కమ్ముకుంటున్న యుద్ధమేఘాలు!

  అమెరికా, ఇరాన్ దేశాల మధ్య యుద్ధం రాజుకుంటుందా? ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తత ఇప్పుడు అంతర్జాతీయ విమాన సర్వీసులకు పెద్ద ఇబ్బందిగా మారింది. అంతర్జాతీయ విమాన సర్వీసులు ఇప్పుడు ఇరాన్ గగనతలాన్ని దాటడానికి భయపడుతున్నాయి. ఇరాన్ గగనతలాన్ని చుట్టు వెళ్ళాలని చాలా విమాన సంస్థలు భావిస్తున్నాయి. అంతర్జాతీయ విమానాలు ప్రయాణించే దారులు మూసుకుపోతున్నాయి. అమెరికాలోని ఫెడరల్ యావియేషన్ ఆడ్మినిస్ట్రేషన్ ఇరాన్ గగనతలంలోకి ప్రవేశించవద్దని సూచనలు ఇచ్చింది. అమెరికా విమానాలు ఇప్పుడు ఇరాన్ నియంత్రణలో ఉన్న […] The post కమ్ముకుంటున్న యుద్ధమేఘాలు! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

అమెరికా, ఇరాన్ దేశాల మధ్య యుద్ధం రాజుకుంటుందా? ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తత ఇప్పుడు అంతర్జాతీయ విమాన సర్వీసులకు పెద్ద ఇబ్బందిగా మారింది. అంతర్జాతీయ విమాన సర్వీసులు ఇప్పుడు ఇరాన్ గగనతలాన్ని దాటడానికి భయపడుతున్నాయి. ఇరాన్ గగనతలాన్ని చుట్టు వెళ్ళాలని చాలా విమాన సంస్థలు భావిస్తున్నాయి. అంతర్జాతీయ విమానాలు ప్రయాణించే దారులు మూసుకుపోతున్నాయి.

అమెరికాలోని ఫెడరల్ యావియేషన్ ఆడ్మినిస్ట్రేషన్ ఇరాన్ గగనతలంలోకి ప్రవేశించవద్దని సూచనలు ఇచ్చింది. అమెరికా విమానాలు ఇప్పుడు ఇరాన్ నియంత్రణలో ఉన్న పర్షియన్ గల్ఫ్, గల్ఫ్ ఆఫ్ ఒమాన్ గగనతలంలోకి ప్రవేశించకుండా చుట్టి వెళ్ళాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. కాని తూర్పు దేశాలకు వెళ్ళవలసిని చాలా విమానాలు ఈ దారిలోనే వెళ్ళవలసి ఉంది. ఇండియాపై కూడా ఈ ప్రభావం పడుతోంది. ముంబయి ఎయిర్ పోర్టుపై ఈ ఒత్తిడి మరింత ఎక్కువవుతోంది. ఇప్పటికే భారత విమానాలు పాకిస్థాన్ గగనతలంలోకి ప్రవేశించడం లేదు. పాకిస్థాన్ పాక్షికంగా గగనతలాన్ని మూసేసింది. ఇప్పుడు ఇరాన్ గగనతలం విషయంలో కూడా సమస్యలు తలెత్తాయి. ముంబయి నుంచి న్యూయార్క్ వెళ్ళే విమానాలు రద్దయ్యాయి. రీ రూట్ చేయడం, రీ షెడ్యూల్ చేయడం జరిగింది. సెలవుల సీజనులో విమానాల ట్రాఫిక్ ఎక్కువగా ఉండే కాలంలో ఈ సమస్యలు విమాన ప్రయాణికులకు ఇబ్బందికరంగా మారాయి.

అమెరికా విమానయాన సంస్థలకు ఇచ్చిన ఉత్తర్వుల తర్వాత ఇతర దేశాల విమాన సర్వీసులకు కూడా హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇరాన్ గగనతలం విషయంలో జాగ్రత్త వహించాలనే హెచ్చరిక చాలా విమానయాన సంస్థలు జారీ చేశాయి. ఇటీవల జరిగిన మలేషియా విమాన ప్రమాద సంఘటన కూడా చాలా మందికి ఒణుకు పుట్టిస్తోంది. మలేషియాకు చెందిన మలేషియా ఎయిర్ లైన్ విమానం కూల్చివేతకు గురయ్యింది. ఫ్లయిట్ 17 విమానం ప్రయాణికులను తీసుకెళ్లే విమానం. 2014లో ఈ విమానం కూల్చివేయబడింది. ఉక్రేయిన్ గగనతలంపై ప్రయాణిస్తున్నప్పుడు విమానాన్ని కూల్చివేశారు. ఈ పరిస్థితుల్లో, ముఖ్యంగా అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో వివిధ దేశాలు ప్రయాణికుల భద్రత పట్ల ఆందోళన చెందుతున్నాయి. ఇప్పుడు అమెరికా ప్రయాణికుల విమానాలకు జారీ చేసిన హెచ్చరికల తర్వాత బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ తదితర దేశాలు కూడా విమాన ప్రయాణికుల భద్రత పట్ల ఆందోళన చెందుతున్నాయి. ఇరాన్ గగనతలం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.

అమెరికా తాజా హెచ్చరికలకు కారణం అమెరికా నిఘా విమానాన్ని ఇరాన్ కూల్చివేయడం. ఇటీవల ఇరాన్ ఒక డ్రోన్ విమానాన్ని కూల్చివేసింది. అమెరికాకు చెందిన గ్లోబల్ హాక్ విమానాన్ని గల్ఫ్ ప్రాంతంలో ఇరాన్ కూల్చివేసింది. ఈ డ్రోన్ విమానాన్ని ఇరాన్ కూల్చినప్పుడు డ్రోన్ కు సమీపంలో అంటే దాదాపు 45 నాటికల్ మైళ్ళ దూరంలో ప్రయాణికుల విమానం కూడా ఉందనే వార్తలు వస్తున్నాయి. ఇది చాలా ఆందోళనకరమైన విషయమే. అంత సమీపంలో నిఘా విమానం కూల్చివేతకు గురైనప్పుడు ఈ మార్గంలో ప్రయాణించే పాసింజర్ విమానాలు ఆందోళన చెందే పరిస్థితి.

అమెరికా విమానాన్ని కూల్చినట్లు ఇరాన్ ప్రకటించింది కూడా. ఇరాన్ గగనతలంలోకి అమెరికా నిఘా విమానం వచ్చి గూఢచర్యానికి పాల్పడే ప్రయత్నాలు చేసిందని, అందుకే కూల్చివేశామని ఇరాన్ ప్రకటించింది. అమెరికా మిలిటరీ ఈ ఆరోపణలను తిరస్కరించింది. తమ డ్రోన్ విమానం అంతర్జాతీయ జలాలపై ఎగురుతున్నప్పుడు ఇరాన్ కూల్చివేసిందని ప్రకటించింది. తాము ఇరాన్ గగనతలంలోకి ప్రవేశించలేదని అమెరికా అంటోంది. కాని అమెరికా డ్రోన్ తమ గగనతలంలోకి వచ్చి గూఢచర్యానికి పాల్పడిందని చెప్పడమే కాదు ఇరాన్ కూలిన విమాన శకలాలను కూడా ప్రదర్శనకు పెట్టింది. అమెరికా డ్రోన్ ఇరాన్ గగనతలంలోకి ప్రవేశించిందని చెప్పే సాక్ష్యాలు కూడా ఇస్తోంది. తాము యుద్ధం కోరుకోవడం లేదని, కాని అమెరికా దూకుడుగా వ్యవహరిస్తే, తమ జాతీయ భద్రతకు, దేశరక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ఇరాన్ నిర్మొహమాటంగా ప్రకటించింది.

ఇరాన్, అమెరికాల మధ్య ఇటీవల పెరిగిన ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ డ్రోన్ కూల్చివేత తాజా సంఘటన. అమెరికా విమానాన్ని ఇరాన్ కూల్చివేసిందని తెలిసి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అమెరికా విమానాన్ని ఇరాన్ ఉద్దేశ పూర్వకంగా కూల్చిందని తెలిసి నిర్ఘాంతపోయారు. ఇరాన్ చాలా పెద్ద పొరబాటు చేసిందంటూ ట్రంప్ హూంకరించాడు. అమెరికా డ్రోన్ విమానాన్ని కూల్చాలనే నిర్ణయం ఇరాన్ సైన్యాధికారులు అనాలోచితంగా తీసుకున్న చాలా పెద్ద పొరబాటని అన్నారు. ఇరాన్ పై దాడులకు ట్రంప్ ఆదేశాలిచ్చారని వార్తలు వచ్చాయి. ఆ వెంటనే దాడుల ఆదేశాలను వెనక్కు తీసుకున్నారని కూడా వార్తలు వచ్చాయి. చివరి క్షణంలో ట్రంప్ వెనక్కు తగ్గారని తెలిసింది.

ఇరాన్, అమెరికాల మధ్య ప్రస్తుతం ఈ ఉద్రిక్తతకు కారణం కూడా ట్రంప్ నిర్ణయాలే. ఇరాన్‌తో చేసుకున్న 2015 నాటి అణు ఒప్పందం నుంచి అమెరికా ఏకపక్షంగా తప్పుకుంది. ఈ ఒప్పందంలో ఉన్న మిగిలిన ఐదు దేశాలు ఒప్పందంలో కొనసాగుతున్నాయి. ఇరాన్ మెడలు వంచడానికి అమెరికా అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఇరాన్ నుంచి చమురు కొనరాదని ఇతర దేశాలకు హుకుం జారీ చేసింది. అమెరికా ఒత్తిడి వల్లనే భారతదేశం చవుకగా లభించే ఇరాన్ చమురు కొనడం మానేసింది. ఇరాన్ విదేశాంగ మంత్రి భారతదేశం సందర్శించారు. అప్పుడు ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇరాన్ విదేశాంగ మంత్రి, భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ను కలుసుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది. కొత్త విదేశాంగ మంత్రిగా యస్.జయశంకర్ వచ్చారు. కాని ఈ ప్రాంతంలో పరిస్థితి చాలా సంక్లిష్టంగా మారింది. జయశంకర్ ఎలా నిర్వహిస్తారో చూడాలి.

ఇరాన్, అమెరికాల మధ్య ఉద్రిక్తత భారతదేశానికి కూడా అనేక సవాళ్ళు విసురుతోంది. గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో మన నౌకల భద్రతకు అవసరమైన చర్యలు తీసుకోవడం ఆహ్వానించదగిన పరిణామం. కాని ఇరాన్, అమెరికాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఖచ్చితమైన దౌత్యపరమైన నిర్ణయం తీసుకోవలసిన అవసరం ఉంది. ఈ రెండు దేశాల ఉద్రిక్తత నేపథ్యంలో అమెరికా ఒత్తిడి భారత ప్రయోజనాలకు కూడా వ్యతిరేకంగా ఉందన్నది మరిచిపోరాదు.

                                                                                                  – పోలోమీ ఘోష్ (డైలీ ఓ)

Tensions between US and Iran spell trouble for India

 

Related Images:

[See image gallery at manatelangana.news]

The post కమ్ముకుంటున్న యుద్ధమేఘాలు! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.