసే సినిమా ‘బుర్రకథ’. ఒక మనిషిలో రెండు బుర్రలు ఉంటాయని… ఈ కాన్సెప్ట్ చెప్పగానే కొత్తగా, ఆసక్తికరంగా అనిపించింది. ఎంటర్‌టైన్‌మెంట్ ఎక్కడా మిస్ అవ్వకుండా స్క్రిప్ట్ సిద్ధం చేశారు. ట్రైలర్ చూస్తే ఈ సినిమా […] The post ఆ క్యారెక్టర్ ఛాలెంజింగ్‌గా అనిపించింది appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఆది సాయికుమార్, మిస్తీ చక్రవర్తి, నైరాషా హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘బుర్రకథ’. డైమండ్ రత్నంబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం విడుదల కానుంది.ఈ సందర్భంగా హీరో ఆదితో ఇంటర్వూ విశేషాలు…
పూర్తి ఎంటర్‌టైనర్‌గా…
ఫ్యామిలీ అందరూ కలిసి హ్యాపీగా నవ్వుకుంటూ చూసే సినిమా ‘బుర్రకథ’. ఒక మనిషిలో రెండు బుర్రలు ఉంటాయని… ఈ కాన్సెప్ట్ చెప్పగానే కొత్తగా, ఆసక్తికరంగా అనిపించింది. ఎంటర్‌టైన్‌మెంట్ ఎక్కడా మిస్ అవ్వకుండా స్క్రిప్ట్ సిద్ధం చేశారు. ట్రైలర్ చూస్తే ఈ సినిమా పూర్తి ఎంటర్‌టైనర్ అనిపిస్తుంది. అంతేకాకుండా సినిమాలో మంచి భావోద్వేగాలు ఉంటాయి.
రెండు డిఫరెంట్ షేడ్స్‌లో…
ఈ చిత్రంలో రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న అభిరామ్ క్యారెక్టర్ చేశాను. అయితే అభి లాంటి క్యారెక్టర్ చాలా సినిమాల్లో చేశాను. కానీ రామ్ క్యారెక్టర్ నాకు కొత్త. ఆ క్యారెక్టర్ చేయడం ఛాలెంజింగ్‌గా అనిపించింది. ప్రేక్షకులు మాత్రం అభి రామ్ ఇద్దరినీ ఇష్టపడతారు.
కొంచెం కష్టమనిపించింది…
రెండు విభిన్నమైన ఛాయలున్న పాత్ర అని దర్శకుడు చెప్పగానే ఎంతో ఆసక్తిగా అనిపించింది. ఇక షూటింగ్ మొదటి మూడు రోజులు రెండు షేడ్స్ ఉన్న అభిరామ్ క్యారెక్టర్ చేయడం కష్టం అనిపించింది. కానీ ఆ తర్వాత ఇద్దరి మేనరిజమ్స్, ప్రవర్తన, వేరియేషన్ పట్టేశాను. అప్పటి నుండి సులభంగా షూటింగ్ చేసుకుంటూ వెళ్లిపోయాను.
సినిమాను బాగా నమ్మారు…
ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్ నాకు తండ్రిగా నటించారు. మొదటి రోజు నుండి ఆయన సినిమాను బాగా నమ్మారు. పెద్ద హిట్ అయ్యే కాన్సెప్ట్ అంటూ ఎప్పటికప్పుడు చెబుతుండేవారు. సినిమాలో నాకు, ఆయనకు మధ్య వచ్చే సన్నివేశాలు హిలేరియస్‌గా ఉంటాయి. మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఎలా ఉంటుందో స్క్రీన్ మీద చూడాల్సిందే.
హిలేరియస్‌గా నవ్విస్తారు…
పృథ్వీ సినిమాలో హిలేరియస్‌గా నవ్విస్తారు. ఆయన కామెడీ సినిమాకే హైలైట్. స్పూఫ్ కామెడీతో పృథ్వీ ఈజ్ బ్యాక్ అనిపిస్తారు.
తన రైటింగ్ పవర్‌తో…
దర్శకుడు డైమండ్ రత్నం తన రైటింగ్ పవర్‌తో ఫుల్ క్లారిటీగా ఈ సినిమాను తెరకెక్కించారు. దర్శకుడిగా ఆయనకిది మొదటి సినిమా కావడంతో అందరి నుండి బెస్ట్ అవుట్‌పుట్ తీసుకొని సినిమాను సిద్ధం చేశారు. ఈ సినిమా ఆయనకు మంచి డెబ్యూ అవుతుంది. విడుదల తర్వాత ఆయనకు దర్శకుడిగా మంచి గుర్తింపు వస్తుంది.
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ హైలైట్‌గా…
సినిమాకు సాయి కార్తీక్ అందించిన పాటల కంటే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ హైలైట్‌గా నిలుస్తుంది. కథకు తగ్గట్టుగా పర్ఫెక్ట్ స్కోర్ ఇచ్చారు.
పాజిటిక్ టాక్…
ఈ కథ నాకు రావడం, సినిమా విడుదలకు ముందే టీజర్, ట్రైలర్‌తో పాజిటివ్ టాక్ రావడం అదృష్టంగా భావిస్తున్నాను. టీజర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. మేము చెప్పాలనుకున్న కాన్సెప్ట్ ప్రేక్షకులకు బాగా రీచ్ అయింది.
తదుపరి చిత్రాలు…
నేను హీరోగా నటించిన ఆపరేషన్ గోల్డ్ ఫిష్, జోడీ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. త్వరలోనే వాటి రిలీజ్ డేట్స్‌ను ప్రకటిస్తారు.

Aadi Interview about Burrakatha movie

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఆ క్యారెక్టర్ ఛాలెంజింగ్‌గా అనిపించింది appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.