కీలక దశకు నిజాం నిధుల పంచాయతీ…

  లండన్ : దేశ విభజన సమయంలో హైదరాబాద్ నిజాంకు చెందిన 35 మిలియన్ పౌండ్లపై భారత పాకిస్థాన్‌ల మధ్య దశాబ్దాలుగా సాగుతున్న న్యాయపోరాటం బ్రిటన్ హైకోర్టులో ఒక ముఖ్యమైన దశకు చేరుకుంది. గతంలో ఈ ధనాన్ని లండన్ బ్యాంకులో డిపాజిట్ చేశారు. లండన్‌లోని నాట్ వెస్ట్ బ్యాంక్‌లో ఉన్న ఈ నిధుల గురించి పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న న్యాయపోరాటంలో నిజాం వారసులు ప్రిన్స్ ముకర్రంజా, ఆయన తమ్ముడు ముఫఖం ఝా భారత ప్రభుత్వంతో చేతులు కలిపారు. […] The post కీలక దశకు నిజాం నిధుల పంచాయతీ… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

లండన్ : దేశ విభజన సమయంలో హైదరాబాద్ నిజాంకు చెందిన 35 మిలియన్ పౌండ్లపై భారత పాకిస్థాన్‌ల మధ్య దశాబ్దాలుగా సాగుతున్న న్యాయపోరాటం బ్రిటన్ హైకోర్టులో ఒక ముఖ్యమైన దశకు చేరుకుంది. గతంలో ఈ ధనాన్ని లండన్ బ్యాంకులో డిపాజిట్ చేశారు. లండన్‌లోని నాట్ వెస్ట్ బ్యాంక్‌లో ఉన్న ఈ నిధుల గురించి పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న న్యాయపోరాటంలో నిజాం వారసులు ప్రిన్స్ ముకర్రంజా, ఆయన తమ్ముడు ముఫఖం ఝా భారత ప్రభుత్వంతో చేతులు కలిపారు. 1948లో అప్పటి హైదరాబాద్ నిజాం నవాబు నుంచి బ్రిటన్‌లో పాకిస్థాన్ హై కమిషనర్‌కు బదిలీ చేసిన 1,007,940 పౌండ్లకు సంబంధించే వివాదం ఏర్పడింది. కాలక్రమేణా ఆ మొత్తం పెరిగి కొన్ని మిలియన్లకు చేరుకుంది.

భారతదేశం మద్దతిచ్చిన నిజాం వారసులు ఆ ధనం తమదేనన్నారు. కానీ అది నిజానికి తమకే చెందుతుందని పాకిస్థాన్ వాదించింది. ‘తమ తాత తమకు కానుకగా ఇచ్చిన ఆ నిధిని పొందడానికి ఎనిమిదో నిజాం, అతని తమ్ముడు దశాబ్దాల తరబడి నిరీక్షించారు. అందుకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా పాకిస్థాన్ 70 ఏళ్లు అడ్డుకుంది. ఇప్పటి విచారణతో వివాదం పరిష్కారమవుతుందని అనుకొంటున్నాం’ అని నిజాం పూర్వీకులకు ప్రాతినిధ్యం వహిస్తున్న విథర్స్ లా కంపెనీ భాగస్వామి పాల్ హెవిట్ లండన్ రాయల్ కోర్టులో అన్నారు. బ్రిటన్‌లో పాక్ హై కమిషనర్ ఒక వైపు నిజాం వారసులతో సహా మరో ఏడుగురు, ఇండియన్ యూనియన్, భారత రాష్ట్రపతి మరోవైపు ఉన్న ఈ కేసు విచారణ జస్టిస్ మార్కస్ స్విత్ సారథ్యంలో రెండు వారాలు సాగింది. మరో ఆరు వారాల్లో ఈ కేసులో తీర్పు వస్తుందనుకుంటున్నారు.

Inquiry into Nizam’s Funds

Related Images:

[See image gallery at manatelangana.news]

The post కీలక దశకు నిజాం నిధుల పంచాయతీ… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.