తండ్రి మరణ వార్త విని కూడా …దేశం కోసం ఆడింది…

ఢిల్లీ : తండ్రి మరణించాడు… ఈ వార్త ఆమెకు అందింది. అయినప్పటికీ దేశం కోసం ఆమె ఆడింది. తండ్రిని కడసారి చూసేందుకు వెళ్లకుండా తన జట్టు విజయం కోసం పోరాడింది. ఈ క్రమంలో ఆమె దేశ ప్రజలు గర్వించేలా తన హాకీ జట్టు విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించింది. ఆమె 19 ఏళ్ల భారత హాకీ క్రీడాకారిణి లాల్‌రెమ్సియామీ. మిజోరంకు చెందిన ఈ క్రీడాకారిణి చాలా మందికి తెలియదు. తండ్రి మరణ వార్త విని కూడా […] The post తండ్రి మరణ వార్త విని కూడా … దేశం కోసం ఆడింది… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఢిల్లీ : తండ్రి మరణించాడు… ఈ వార్త ఆమెకు అందింది. అయినప్పటికీ దేశం కోసం ఆమె ఆడింది. తండ్రిని కడసారి చూసేందుకు వెళ్లకుండా తన జట్టు విజయం కోసం పోరాడింది. ఈ క్రమంలో ఆమె దేశ ప్రజలు గర్వించేలా తన హాకీ జట్టు విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించింది. ఆమె 19 ఏళ్ల భారత హాకీ క్రీడాకారిణి లాల్‌రెమ్సియామీ. మిజోరంకు చెందిన ఈ క్రీడాకారిణి చాలా మందికి తెలియదు. తండ్రి మరణ వార్త విని కూడా దేశం కోసం ఆడిన ఆమె ఎంతోమందికి స్పూర్తిదాయకంగా నిలిచారు. లాల్‌రెమ్సియామీ భారత హాకీ మహిళల జట్టులో సభ్యురాలు. గత ఆదివారం ఈ జట్టు జపాన్‌లోని హిరోషిమాలో జరిగిన హాకీ ఎఫ్‌ఐహెచ్ అతిథ్య జపాన్ పై విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ జట్టు ఈ టోర్నీలో ఫైనల్‌కు చేరి 2020 ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. ఫైనల్ మ్యాచ్‌కు రెండు రోజుల ముందు లాల్‌రెమ్సియామీ తండ్రి లాల్‌తన్సంగా జోత్ కన్నుమూశారు. తండ్రి మరణ వార్తను లాల్‌రెమ్సియామీకి చేరవేశారు. ఫైనల్ మ్యాచ్ ఉండడంతో ఆమె తండ్రిని కడసారి చూసేందుకు సొంత ప్రాంతానికి రాలేదు. తన తండ్రి గర్వపడాలంటే తాను ఇక్కడే ఉండి టోర్నీలో ఆడాలని అని లాల్‌రెమ్సియామీ తన కోచ్‌కు చెప్పారట. ఈ క్రమంలో ఫైనల్ మ్యాచ్ ఆడి సాధించిన విజయాన్ని ఆమె తండ్రికి అంకితం చేశారు. మ్యాచ్ ముగిసిన తరువాత ఆమె స్వగ్రామానికి చేరుకుని తండ్రికి నివాళులు అర్పించారు.

Hockey Player Lalremsiyami Misses Dad Funeral

Related Images:

[See image gallery at manatelangana.news]

The post తండ్రి మరణ వార్త విని కూడా … దేశం కోసం ఆడింది… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: