తహసీల్దార్ కార్యాలయానికి తాళం

మన తెలంగాణ/కురవి : రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు దున్నే వారిదే భూమి అనే నినాధంతో ముందుకు వచ్చి అర్హులైన రైతులకు ఉచితంగా పట్టా పాసు బుక్కులు తయారు చేసి రైతులకు అందించాలని ఉన్నప్పటికి ఇదే ఆసరా చేసుకున్న విఆర్‌ఓలు అధికంగా డబ్బులు తీసుకొని కూడా పట్టా పాసుబుక్కులు ఇవ్వడంలేదని ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు మంగళవారం కురవి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంకు తాళం వేసి అంతకు ముందు ఫర్నీచర్ బయటకు పడేసి ఆఫీస్ ముందు […] The post తహసీల్దార్ కార్యాలయానికి తాళం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మన తెలంగాణ/కురవి : రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు దున్నే వారిదే భూమి అనే నినాధంతో ముందుకు వచ్చి అర్హులైన రైతులకు ఉచితంగా పట్టా పాసు బుక్కులు తయారు చేసి రైతులకు అందించాలని ఉన్నప్పటికి ఇదే ఆసరా చేసుకున్న విఆర్‌ఓలు అధికంగా డబ్బులు తీసుకొని కూడా పట్టా పాసుబుక్కులు ఇవ్వడంలేదని ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు మంగళవారం కురవి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంకు తాళం వేసి అంతకు ముందు ఫర్నీచర్ బయటకు పడేసి ఆఫీస్ ముందు ధర్నాకు దిగారు. రైతులకు తెలంగాణ గిరిజన సంఘం జిల్లా నాయకులు మాలోతు కిషన్‌నాయక్, దళిత సంఘం నాయకులు వెంకన్న మద్దతు తెలిపారు. పట్టా పాసుబుక్కులు ఇచ్చే వరకు ఇక్కడి నుంచి వెళ్ళమంటూ కార్యాలయం ముందు నినాధాలు చేశారు. పట్టాలు చేయడం కోసం విఆర్‌ఓలు లక్షలు వసూళ్ళు చేసి కూడా భూమి పట్టాలు చేయడంలేదని ఆవేధన వ్యక్తం చేశారు. కార్యాలయం చుట్టూ ఎన్నిమార్లు తిరిగిన విఆర్‌ఓలు తప్పించుకు తిరుగుతున్నారని ఆరోపించారు.

భూమి పట్టా చేస్తానని విఆర్‌ఓలు డబ్బులు తీసుకున్నారని పై అధికారులకు పిర్యాదు చేసిన చర్యలు తీసుకోవడంలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని గుండ్రాతిమడుగు స్టేషన్, గుండ్రాతిమడుగు(వి) కురవి, ఉప్పరిగూడెం, సీరోలు, నేరడ గ్రామాలకు చెందిన విఆర్‌ఓలు లక్షలు వసూళ్ళు చేసి భూమి పట్టాలు చేయకుండా తప్పించుకు తిరుగుతున్నారని ఆర్డీఓ వచ్చే వరకు ఆందోళన ఆపేదిలేదని పెద్ద ఎత్తున ఉదృక్తం శృష్టించారు. దీంతో కురవి ఎస్‌ఐ నాగభూషణం అక్కడికి చేరుకొని రైతులను నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. కానీ రైతులు పెద్ద ఎత్తున నినాధాలు చేశారు. మీలాంటి అధికారుల వల్లనే ప్రభుత్వానికి చెడు పేరు వస్తుందని కార్యాలయం ముందు భైటాయించారు. రైతులపై ఓవర్ యాక్షన్ చేయడానికి ప్రయత్నించిన రైతులు తిరగపడ్డారు. దీంతో ఎస్‌ఐ నాగభూషణం తన పోన్ ద్వారా తహశీల్థార్‌తో మాట్లాడి 15 రోజులలో పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఉపసంహరించుకున్నారు.

farmers protest at kuravi mro office

Related Images:

[See image gallery at manatelangana.news]

The post తహసీల్దార్ కార్యాలయానికి తాళం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.