పరిహసించినా ఇబ్బందే!

  పరిహాసమాడినందుకు పత్రికా రచయిత ప్రశాంత్ కనోజియాను ఇటీవల అరెస్టు చేశారు. ఆయన చేసిందల్లా సామాజిక మాధ్యమంలో యోగీ ఆదిత్య నాథ్‌ను పరిహసిస్తూ ఒక పోస్ట్ పెట్టారు. ఇటీవలే బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని పరిహసించినందుకు ఒక బిజెపి కార్యకర్తను అరెస్టు చేశారు. నిజానికి మమతా బెనర్జీని పరిహసించిన సందర్భమే హాస్యాస్పదమైంది. ఎషికా సింగ్, అనుజ్ శుక్లా అనే ఇద్దరు పత్రికా రచయితలు ఒక వీడియోను సామాజిక మాధ్యమంలో ఉంచి, కనోజీయా సామాజిక మాధ్యమంలో పెట్టిన పోస్టును […] The post పరిహసించినా ఇబ్బందే! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

పరిహాసమాడినందుకు పత్రికా రచయిత ప్రశాంత్ కనోజియాను ఇటీవల అరెస్టు చేశారు. ఆయన చేసిందల్లా సామాజిక మాధ్యమంలో యోగీ ఆదిత్య నాథ్‌ను పరిహసిస్తూ ఒక పోస్ట్ పెట్టారు. ఇటీవలే బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని పరిహసించినందుకు ఒక బిజెపి కార్యకర్తను అరెస్టు చేశారు. నిజానికి మమతా బెనర్జీని పరిహసించిన సందర్భమే హాస్యాస్పదమైంది.

ఎషికా సింగ్, అనుజ్ శుక్లా అనే ఇద్దరు పత్రికా రచయితలు ఒక వీడియోను సామాజిక మాధ్యమంలో ఉంచి, కనోజీయా సామాజిక మాధ్యమంలో పెట్టిన పోస్టును జత చేసినందుకు వారిని అరెస్టు చేశారు. ఆ పోస్టులన్నీ అభ్యంతరకరమైనవని భావించారు. ఇది పత్రికా స్వేచ్ఛ మీద దాడి అన్న గగ్గోలు మొదలైంది. ఈ కేసుకు సంబంధించి మరో ముగ్గురిని కూడా అరెస్టు చేశారు. రాజ్యాంగేతరమైన ఈ అరెస్టులను నిరసిస్తూ పత్రికా రచయితలు వీధులకెక్కారు. ఆ పత్రికా రచయితలను వెంటనే విడుదల చేయాలని గట్టిగా కోరారు. కనోజియాను అరెస్టు చేసినప్పుడు ఉత్తరప్రదేశ్ పోలీసులు భారత శిక్షా స్మృతిలోని 500వ సెక్షన్ ను (నేర పూరితమైన పరువు నష్టం), సమాచార సాంకేతిక చట్టంలోని 66వ సెక్షన్‌ను కూడా ప్రయోగించారు. ఆ తరవాత బహిరంగంగా తుంటరి పని చేశారని 505 సెక్షన్‌ను కూడా జోడించారు. దీన్ని బట్టి పోలీసుల అతి వ్యవహారం చూస్తే పౌరులకు అధికారంలో ఉన్న వారిని విమర్శించే హక్కు కూడా లేదనిపిస్తుంది. అయితే సుప్రీంకోర్టు మాత్రం వ్యక్తిగత స్వేచ్ఛపై ఏ రకంగానూ రాజీపడే అవకాశం లేదని చెప్పింది. అందువల్ల కనోజియా విడుదలయ్యారు.

అధికారంలో ఉన్న వారిని విమర్శించినందుకు చర్య తీసుకున్న సంఘటనలు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. శర్మ, కనోజియా ఉదంతాలు ఇటీవలివి మాత్రమే. ఇంతకు ముందు కార్టూనిస్టులు, విదూషకులు ఇలాగే ఎద్దేవా చేసే వారు. కానీ ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో వచ్చిన విషయాలను ఇతరులకు పంపినా చట్ట రీత్యా చర్య తీసుకుంటున్నారు. 2016లో బయటికి అభ్యంతరకరంగా కనిపించే అంశాన్ని ఫేస్‌బుక్‌లో పెట్టినందుకు యుక్త వయసు వచ్చిన ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. ఎవరైనా అధికారంలో ఉన్న వారిని హేళన చేస్తున్నారంటే వారికున్న భావ ప్రకటనా స్వేచ్ఛను వినియోగించుకుంటున్నట్టే. ఇది అసమ్మతి తెలియజేసే మార్గం. వీటన్నింటినీ చూస్తే అధికారంలో ఉన్న వారిని అవహేళన చేయడం నేరమా? అధికారంలో ఉన్న వారు, శక్తిమంతులు చరిత్ర పొడవునా తమను అవహేళన చేసే వారిని సహించరని అనిపిస్తోంది.

చక్రవర్తిని పరిహాసం చేయకూడదు. ఎందుకంటే ఆయన పరిహాసానికి అతీతుడు. హన్స్ క్రిస్టియన్ ఆండర్సన్ ‘ది ఎంపరర్స్ న్యూ క్లోత్స్’ ఇదే అంశాన్ని రుజువు చేస్తోంది. శక్తిమంతులైన వారికి హాస్యం అంటే భయం. ఎందుకంటే హాస్యంవల్ల వారి లొసుగులు బయట పడతాయి. హాస్యం బయటకు కనిపించే వ్యక్తుల స్వభావాన్ని, వారి నిజ స్వరూపాన్ని బయట పెడ్తుంది. ఇది ఆ శక్తిమంతుల అధికారాన్ని ఎండగడ్తుంది. పరిహాసం రెండంచుల కత్తి. హాస్యం శక్తిమంతులను దిగలాగ గలిగితే అణగారిన వర్గాల వారిని ఏ అధికారమూ లేకుండా చేయగలుగుతుంది. చారిత్రకంగా చూసినా హాస్యం బలవంతులకే పరిమితం అన్నట్టుగా కనిపిస్తుంది. రాజకీయ అధికారం లేని వారిని హేళన చేయడాన్ని యథాతథ స్థితికి చేరుకునే దాకా తీసుకొచ్చారు. అది నాజీ జర్మనీలో యూదులను ‘పొడవాటి ముక్కుతో‘ చూపడం, లేదా మన దేశంలో వలస వాదుల పాలన కొన సాగినప్పుడు ‘బెంగాలీలను ఆడంగి వారిగా’ చిత్రీకరించడం, లేదా ‘గూర్ఖలను కిరాతకంగా’ చూపడం కావచ్చు. అణగారిన వర్గాల గౌరవ ప్రతిష్ఠలను దిగజార్చి చూపే వారు. అంటే జనాన్ని సిగ్గు పడేలా చేయడం. అంటే హాస్యాన్ని శక్తిమంతమైన ఆయుధంగా వినియోగించే వారు. ఇది సాంస్కృతిక దాడి.

యోగీ ఆదిత్య నాథ్ వాత్సల్యాన్ని పొందిన ఒక అభాగ్య మహిళకు సంబంధించిన ఒక పరిహాసాన్ని కనోజియా సామాజిక మాధ్యమం ద్వారా ఇతరులకు చేరవేశారు. ఈ దృశ్యం ఆధారంగా ఆయన ఒక పరిహాసం సృష్టించారు. ఆ విడియో నవ్వు తెప్పించి ఉండవచ్చు కాని దానితో ఆ మహిళకు నష్టం కలిగింది. ఇది కనోజియా చేసిన విమర్శను వివక్షా పూరితంగా, విరసంగా మార్చేసింది. అది ఆ మహిళను మరింత నవ్వుల పాలు చేసింది. ఒక రకమైన అణచివేతను మరో రకమైన అణచివేత గురించి చెప్పడానికి ఉపయోగిస్తే అది అక్రమమైందిగా మారుతుంది. ఆ దృష్టితో చూస్తే కనోజియా పరిహాసం అమర్యాదకరమైనవి అనిపించవచ్చు. ఎందుకంటే ఆయన ఒక మహిళ దుస్థితిని తన రాజకీయ ప్రయోజనాలకోసం వాడుకున్నాడు.

ఆయనకు పరిహసించే హక్కు ఉంది కాని ఆయన హాస్యాన్ని అనుభూతి రహితంగా వినియోగించారు. అంటే లక్నో పోలీసులు హాస్యానికి ఉన్న శక్తిని గుర్తించారు కనక వారు అతిగా ప్రవర్తించినట్టేనా? ఏమైనా ప్రస్తుత రాజకీయ పరిస్థితిలో హాస్యానికి అంత చోటు లేదు. అసమ్మతికి ఉన్న అవకాశం తగ్గుతున్న ఈ పరిస్థితిలో అణచివేతకు పాల్పడే అధికార చట్రాలు మరింత బలోపేతం అవుతాయి. ఈ సమస్యను అధిగమించడానికి భావ ప్రకటనా స్వేచ్ఛ కోరే వారు వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. దాని వల్ల అధికారం ఉన్న వారి నిశ్శబ్దాన్ని ఛేదించవలసి ఉంటుంది. హాస్యం ఒకరి నుంచి ఒకరికి అంటుకునేదైతే ఎంత శక్తిమంతులైనా దిగదుడుపే.

Prashant Kanojia arrested earlier for social media post

Related Images:

[See image gallery at manatelangana.news]

The post పరిహసించినా ఇబ్బందే! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: