అందుకే ఎక్కువ చేయలేకపోతున్నా…

  శ్రీవిష్ణు, నివేదా థామస్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘బ్రోచేవారెవరురా’. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈనెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ నివేదా థామస్‌తో ఇంటర్వూ విశేషాలు… క్లాసికల్ డ్యాన్సర్ కావాలని… ఈ చిత్రంలో మిత్ర అనే అమ్మాయి పాత్రలో నటిస్తున్నాను. దాదాపు నాలాంటి స్వభావమున్న అమ్మాయి ఆమె. నేనే కాదు దాదాపు 90 శాతం ఆడవాళ్లు ఎలా ఉంటారో మిత్ర పాత్రలో చూడవచ్చు. సినిమాలో మిత్ర గొప్ప […] The post అందుకే ఎక్కువ చేయలేకపోతున్నా… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

శ్రీవిష్ణు, నివేదా థామస్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘బ్రోచేవారెవరురా’. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈనెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ నివేదా థామస్‌తో ఇంటర్వూ విశేషాలు…

క్లాసికల్ డ్యాన్సర్ కావాలని…
ఈ చిత్రంలో మిత్ర అనే అమ్మాయి పాత్రలో నటిస్తున్నాను. దాదాపు నాలాంటి స్వభావమున్న అమ్మాయి ఆమె. నేనే కాదు దాదాపు 90 శాతం ఆడవాళ్లు ఎలా ఉంటారో మిత్ర పాత్రలో చూడవచ్చు. సినిమాలో మిత్ర గొప్ప క్లాసికల్ డ్యాన్సర్ కావాలని కలలు కంటుంది. ఇక నేను చిన్నప్పుడు క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకున్నాను.

సమాజాన్ని కళ్లకు కట్టినట్లు…

సమ్‌థింగ్ స్పెషల్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమా మన సమాజాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. థియేటర్‌లో కూర్చున్నప్పుడు నిజంగానే సినిమా చూస్తున్నామా అనిపిస్తుంది.

అందుకే నన్ను ఓకే చేశారు…
సినిమాలో చేసే హీరోయిన్‌కు క్లాసికల్ డ్యాన్స్ వచ్చి ఉండాలని దర్శకుడు వివేక్ ఆత్రేయ అనుకున్నారు. నాకు డ్యాన్స్‌లో మంచి పట్టు ఉంది కాబట్టి నన్ను ఓకే చేశారు. మన ఇండస్ట్రీలో డ్యాన్స్ వచ్చిన వారు చాలా మంది ఉన్నారు. అయితే ఈ సినిమాలో నేను నటించాలని రాసిపెట్టుంది కాబట్టి చేశాను.

ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా…
నేను చేస్తున్న సినిమాల చిత్రీకరణ ఆలస్యమవుతుండడంతో ఎక్కువ సినిమాలకు సంతకం చేయలేకపోతున్నాను. కానీ ‘బ్రోచేవారెవరురా’లాంటి సినిమా వస్తే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా చేస్తాను.

వేధింపులు తగ్గాలి…
‘మీటూ’ అనేది ఓ ఉద్యమం. ఈరోజు మొదలై రేపటికి ఆగిపోయేది కాదు. ఈ సమస్య ప్రపంచవ్యాప్తంగా ఉంది. కానీ సినీ పరిశ్రమపైనే ఎక్కువ దృష్టి ఎందుకు పెడుతున్నారంటే.. ఇది పబ్లిక్ ఇండస్ట్రీ. ఏదేమైనా ఆడవాళ్లపై వేధింపులు తగ్గాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Nivetha Thomas said i Acting in Good Movies

Related Images:

[See image gallery at manatelangana.news]

The post అందుకే ఎక్కువ చేయలేకపోతున్నా… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: