కష్టాల్లో ఇంగ్లాండ్… 10 ఓవర్లు 39/3

  లార్డ్స్‌: ఐసిసి ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ 3 కీలక వికెట్లు కోల్పోయింది. ఆసీస్ నిర్దేశించిన 286 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టుకు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే ఓపెనర్ జేమ్స్ విన్స్(0) డకౌట్ అయ్యాడు. అయితే, మిచెల్ స్టార్క్ ఇంగ్లాండ్ జట్టుకు కోలుకోలేని దెబ్బతీశాడు. తన వరుస ఓవర్లో రూట్(8)ను ఎల్‌బీడబ్ల్యూ చేయగా..కెప్టెన్ మోర్గాన్(4)ను సైతం పెవిలియన్ కు పంపాడు. దీంతో ఇంగ్లాండ్ 26 […] The post కష్టాల్లో ఇంగ్లాండ్… 10 ఓవర్లు 39/3 appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

లార్డ్స్‌: ఐసిసి ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ 3 కీలక వికెట్లు కోల్పోయింది. ఆసీస్ నిర్దేశించిన 286 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టుకు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే ఓపెనర్ జేమ్స్ విన్స్(0) డకౌట్ అయ్యాడు. అయితే, మిచెల్ స్టార్క్ ఇంగ్లాండ్ జట్టుకు కోలుకోలేని దెబ్బతీశాడు. తన వరుస ఓవర్లో రూట్(8)ను ఎల్‌బీడబ్ల్యూ చేయగా..కెప్టెన్ మోర్గాన్(4)ను సైతం పెవిలియన్ కు పంపాడు. దీంతో ఇంగ్లాండ్ 26 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ప్రస్తుతం ఇంగ్లాండ్ 10 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 40 పరుగులు చేసింది. క్రీజ్‌లో బెయిర్‌స్టో(23), బెన్ స్టోక్స్(2)లు ఉన్నారు.

 England 3 wickets loss in 10 overs against Australia 

The post కష్టాల్లో ఇంగ్లాండ్… 10 ఓవర్లు 39/3 appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.