ఆదుకున్న నీషమ్‌, గ్రాండ్‌హోమ్‌…పాక్ లక్ష్యం 238

  బర్మింగ్హమ్: ఐసిసి ప్రపంచకప్ లో భాగంగా పాకిస్థాన్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 237 పరుగులు చేసింది. దీంతో కివీస్, పాకిస్థాన్ జట్టుకు 238 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ కు ఆదిలోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. అమిర్ బౌలింగ్‌లో కివీస్ ఓపెనర్ గుప్తిల్(5) బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత షాహీన్ ఆఫ్రిదీ తన వరుస ఓవర్లలో మరో ఓపెనర్ […] The post ఆదుకున్న నీషమ్‌, గ్రాండ్‌హోమ్‌… పాక్ లక్ష్యం 238 appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

బర్మింగ్హమ్: ఐసిసి ప్రపంచకప్ లో భాగంగా పాకిస్థాన్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 237 పరుగులు చేసింది. దీంతో కివీస్, పాకిస్థాన్ జట్టుకు 238 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ కు ఆదిలోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. అమిర్ బౌలింగ్‌లో కివీస్ ఓపెనర్ గుప్తిల్(5) బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత షాహీన్ ఆఫ్రిదీ తన వరుస ఓవర్లలో మరో ఓపెనర్ మన్రో(12), రాస్ టేలర్(3)లను పెవిలియన్ చేర్చి న్యూజిలాండ్ కు గట్టి షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత వచ్చిన లాథమ్(1) ఘోరంగా విఫలమయ్యాడు.

ఈ దశలో నిలకడగా ఆడుతున్న కెప్టెన్ కేన్ విలియమ్స్(41) కూడా పెవిలియన్ చేరడంతో కివీస్ జట్టు 84 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో నీషమ్‌(97), గ్రాండ్‌హోమ్‌(63)లు అద్భుత పోరాటంతో జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ కలిసి పాక్‌ బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటూ స్కోరుబోర్డును పరుగులు పెట్టించారు. దీంతో కివీస్ 237 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేసి మళ్లీ రేసులోకి వచ్చింది. పాకిస్థాన్ బౌలింగ్‌లో షహీన్ 3 వికెట్లు పడగొట్టగా.. అమీర్, షాబాద్ లు తలో వికెట్ తీశారు.

New Zealand to set 238 runs target against Pakinstan

The post ఆదుకున్న నీషమ్‌, గ్రాండ్‌హోమ్‌… పాక్ లక్ష్యం 238 appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: