5 నెలల్లో మున్సిపోల్స్

  మన తెలంగాణ/హైదరాబాద్ :రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అవసరమైన ప్రక్రియను 119 రోజుల్లోగా పూర్తి చేయాలని అనంతరం నెల రోజుల్లో ఎన్నికలు నిర్వహించాలని హైకో ర్టు ఆదేశించింది. వార్డుల విభజన, వార్డు ల రిజర్వేషన్లు, ఓటర్ల జాబితాల ఖరారు ప్రక్రియను 119 రోజుల్లో ముగించాలన్న ది. రాష్ట్రంలో కొత్త మున్సిపాలిటీలు ఏర్పా టు చేసినందున సకాలంలో ఎన్నికలు ని ర్వహించలేమని, వార్డుల విభజన, ఓటర్ల జాబితా, రిజర్వేషన్ల ఖరారుకు 151 రోజుల సమయం పడుతుందని, అందువల్ల […] The post 5 నెలల్లో మున్సిపోల్స్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

మన తెలంగాణ/హైదరాబాద్ :రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అవసరమైన ప్రక్రియను 119 రోజుల్లోగా పూర్తి చేయాలని అనంతరం నెల రోజుల్లో ఎన్నికలు నిర్వహించాలని హైకో ర్టు ఆదేశించింది. వార్డుల విభజన, వార్డు ల రిజర్వేషన్లు, ఓటర్ల జాబితాల ఖరారు ప్రక్రియను 119 రోజుల్లో ముగించాలన్న ది. రాష్ట్రంలో కొత్త మున్సిపాలిటీలు ఏర్పా టు చేసినందున సకాలంలో ఎన్నికలు ని ర్వహించలేమని, వార్డుల విభజన, ఓటర్ల జాబితా, రిజర్వేషన్ల ఖరారుకు 151 రోజుల సమయం పడుతుందని, అందువల్ల ఎన్నికలకు వ్యవధి కావాలని ప్రభు త్వం ఇటీవల హైకోర్టును కోరింది. ఆ వి ధంగానే మున్సిపల్ ఎన్నికల నిర్వహణను మొత్తం 149 రోజుల్లో పూర్తి చేయాలని హైకోర్టు మంగళవారం ఆదేశించింది. ఇ దిలా ఉండగా రాష్ట్ర ఎన్నికల సంఘం మ రోవైపు ఎన్నికల కసరత్తును మొదలుపెట్టింది ప్రస్తుతం మున్సిపాలిటీల్లో ఓటర్ల గుర్తింపు ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది. జూలై 5వ తేదీ నాటికి బిసి, ఎస్‌సి, ఎస్‌టి, ఓటర్ల గణనను పూర్తి చేయనుంది. అనంతరం ఓ టర్ల జాబితాలను సిద్దం చేసి 6వ తేదీన ముసాయిదాను ప్ర కటించే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది. ఈ ముసాయిదా పై జులై 11వ తేదీ వర కు అభ్యంతరాలను స్వీకరించి, వాటిపై 16వ తేదీ వర కు పరిశీలన ప్రక్రి య పూర్తి చేస్తారు. 17 వ తేదీన ఓటర్ల జాబితా, 18వ తేదీన ఎస్ సి, ఎస్‌టి, బిసి, మహిళా ఓటర్ల జాబితా విడుదల చేస్తారు. 19న మున్సిపల్ అధికార్లకు ఓటర్ల తరువాయి 6లో

పూర్తి జాబితాను అందజేస్తారు. అనంతరం ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా రిజర్వేషన్లను ఖరారు చేస్తారని తెలుస్తోంది. ప్రస్తుత పాలకవర్గాల పదవీ కాలం జూలై 2వ తేదీతో ముగియనుంది. జీహెచ్‌ఎంసీ, గ్రేటర్ వరంగల్, సిద్దిపేట, ఖమ్మం, అచ్చంపేట మినహా మిగతా 53 మున్సిపాలిటీలు, మూడు నగర పాలక సంస్థల కాలపరిమితికి ఆ రోజు తెరపడనుంది. అయితే వేగంగా జరుగుతున్న పట్టణీకరణతో 68 కొత్త పురపాలికలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తాజాగా వాటికి కూడా పాలకవర్గాలను ఎన్నుకోవాల్సివుంది.
అయితే జడ్చర్ల గ్రామ పంచాయతీని బాదేపల్లి మున్సిపాలిటీలో విలీనం చేయడం, నకిరేకల్‌కు వచ్చే ఏడాది చివరి వరకు కాలపరిమితి ఉండటంతో వాటికి మినహా మిగతా వాటికి ఎన్నికలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉంది. గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ వరంగల్, ఖమ్మం, సిద్దిపేట, అచ్చంపేట మున్సిపాలిటీలకు మాత్రం మరో రెండేళ్ల హయాం మిగిలి ఉంది. ఇవి తప్ప మిగిలిన కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు నిర్ణిత వ్యవధిలోగా ఎన్నికలు జరగనున్నాయి.
జూలైలోనే ఎన్నికలు?
అయితే తాజాగా ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మహిళా ఓటర్ల గుర్తింపునకు చకచకా షెడ్యూల్ ప్రకటించడం, ఇది వచ్చే నెల మూడో వారంలోగా ముగియనుండటంతో సిఎం కెసిఆర్ మదిలో ఉన్నట్లుగా జూలై చివర్లో లేదా ఆగస్టు మొదటి వారంలో పురపోరుకు నగారా మోగే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల నిర్వహణకు ముందస్తు కసరత్తుకు ఐదు నెలల టైమ్‌లైన్ అవసరమని భావించినా ఓటర్ల గుర్తింపు, అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారం, వార్డుల విభజనను ఏకాకాలంలో పూర్తి చేసుకోవడం ద్వారా కొన్నింటి సమయం తగ్గించవచ్చని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. అదే సమయంలో రాజ్యాంగబద్ధంగా కొన్నింటికి మాత్రం గడువు కచ్చితంగా పాటించాల్సిందేనని స్పష్టం చేస్తున్నాయి. అయితే వార్డుల విభజన ప్రక్రియను అంతర్గతంగా పూర్తి చేయడంతో ఓటర్ల గణనను సర్కారు యుద్ధప్రాతిపదికన చేస్తోంది. ఆర్డినెన్స్ ద్వారా చట్టం తీసుకురావడమే తరువాయి రిజర్వేషన్లను ఖరారు చేయనుంది.

Telangana govt seeks 5 months for conducting municipal Elections

 

Related Images:

[See image gallery at manatelangana.news]

The post 5 నెలల్లో మున్సిపోల్స్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: