ప్రత్యేక అధికారుల చేతికి ‘మున్సిపల్ ’ పగ్గాలు…

  జులై 2తో ముగుస్తున్న ప్రస్తుత పాలకవర్గాల పదవీ కాలం ప్రత్యేక అధికారుల చేతికి పాత మున్సిపాల్టీలు మరో వైపు ఎన్నికల కోసం కసరత్తు ప్రారంభమైన కులాల వారీగా ఓటర్ల్ల గణన జులై చివరి వారం లేదా ఆగస్ట్ మొదటి వారంలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ ఖమ్మం : మున్సిపాల్టీల పదవి కాలం వచ్చే నెల 2న తీరనున్నడంతో ఆయా మున్సిపాల్టీలకు ప్రత్యేక అధికారులను నియమించేందుకు కసరత్తు చేస్తున్నారు. జూలైలోగా మున్సిపాల్టీలకు ఎన్నికలను నిర్వహించి తిరుతామని ముఖ్యమంత్రి […] The post ప్రత్యేక అధికారుల చేతికి ‘మున్సిపల్ ’ పగ్గాలు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

జులై 2తో ముగుస్తున్న ప్రస్తుత పాలకవర్గాల పదవీ కాలం
ప్రత్యేక అధికారుల చేతికి పాత మున్సిపాల్టీలు
మరో వైపు ఎన్నికల కోసం కసరత్తు
ప్రారంభమైన కులాల వారీగా ఓటర్ల్ల గణన
జులై చివరి వారం లేదా ఆగస్ట్ మొదటి వారంలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్

ఖమ్మం : మున్సిపాల్టీల పదవి కాలం వచ్చే నెల 2న తీరనున్నడంతో ఆయా మున్సిపాల్టీలకు ప్రత్యేక అధికారులను నియమించేందుకు కసరత్తు చేస్తున్నారు. జూలైలోగా మున్సిపాల్టీలకు ఎన్నికలను నిర్వహించి తిరుతామని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించినప్పటికీ ఆలోగా మున్సిపల్ పరిపాలన కొనసాగించేందుకు ప్రత్యేక అధికారులను నియమించబోతున్నారు. మరోవైపు ఎన్నికల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినప్పటికీ ఈనెలాఖరులో ఎన్నికలను నిర్వహించడం సాధ్యం కాదని అధికారులు అంటున్నారు.

ఈ నేపధ్యంలో ముందుగా ప్రత్యేక అధికారులను నియమించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏడు మున్సిపాల్టీలు, ఖమ్మం నగర కార్పొరేషన్ ఉన్నాయి. వీటిలో సత్తుపల్లి, ఇల్లందు, కొత్తగూడెం, మధిర మున్సిపాల్టీల పదవి కాలం వచ్చే నెల 2తో ముగుస్తుంది. ఇక పాల్వంచ, మణుగూరు మున్సిపాల్టీల రిజర్వేషన్ల వివాదం కోర్టులో ఉన్నందున గత దశాబ్దాల నుంచి వాటికి ఎన్నికలు జరగడం లేదు. ఇక కొత్తగా వైరా నగర పంచాయతీగా అప్‌గ్రేడ్ అయ్యింది. రేపు ఎన్నికల్లో వైరాకు కూడా తొలిసారిగా ఎన్నికలను నిర్వహించనున్నారు. భద్రాచలం, సారపాకను కూడా మున్సిపాల్టీలుగా అప్‌గ్రేడ్ చేసే ప్రతిపాదన ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉంది. ఎన్నికలలోగా ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే వీటికి కూడా ఎన్నికలను  నిర్వహించే అవకాశం లేకపోలేదు.

ఎలాంటి ఆటంకం లేని కొత్తగూడెం, ఇల్లందు, సత్తుపల్లి, మధిర మున్సిపాల్టీలతో పాటు కొత్తగా ఏర్పాటైన వైరాకు మాత్రం ఎన్నికలు జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వీటిలో వైరాను మినహాయిస్తే మిగిలిన మున్సిపాల్టీలో జులై 2న పాలకవర్గాల పదవి కాలం ముగుస్తుండటంతో ఆయా మున్సిపాల్టీలకు ప్రత్యేక అధికారులను నియమించేందుకు ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. పాల్వంచ, మణుగూరు, వైరాకు పాలకవర్గాలు లేవు. మిగిలిన మున్సిపాల్టీలు జులై 3 నుంచి ప్రత్యేక అధికారుల పాలనలోకి వెళ్తాయి. ఇది ఇలా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు శనివారం నుంచి మున్సిపల్ పట్టణాల్లో బిసి, ఎస్‌సి, ఎస్‌టి, మహిళా ఓటర్ల గణనను ప్రారంభమైంది.

గత డిసెంబర్ నెలలో పాత, కొత్త మున్సిపాల్టీల్లో కులాల వారిగా ఓటర్ల గణన పూర్తి చేశారు. అయినప్పటికీ మరోసారి గణన చేయాలని రాష్ట్ర మున్సిపల్ పరిపాలన డైరెక్టర్ పి.శ్రీదేవి జారీ చేసిన ఉత్తర్వుల మేరకు మళ్ళీ సర్వే ప్రారంభించారు. డిసెంబర్ నెలలో శాసనసభ ఎన్నికలు జరిగిన సందర్బంగా అప్పటి ఓటర్ జాబితా ఆధారంగా మున్సిపాల్టీలో కులాలవారిగా ఓటర్ల గణన చేపట్టారు. ఆ తరువాత లోక్‌సభ ఎన్నికల్లో మళ్ళీ ఓటర్లు పెరిగారు. దీనికి తోడు చాలా మున్సిపాల్టీలో బిసి ఓటర్ల గణన సక్రమంగా జరగలేదని ఆరోపణలు వచ్చాయి. దీంతో రెండోసారి మళ్ళీ సర్వే చేయాల్సి వచ్చింది. వచ్చే నెల 4 వరకు మున్సిపల్ సిబ్బంది ఇంటింటికి వెళ్ళి కులాల వారిగా ఓటర్ల గణన చేయనున్నారు.

జులై 5న పోలింగ్ స్టేషన్ల వారిగా ఇంటింటికి వెళ్ళి సర్వే చేయనున్నారు. జూలై 6న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు. అదే నెల 7 నుంచి 11వ తేదీ వరకు ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలను స్వీకరిస్తారు. జూలై 12 నుంచి 16వ తేదీ వరకు వచ్చిన అభ్యంతరాలను పరిష్కరిస్తారు. జూలై 18న ఓటర్ల తుదిజాబితాను ప్రకటిస్తారు. ఆ తరువాత వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల ప్రక్రియను చేపట్టుతారు. గత డిసెంబర్లో కూడా వార్డుల విభజన చేసినప్పటికీ అప్పట్లో అనేక ఫిర్యాదులు అందాయి. కొన్ని పంచాయతీల్లో శివారు గ్రామాలు విలీనమయ్యాయి. దీంతో ఓటర్ల సంఖ్య పెరగడం వల్లన మరోసారి వార్డుల విభజన చేయాలని అధికారులు నిర్ణయించారు. ఆ తరువాత రిజర్వేషన్లను ఖరారు చేయాల్సి ఉంటుంది.

మరోవైపు వచ్చే నెలలో మున్సిపాల్టీలకు కొత్త చట్టం తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో జులై నెలలో మున్సిపల్ ఎన్నికలను నిర్వహించడం సాధ్యం కాదని అధికారులు అంటున్నారు. జులై 19న కులాల వారిగా ఓటర్ల గణన పూర్తైన తరువాత మున్సిపాల్టీ కొత్త చట్టం ఆమోదైన అనంతరం మున్సిపల్ ఎన్నికలపై కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. జులై చివరి వారం లేదా ఆగస్ట్ మొదటి వారంలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం లేకపోలేదని రాజకీయపార్టీ నేతలు అంటున్నారు.

మున్సిపల్ ఎన్నికల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బిసి సంఘం నేతలు కోర్టును ఆశ్రయించినప్పడు ఎన్నికల నిర్వహణకు మరికొంత సమయం కావాలని ప్రభుత్వం గడువు కోరింది. కానీ ముఖ్యమంత్రి మాత్రం జులై నెలాఖరులోగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ఇటీవల జరిగిన రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించిన విషయం తెలిసిందే.

Municipalities in Hands of special Authorities

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ప్రత్యేక అధికారుల చేతికి ‘మున్సిపల్ ’ పగ్గాలు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: