కుమారుడి మృతదేహాన్నిభుజాలపై మోసుకెల్లిన తండ్రి…

  బిహార్‌ : ఓ తండ్రి తన ఎనిమిదేళ్ల కుమారుడి మృతదేహాన్ని భుజాలపై మోసుకెల్లిన విషాద ఘటన బిహార్‌లోని నలందలో  చోటు చేసుకుంది. కడుపునొప్పి, జ్వరంతో బాధపడుతున్న తన కుమారుడిని ఆ వ్యక్తి నలందలోని సదర్‌ ప్రభుత్వ‌ ఆస్పత్రిలో చేర్పించాడు. అయితే, చికిత్స పొందుతూ మంగళవారం ఆ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం ఆ బాలుడి మృతదేహాన్ని ఇంటికి తరలించేందుకు అంబులెన్సు అందుబాటులో లేదని సిబ్బంది చెప్పారు. ఇతర వాహనాల్లో తన కుమారుడి మృతదేహాన్ని తీసుకెళ్లడానికి అతడి […] The post కుమారుడి మృతదేహాన్నిభుజాలపై మోసుకెల్లిన తండ్రి… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

బిహార్‌ : ఓ తండ్రి తన ఎనిమిదేళ్ల కుమారుడి మృతదేహాన్ని భుజాలపై మోసుకెల్లిన విషాద ఘటన బిహార్‌లోని నలందలో  చోటు చేసుకుంది. కడుపునొప్పి, జ్వరంతో బాధపడుతున్న తన కుమారుడిని ఆ వ్యక్తి నలందలోని సదర్‌ ప్రభుత్వ‌ ఆస్పత్రిలో చేర్పించాడు. అయితే, చికిత్స పొందుతూ మంగళవారం ఆ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు.

అనంతరం ఆ బాలుడి మృతదేహాన్ని ఇంటికి తరలించేందుకు అంబులెన్సు అందుబాటులో లేదని సిబ్బంది చెప్పారు. ఇతర వాహనాల్లో తన కుమారుడి మృతదేహాన్ని తీసుకెళ్లడానికి అతడి వద్ద డబ్బు లేదు. దీంతో చేసేదేమీలేక ఇలా భుజాలపై ఆ మృతదేహాన్ని వేసుకుని ఇంటికి బయల్దేరాడు. జిల్లా కలెక్టర్ యోగేంద్ర సింగ్‌ ఈ ఘటనపై స్పందిస్తూ… ఈ ఘటనపై విచారణ జరిపిస్తామని, ఇందులో సిబ్బంది నిర్లక్ష్యం ఉందని తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో అక్యూట్‌ ఎన్సెఫాలిటిస్ సిండ్రోమ్ కారణంగా ఇటీవలే 130 మందికిపైగా చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే.

Father Carrying Son’s Dead Body on his Shoulders

Related Images:

[See image gallery at manatelangana.news]

The post కుమారుడి మృతదేహాన్నిభుజాలపై మోసుకెల్లిన తండ్రి… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: