పోలీస్ వీక్లీ ఆఫ్‌కు ప్రత్యేక సాఫ్ట్‌వేర్

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర పోలీసు శాఖ ఉన్నతాధికారులు పోలీసులకు ఇకపై వీక్లీ ఆఫ్ ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు వారాంతపు సెలవులకు సంబంధించి విధివిధానాలను రూపొందించారు. పోలీసు శాఖలో వేర్వేరు విభాగాలలో పనిచేసే పోలీసు సిబ్బందికి వీక్లీ ఆఫ్‌లు రూపొందించారు. కోర్టు, గార్డు, ఎస్కార్ట్ కానిస్టేబుళ్లతో పాటు ఇతర విభాగాలలోని పోలీసులకు నెలలో 360 గంటల పాటు విధులు నిర్వహించాలన్న నిబంధనలు విధించనున్నారు. అలాగే కోర్టు కానిస్టేబుళ్లకు ఆదివారం కోర్టుకు సెలవు కావడంతో ఆ […] The post పోలీస్ వీక్లీ ఆఫ్‌కు ప్రత్యేక సాఫ్ట్‌వేర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర పోలీసు శాఖ ఉన్నతాధికారులు పోలీసులకు ఇకపై వీక్లీ ఆఫ్ ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు వారాంతపు సెలవులకు సంబంధించి విధివిధానాలను రూపొందించారు. పోలీసు శాఖలో వేర్వేరు విభాగాలలో పనిచేసే పోలీసు సిబ్బందికి వీక్లీ ఆఫ్‌లు రూపొందించారు. కోర్టు, గార్డు, ఎస్కార్ట్ కానిస్టేబుళ్లతో పాటు ఇతర విభాగాలలోని పోలీసులకు నెలలో 360 గంటల పాటు విధులు నిర్వహించాలన్న నిబంధనలు విధించనున్నారు. అలాగే కోర్టు కానిస్టేబుళ్లకు ఆదివారం కోర్టుకు సెలవు కావడంతో ఆ రోజును వీక్లీ ఆఫ్‌గా పరిగణించనున్నారు. ఈక్రమంలో పోలీసుల వారాంతపు సెలవులో అనేక విధానాలను అమలు చేయనున్నారు. ముఖ్యంగా రోజు విడిచి రోజు ఆన్-ఆఫ్ విధానం ద్వారా ఇద్దరు ఉద్యోగులను ఒక జట్టుగా బడ్డీ పెయిర్స్ ఏర్పాటు చేస్తారు. ఒకరు 24 గంటలు డ్యూటీలో ఉంటే మరొకరు 24 గంటలు చేస్తారు. ఎస్‌హెచ్‌వో రోజు మార్చి రోజు 24 గంటలు ఆఫ్ తీసుకోవచ్చని. ఈ క్రమంలో నెలకు 360 గంటల పాటు డ్యూటీలో ఉన్నా అందులో 120 గంటలు అప్రమత్తంగా, మిగిలిన 240 గంటలు నామమాత్రంగా ఉండాలని ఆదేశాలిచ్చారు. అదేవిధంగా 4 రోజుల డ్యూటీ తర్వాత ఆఫ్ తీసుకునే విధానం సైతం రూపొందించారు. ఇందులో ఇద్దరు కానిస్టేబుళ్లను ఒక జట్టుగా జత చేస్తారు. కానిస్టేబుళ్లు స్వాపింగ్ పద్దతిలో డ్యూటీ చేసుకోవచ్చు.

4 రోజులు డ్యూటీ తరువాత సెలవు వస్తుంది. ఒకరు సెలవులో ఉంటే రెండో కానిస్టేబుల్ విధి నిర్వహణలో ఉండే విధంగా నిర్ణయం తీసుకున్నారు. అలాగే 7 రోజుల ఆన్-ఆఫ్ విధానంలో ఒకరు పగలు డ్యూటీ వారం చేస్తే మరొకరు రాత్రి డ్యూటీ చేస్తారు. వారం తర్వాత డ్యూటీలు మార్చుకుని వారి వారాంతపు సెలవును వినియోగించుకునేలా రూపొందించారు. ఈ నేపథ్యంలో 7 రోజుల పాటు విధులు నిర్వహిస్తే ఒక సెలవు ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకున్నారు.కాగా 2 షిఫ్టులు 1:1 పద్దతిలో ముగ్గురు కానిస్టేబుళ్లు ఒక గ్రూపులో ఉంటారు. పగలు, రాత్రి 2 షిఫ్టులు ఉంటాయి. గ్రూపులో ఒకరు పగలు మరొకరు రాత్రి షిఫ్టులో ఉంటారు. మూడో వ్యక్తి సెలవులో ఉంటారు. అలా 12 గంటల డ్యూటీ తర్వాత 24 గంటల సెలవు వస్తుంది. నెలకు 240 గంటల పని విధానం అమలు చేయనున్నారు. అదేవిధంగా 2 షిఫ్టులు 3:1 పద్దతిలో స్టేషన్లలో సిబ్బందిని ఒక గ్రూపులో 6మంది ఉండేలా విభజిస్తారు. వీరిలో ఉదయం షిప్టులో ముగ్గురు, రాత్రి ఫిఫ్టులో ఒకరు డ్యూటీ చేస్తారు. ఇద్దరు ఉద్యోగులు సెలవులో ఉంటారు.

ఆ తర్వాత ప్రతివారం డ్యూటీలు మార్చుకోవాల్సి ఉంటుంది. 2 షిఫ్టులు 4:2 పద్దతిలో తొమ్మిది మంది సిబ్బందికి సంబంధించి బాధ్యతలు విభజిస్తారు అందులో నలుగురికి ఉదయం, ఇద్దరికి నైట్ షిప్టు డ్యూటీలు, మరో ముగ్గురు సెలవులో ఉంటారు. వీరిని ’ఏ, బీ, సీ, డీ, ఈ, ఎఫ్, జీ, హెచ్, ఐగా విభజించి డ్యూటీలు నిర్ణయిస్తారు. మొత్తం తొమ్మిది రోజుల్లో 3 సెలవులు ఉంటాయి. 2 షిఫ్టులు 5:1 పద్దతిలో 9 మంది గ్రూపులో 5 మంది పగటిపూట షిఫ్టులో, ఒకరు రాత్రి షిఫ్టులో పని చేస్తారు. ఒకరికి 9 రోజుల్లో 3 సెలవులు ఉంటాయి. నెలకు 240 గంట్ల విధులు నిర్వహించాల్సి ఉంటుంది.2 షిఫ్టులు 5:3 విధానంలో 12 మంది సిబ్బంది గ్రూపుగా ఉంటే, 5 మంది పగటి డ్యూటీలో, ముగ్గురు రాత్రి విధుల్లో, మిగిలిన వారు సెలవులో ఉంటారు. మొత్తం 12 రోజుల్లో ఒక ఉద్యోగికి 5 పగటి షిఫ్టులు, 3 రాత్రి షిఫ్టులు, 4 సెలవులు ఉంటాయి. 2 షిఫ్టులు 7:1పద్దతిలో 12 మందిని ఒక గ్రూపుగా విభజించి, పగటి డ్యూటీలో 7మంది, రాత్రి డ్యూటీలో ఇద్దరు ఉండేలా చార్ట్ తయారు చేస్తారు. ప్రతి ఉద్యోగికి 7 పగటి డ్యూటీలు, 1 రాత్రి షిఫ్ట్ ఉంటుంది. 12 రోజుల్లో ప్రతి ఉద్యోగికి 4 సెలవులు ఉంటాయి.అలాగే 2 షిఫ్టులు 9:1 పద్దతిలో 15 మంది సిబ్బంది గ్రూపుగా ఉంటే, మార్నింగ్ షిప్టులు ఎక్కువగా, రాత్రి డ్యూటీలు తక్కువగా ఉంటాయి. ప్త్రి 15 రోజుల్లో 5 సెలవులు ఉంటాయి.

9 పగటి డ్యూటీలు, 1 రాత్రి డ్యూటీ చేయాల్సి ఉంటుంది.కాగా రెండు షిఫ్టులు 8:2 పద్దతి విధానంలో ఒక గ్రూపులో మొత్తం 15 మంది ఉంటారు. వీరిలో 8 మంది పగటి షిఫ్టులో, ఇద్దరు రాత్రి షిఫ్టులో విధులు నిర్వర్తిస్తారు. 15 రోజుల్లో ఒక ఉద్యోగికి 8 డే షిఫ్టులు, 2 రాత్రి షిఫ్టులు, 5 సెలవులు ఉంటాయి. అలాగే రెండు షిఫ్టులు 7:3 పద్దతి విధానంలో ఒక గ్రూపులో మొత్తం 15 మంది ఉంటారు. రోజులో పగటి షిఫ్టులో 7 మంది పగటి షిఫ్టులో, ముగ్గురు రాత్రి షిఫ్టులో పని చేస్తారు. ఒక ఉద్యోగికి 15 రోజుల్లో ఏడు పగటి షిఫ్టులు, 3 రాత్రి షిఫ్టులు, 5 సెలవులు ఉంటాయి. రెండు షిఫ్టులు 6:4 పద్దతిలో మొత్తం 15 మందిలో డే డ్యూటీలో 6 మంది, నైట్ డ్యూటీలో నలుగురు ఉంటారు. ప్రతి ఉద్యోగికి 15 రోజుల్లో 6 పగలు, 4 రాత్రి డ్యూటీలు, 5 సెలవులు ఉంటాయి. ఈక్రమంలో మూడు షిఫ్టుల పద్దతిలో మొత్తం సిబ్బందిని 3 టీములుగా విభిజిస్తారు. వీరు మూడు షిఫ్టుల్లో పని చేస్తారు. ఏ టీమ్ ఉద్యం 7 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు పని చేస్తే, బీ టీమ్ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 9 వరకు పని చేస్తుంది.

ఇక సీ టీమ్ రాత్రి 9 నుంచి మరుసటి రోజు ఉదయం 7 గంటల వరకు పని చేస్తుంది. మొదటి షిఫ్టులో ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు పని చేసిన ఎ టీమ్.. మళ్లీ మరుసటి రోజు రాత్రి 9 గంటల డ్యూటీ చేస్తారు. వీరికి మధ్యలో 32 గంటల విరామం ఉంటుంది. అలా.. బి టీమ్‌కు 10 గంటలు, సీ టీమ్‌కు 6 గంటల విరామం ఉంటుంది. ఈ విరామ సమయాలు ఒక టీమ్ తర్వాత మరొక టీమ్‌కు మారుతూ ఉంటాయి. వీక్లీ ఆఫ్ విధానంలో మొత్తం సిబ్బందిలో ప్రతి 7 మందిలో ఒకరికి చొప్పున ప్రతిరోజూ సెలవు – ఈ విధానం.. జనరల్, ట్రాఫిక్ డ్యూటీలోని కానిస్టేబుల్స్‌కు వర్తింపచేయనున్నారు. కోర్టు కానిస్టేబుల్‌కు ఆదివారం సెలవు ఇచ్చే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. అదేవిధంగా ఆదివారం సెలవు కావడంతో స్టేషన్ రైటర్‌కు కూడా ఆదివారం వీక్లీ ఆఫ్ ఇచ్చే విధంగా పరిశీస్తున్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఎపిఎస్‌పి పోలీసుల్లో అనుమతి విధానం విజయవంతంగా అమలైంది. 11 లేదా 12 మందిని సెక్షన్‌గా నిర్ణయిస్త్తారు. వీరిలో ఇద్దరు చొప్పున్ ప్రతి 4 రోజులకు సెలవు తీసుకునే అవకాశం ఉంటుంది
గార్డు డ్యూటీల విధానంలో 5 మందిలో ముగ్గురు మూడు రోజులు విధుల్లో ఉంటే, రెండు రోజులు ఆఫ్ తీసుకోవచ్చు. నెల్కు 288 గంట్ల విధులు నిర్వహించాలి. అందులో 144 గంటలు యాక్టివ్ గా ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. అలాగే ఎస్కార్ట్ సిబ్బంది విధానంలో 3 రోజులపాటు ఎస్కార్ట్ డ్యూటీలో ఉంటే, మూడు రోజుల డ్యూటీకి ముందు రోజు, తర్వాతి రోజు సెలవు లభించే విదంగా నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సెలవుల విధానం కోసం ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్ రూపొందిస్తున్నారు. ఈ 19 విధానాల్లో ఏదో ఒక విధానాన్ని, ఉద్యోగుల డ్యూటీల వివరాలను పర్యవేక్షణాధికారులు ప్రతి నెల 25వ తేదీన సాఫ్ట్‌వేర్‌లో పొందుపర్చాలి ఉంటుంది. అలా సాఫ్ట్‌వేర్‌లో అప్‌లోడ్ చేశాక, రానున్న నెల రోజులకు సంబంధించిన ఉద్యోగుల డ్యూటీ చార్ట్‌లను, వారి సెలవులను ఆ సాఫ్ట్‌వేర్.. జనరేట్ చేస్తుంది. ప్రతి నెల 25వ తారీఖున నోటీస్ బోర్డులో ఈ డ్యూటీ చార్ట్‌ను ఉంచాలని ఆదేశాలిచ్చారు.

Special software for Police Weekly OffRelated Images:

[See image gallery at manatelangana.news]

The post పోలీస్ వీక్లీ ఆఫ్‌కు ప్రత్యేక సాఫ్ట్‌వేర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: