క్రికెట్‌కి క్రిస్ గేల్ గుడ్ బై…

లండన్: యూనివర్సల్ బాస్, వెస్టిండీస్ విధ్వసంకర ఆటగాడు క్రిస్ గేల్ త్వరలో అంతర్జాతీయ క్రికెట్‌కి గుడ్ బై చెప్పనున్నట్లు ప్రకటించాడు. సొంత గడ్డ మీద టీమిండియాతో జరిగే వన్డే, టెస్ట్ సిరీస్ అనంతరం అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్‌ల నుంచి తప్పుకోనున్నట్లు గేల్ ప్రకటించాడు. ఐసీసీ ప్రపంచకప్ తర్వాత క్రికెట్‌ ఆడబోనని గేల్ గతంలోనే చెప్పాడు. ఇండియాతో జరిగే మ్యాచ్‌కి ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో గేల్ తన రిటైర్‌మెంట్ గురించి మాట్లాడుతూ.. ‘ఇది ముగింపు కాదు. ఇంకొన్ని […] The post క్రికెట్‌కి క్రిస్ గేల్ గుడ్ బై… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.
లండన్: యూనివర్సల్ బాస్, వెస్టిండీస్ విధ్వసంకర ఆటగాడు క్రిస్ గేల్ త్వరలో అంతర్జాతీయ క్రికెట్‌కి గుడ్ బై చెప్పనున్నట్లు ప్రకటించాడు. సొంత గడ్డ మీద టీమిండియాతో జరిగే వన్డే, టెస్ట్ సిరీస్ అనంతరం అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్‌ల నుంచి తప్పుకోనున్నట్లు గేల్ ప్రకటించాడు. ఐసీసీ ప్రపంచకప్ తర్వాత క్రికెట్‌ ఆడబోనని గేల్ గతంలోనే చెప్పాడు. ఇండియాతో జరిగే మ్యాచ్‌కి ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో గేల్ తన రిటైర్‌మెంట్ గురించి మాట్లాడుతూ.. ‘ఇది ముగింపు కాదు. ఇంకొన్ని మ్యాచులు ఆడుతా.. ప్రపంచకప్ తర్వాత ఇండియాతో ఒక టెస్ట్ మ్యాచ్‌తోపాటు టీ-20, వన్డేలు కచ్చితంగా ఆడుతాను’ అని తెలిపాడు. కాగా, ఈ కరేబియన్ బ్యాట్స్‌మెన్ ఇప్పటి వరకూ తన కెరీర్‌లో 103 టెస్టులు, 294 వన్డేలు, 58 టీ20 మ్యాచులు ఆడాడు. టెస్టుల్లో 7,214, వన్డేల్లో 10,345, టీ20లో 1,627 పరుగులు చేశాడు.
Chriss gayle retire after ICC World Cup 2019

The post క్రికెట్‌కి క్రిస్ గేల్ గుడ్ బై… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.