త్వరలో కాంగ్రెస్‌కు రాజీనామా

మరి 20ఏళ్లకైనా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాదు – కోమటి రెడ్డి రాజగోపాల్‌రెడ్డి మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీగా పూర్తి చచ్చిపోయిందని, ఇక రాష్ట్రంలో హస్తానికి భవిష్యత్ లేదని ఆ పార్టీనీ వీడేందుకు సిద్దంగా ఉన్న ఎంఎల్‌ఎ కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కొద్ది రోజుల క్రితం వరకు పార్టీ వెంటిలేటర్‌పై ఉందని, బతుకుందన్న ఆశతో ఇంతకాలం తో ఎదురుచూశానని అన్నారు. కాని పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యవహారశైలి కారణంగా కాంగ్రెస్ పార్టీకి ఏ మాత్రం […] The post త్వరలో కాంగ్రెస్‌కు రాజీనామా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మరి 20ఏళ్లకైనా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాదు – కోమటి రెడ్డి రాజగోపాల్‌రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీగా పూర్తి చచ్చిపోయిందని, ఇక రాష్ట్రంలో హస్తానికి భవిష్యత్ లేదని ఆ పార్టీనీ వీడేందుకు సిద్దంగా ఉన్న ఎంఎల్‌ఎ కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కొద్ది రోజుల క్రితం వరకు పార్టీ వెంటిలేటర్‌పై ఉందని, బతుకుందన్న ఆశతో ఇంతకాలం తో ఎదురుచూశానని అన్నారు. కాని పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యవహారశైలి కారణంగా కాంగ్రెస్ పార్టీకి ఏ మాత్రం భవిష్యత్ లేదని తెలుస్తోందన్నారు. అందుకే ఆ పార్టీ నుంచి త్వరలోనే బయటకు రానున్నట్లు మంగళవారం నాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ రాజ్‌గోపాల్‌రెడ్డి చెప్పారు. ప్రసుతం కాంగ్రెస్‌లో ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్ప మరెవ్వరూ ఉండరన్నారు. తెలంగాణలో రాష్ట్ర నాయకత్వాన్ని మార్చకపోవడమే కాంగ్రెస్ దుస్థితికి ప్రధాన కారణమని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో అధికార టిఆర్‌ఎస్‌ను ఎదుర్కోవడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందన్నారు.

రెండుసార్లు గెలిపించిన ప్రజలకు తాను న్యాయం చేయలేకపోతున్నానని కోమటిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రజలకు న్యాయం చేయాలన్న ఉద్దేశ్యంతోనే కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి త్వరలో బిజెపిలో చేరనున్నట్లు స్పష్టం చేశారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరో ఇరవై ఏళ్ళు ఆయినా అధికారంలోకి వచ్చే అవకాశం లేదన్నారు. కనీసం ఆ పార్టీ పక్షాన పోటీ చేసేందుకు అభ్యర్ధులు కూడా దొరకని పరిస్థితి నెలకొందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో టిఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బిజెపియేనని అన్నారు. తెలంగాణలో కమలం ద్వారానే అభివృద్ధి సాధ్యమని అభిప్రాయపడ్డారు. ప్రతిపక్ష హోదాను కాపాడుకోలేని ఉత్తమ్ కుమార్ రెడ్డి తనకు నోటీసులు ఇవ్వడం హాస్యాస్పందంగా ఉందని సెటైర్లు విసిరారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో పిసిసి పదవిని విధేయులకే అప్పగించాలని ఆ పార్టీ సీనియర్ నాయకుడు విహెచ్. హనుమంతరావు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను పూర్తిగా ప్రక్షాలన చేసి సమర్ధులకే కీలక బాధ్యతలు అప్పగించాలని పార్టీ హైకమాండ్‌కు సూచించారు.

Komati Reddy Rajagopal Reddy  resign To Congress Soon

Related Images:

[See image gallery at manatelangana.news]

The post త్వరలో కాంగ్రెస్‌కు రాజీనామా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.