‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ బాగా నచ్చింది…

  స్వధర్మ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నవీన్ పొలిశెట్టి, శృతి శర్మ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’. స్వరూప్‌రాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి రాహుల్ యాదవ్ నక్కా నిర్మాత. ఈ చిత్రం ఇటీవల విడుదలైంది. అయితే ఈ చిత్రాన్ని క్రేజీ హీరో విజయ్ దేవరకొండతో పాటు హీరో అడవిశేషు, దర్శకుడు తరుణ్ భాస్కర్, ఆనంద్ దేవరకొండ తదితరులు హైదరాబాద్‌లోని ఎ.ఎం.బి.సినిమాస్‌లో ప్రత్యేకంగా వీక్షించారు. అనంతరం విజయ్ దేవరకొండ మాట్లాడుతూ… “ఆరేళ్లకు పైగా […] The post ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ బాగా నచ్చింది… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

స్వధర్మ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నవీన్ పొలిశెట్టి, శృతి శర్మ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’. స్వరూప్‌రాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి రాహుల్ యాదవ్ నక్కా నిర్మాత. ఈ చిత్రం ఇటీవల విడుదలైంది. అయితే ఈ చిత్రాన్ని క్రేజీ హీరో విజయ్ దేవరకొండతో పాటు హీరో అడవిశేషు, దర్శకుడు తరుణ్ భాస్కర్, ఆనంద్ దేవరకొండ తదితరులు హైదరాబాద్‌లోని ఎ.ఎం.బి.సినిమాస్‌లో ప్రత్యేకంగా వీక్షించారు.

అనంతరం విజయ్ దేవరకొండ మాట్లాడుతూ… “ఆరేళ్లకు పైగా ఈ చిత్ర హీరో నవీన్ నాకు బాగా తెలుసు. థియేటర్స్‌లో వర్క్ షాప్ చేస్తున్నప్పుడు ఇద్దరం కలిసి చాలా ఎంజాయ్ చేసేవాళ్లం. ఆ తరువాత ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ చిత్రంలో కలసి పనిచేశాం. నవీన్ హీరో హీరోగా చేసిన ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ నాకు బాగా నచ్చింది. స్వరూప్ డైరెక్షన్ అదిరిపోయింది”అని అన్నారు. అడవిశేషు మాట్లాడుతూ “మొదటి నుంచి థ్రిల్లర్ మూవీస్ అంటే చాలా ఇష్టం. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ సినిమా అదే తరహా కనుక ఇంకా బాగా నచ్చింది”అని తెలిపారు.

దర్శకుడు స్వరూప్‌రాజ్ మాట్లాడుతూ “మా సినిమాను చూసిన వారందరూ బాగుందని చెప్పడంతో హ్యాపీగా ఉన్నాం. చిన్న పిల్లల నుంచి 70 ఏళ్ల వయసు వారి వరకు నేను ఎక్కడ కనపడితే అక్కడ మంచి సినిమా తీశారంటూ మెచ్చుకుంటున్నారు” అని చెప్పారు. హీరో నవీన్ మాట్లాడుతూ “ఈ ప్రాజెక్ట్ కోసం మేమందరం బాగా కష్టపడ్డాం. ఇప్పుడు భారీ స్పందన చూస్తుంటే మా కష్టాన్ని మరచిపోయాం”అని అన్నారు. ఈ కార్యక్రమంలో నటుడు సుహాన్, మ్యూజిక్ డైరెక్టర్ మార్క్ రాబిన్, సన్నీ, ఎడిటర్ అమిత్ త్రిపాఠి తదితరులు పాల్గొన్నారు.

Audience says Agent Sai Srinivas Atreya is good Movie

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ బాగా నచ్చింది… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: