‘కల్కి’ తర్వాత ‘గరుడవేగ 2’చేస్తా : రాజశేఖర్

  రాజశేఖర్ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కల్కి’. శివానీ, శివాత్మిక సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి. కల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందించారు. ‘అ!’ వంటి ప్రయోగాత్మక, కొత్త తరహా చిత్రం తర్వాత ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన చిత్రమిది. ఈ నెల 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా రిలీజ్ రైట్స్‌ను శ్రీ సత్యసాయి ఆర్ట్ అధినేత కె.కె. రాధామోహన్ […] The post ‘కల్కి’ తర్వాత ‘గరుడవేగ 2’చేస్తా : రాజశేఖర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

రాజశేఖర్ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కల్కి’. శివానీ, శివాత్మిక సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి. కల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందించారు. ‘అ!’ వంటి ప్రయోగాత్మక, కొత్త తరహా చిత్రం తర్వాత ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన చిత్రమిది. ఈ నెల 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా రిలీజ్ రైట్స్‌ను శ్రీ సత్యసాయి ఆర్ట్ అధినేత కె.కె. రాధామోహన్ సొంతం చేసుకుని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో ప్రశాంత్ వర్మ ‘కల్కి’ హానెస్ట్ ట్రైలర్‌ను విడుదల చేశారు.

ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ “గరుడవేగ చిత్రంతో ప్రవీణ్ సత్తారు నన్ను ఒక లెవెల్‌కు తీసుకెళ్లారు. ఇప్పుడు ప్రశాంత్ వర్మ ‘కల్కి’ చిత్రంతో మరో లెవెల్‌కు వెళ్లాలనేది మా అందరి టార్గెట్. ‘గరుడవేగ’తో పోలిస్తే ఇది డిఫరెంట్ ఫిల్మ్. కాకపోతే ఆ సినిమా చూసిన ప్రేక్షకులకు ఖచ్చితంగా ‘కల్కి’ పూర్తి సంతృప్తినిస్తుందని చెప్పగలను. ఇక ప్రవీణ్ సత్తారు, ప్రశాంత్ వర్మ నా నటనను కొత్తగా చూపించారు. ఇక ‘కల్కి’ చిత్రం తర్వాత ‘గరుడవేగ 2’ చేస్తా”అని అన్నారు. సి. కల్యాణ్ మాట్లాడుతూ “రాజశేఖర్‌కు ప్రవీణ్ సత్తారు ‘గరుడవేగ’ వంటి గొప్ప సినిమా ఇచ్చారు. ఆయన ఇచ్చినటువంటి విజయాన్ని మించి ఈ ‘కల్కి’ ఉంటుందని మాత్రం గర్వంగా చెప్పగలను.

హై టెక్నికల్ వాల్యూస్, హై బడ్జెట్‌తో తీసిన చిత్రమిది. ఈ సినిమాకు ఇంత క్రేజ్ రావడానికి కారణం ప్రశాంత్ వర్మ. టీజర్స్, ట్రైలర్‌లో మేకింగ్ ఎలా ఉందో చూపించాడు”అని చెప్పారు. దర్శకుడు ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ “ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముందే హానెస్ట్ ట్రైలర్ విడుదల చేశాం. సినిమాలో కామెడీ, ఐటమ్ సాంగ్, కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి. 1983 నేపథ్యంలో కథ సాగుతుంది. పీరియడ్ సినిమాల కంటే భవిష్యత్తులో ఏం జరుగుతుందనే కథలతో సినిమాలు తీయడానికి ఇష్టపడే దర్శకుడిని నేను. చాలా రీసెర్చ్ చేసిన తర్వాత ‘కల్కి’ చేశా. ఇదొక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. సినిమా చూశాక అందరూ ‘కల్కి 2’ కోసం ఎదురు చూస్తారు”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జీవిత రాజశేఖర్, సిద్ధూ జొన్నలగడ్డ, కృష్ణచైతన్య తదితరులు పాల్గొన్నారు.

Rajasekhar said After Kalki, Garuda Vega 2 will do

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ‘కల్కి’ తర్వాత ‘గరుడవేగ 2’చేస్తా : రాజశేఖర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: