కచోరీల షాపు…60లక్షల ఆదాయం

అలీగఢ్ : అది కచోరీలు, సమోసాలు అమ్ముకునే చిన్న షాపు.. కానీ అక్కడ జరిగే వ్యాపారం మాత్రం పెద్ద మొత్తం. ఏటా రూ.60 లక్షలు. యుపిలోని అలీగఢ్‌కు చెందిన ముఖేష్… కచోరి పేరుతో సీమా సినిమా హాల్ సమీపంలో దుకాణాన్ని రోజూ ఉదయాన్నే తెరిచి రాత్రి పొద్దుపోయేదాకా నడిపిస్తారు. ఇక్కడ వండివార్చే సమోసాలు, కచోరీలు రుచిగా ఉంటాయని పేరు. దీంతో స్థానికుల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. రోజూ కస్టమర్ల తాకిడితో కౌంట ర్ కళకళలాడటంతో ఎవరో గుర్తు […] The post కచోరీల షాపు…60లక్షల ఆదాయం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

అలీగఢ్ : అది కచోరీలు, సమోసాలు అమ్ముకునే చిన్న షాపు.. కానీ అక్కడ జరిగే వ్యాపారం మాత్రం పెద్ద మొత్తం. ఏటా రూ.60 లక్షలు. యుపిలోని అలీగఢ్‌కు చెందిన ముఖేష్… కచోరి పేరుతో సీమా సినిమా హాల్ సమీపంలో దుకాణాన్ని రోజూ ఉదయాన్నే తెరిచి రాత్రి పొద్దుపోయేదాకా నడిపిస్తారు. ఇక్కడ వండివార్చే సమోసాలు, కచోరీలు రుచిగా ఉంటాయని పేరు. దీంతో స్థానికుల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. రోజూ కస్టమర్ల తాకిడితో కౌంట ర్ కళకళలాడటంతో ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ఇంకేముంది వాణిజ్య పన్నుల శాఖ అధికారులు రంగంలోకి దిగారు. షాప్ ఎదురుగా ఉన్న మరో దుకాణంలో ఒక రోజు తిష్ట వవేశారు. అధికారు లు అక్కడ జరిగే తంతును గమనించారు. ముఖేష్ కచోరీలు, సమోసాలపై ఏటా రూ. 60 లక్షల నుంచి రూ కోటికి పైగానే ఆర్జిస్తాడని అంచనా వేశారు. అధికారులు ఆరా తీయడంతో కంగుతిన్న ముఖేష్ తనకు ఇవేమీ తెలియవని, గత 12 ఏళ్లుగా తాను ఈ షాపును నడిపిస్తున్నా ఇలాంటివి ఉంటాయని తనకు ఎవరూ చెప్పలేదని అధికారులతో వాపోయాడు. తాను బతికేందుకు చిన్న స్ధాయిలో ఈ వ్యాపారం చేసుకుంటున్నానని చెప్పడంతో అధికారులు విస్తుపోయారు.

ముఖేష్ తన వ్యాపారం గురించి పూర్తిగా చెప్పాడని, ఎంత ఆదా యం వస్తుంది నూనె, సిలిండర్ వంటి ముడి సరుకులకు ఎంత ఖర్చవుతుందనేది చెప్పాడని ఈ కేసును విచారించిన రాష్ట్ర ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్‌ఐబి) సభ్యుడు తెలిపారు. రూ.40 లక్షల వార్షిక టర్నోవర్ ను మించిన వారంతా జిఎస్‌టి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని, సిద్ధం చేసిన ఆహారం పై 5 శాతం పన్ను విధిస్తారని చెప్పారు. ముఖేష్‌కు నోటీసు జారీ చేసిన అధికారులు అతనితో జిఎస్‌టి రిజిస్ట్రేషన్ చేయించి పన్ను వసూలు చేసే ప్రక్రియను చేపట్టారు. అసంఘటిత రంగంలో ఇలాంటి వ్యాపారులు ఎందరో అవగాహన లేమితో జిఎస్‌టి ఎగవేతకు పాల్పడుతున్నారని, వారందరినీ పన్ను పరిధిలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు ముమ్మ రం చేస్తామని అధికారులు చెబుతున్నారు.

Aligarh kachori seller earns Rs 60 lakh

Related Images:

[See image gallery at manatelangana.news]

The post కచోరీల షాపు…60లక్షల ఆదాయం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: