సాహో…ఓహో!

ప్రభాస్ హీరోగా దర్శకుడు సుజీత్ రూపొందిస్తున్న హైవోల్టేజ్ యాక్షన్ డ్రామా ‘సాహో’. తాజాగా విడుదలైన టీజర్ ప్రభాస్ అభిమానులతోపాటు సినిమా ఇండస్ట్రీని కూడా విపరీతంగా ఆకట్టుకుంటోంది. ‘బాధైనా హ్యాపీనెస్ అయినా నాతో షేర్ చేసుకోవడానికి ఎవరూ లేరు..’ అని శ్రద్ధా చెప్పే డైలాగ్‌తో టీజర్ మొదలైంది. టీజర్ చివరలో.. ప్రభాస్ ‘ఫ్యాన్స్.. డై హార్డ్ ఫ్యాన్స్’ అంటూ చెప్పే డైలాగ్ హైలైట్ గా నిలిచింది. నిమిషం 38 సెకన్లు ఉన్న టీజర్ మొత్తాన్ని యాక్షన్ సీన్లతో నింపేశారు. […] The post సాహో…ఓహో! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ప్రభాస్ హీరోగా దర్శకుడు సుజీత్ రూపొందిస్తున్న హైవోల్టేజ్ యాక్షన్ డ్రామా ‘సాహో’. తాజాగా విడుదలైన టీజర్ ప్రభాస్ అభిమానులతోపాటు సినిమా ఇండస్ట్రీని కూడా విపరీతంగా ఆకట్టుకుంటోంది. ‘బాధైనా హ్యాపీనెస్ అయినా నాతో షేర్ చేసుకోవడానికి ఎవరూ లేరు..’ అని శ్రద్ధా చెప్పే డైలాగ్‌తో టీజర్ మొదలైంది. టీజర్ చివరలో.. ప్రభాస్ ‘ఫ్యాన్స్.. డై హార్డ్ ఫ్యాన్స్’ అంటూ చెప్పే డైలాగ్ హైలైట్ గా నిలిచింది. నిమిషం 38 సెకన్లు ఉన్న టీజర్ మొత్తాన్ని యాక్షన్ సీన్లతో నింపేశారు.

కథ, హీరో క్యారెక్టరైజేషన్‌ని పక్కన పెట్టి.. పూర్తిగా ప్రొడక్షన్ వాల్యూస్, భారీతనం, స్టన్నింగ్ విజువల్స్ పై దృష్టి పెడుతూ టీజర్ కట్ చేశారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ గా నిలిచింది. హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్, ఇంటర్నేషనల్ ఎక్విప్‌మెంట్‌తో రూపొందించిన ఈ చిత్రాన్ని ఆగస్ట్ 15న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. యువి క్రియేషన్స్ బ్యానర్ పై దాదాపు మూడు వందల కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు.

టీజర్‌పై సెలబ్రిటీల పొగడ్తల వర్షం

* అక్కినేని నాగార్జున: ఇంత గొప్ప సినిమాను తీస్తున్నందుకు ప్రభాస్‌కు, యూవీ క్రియేషన్స్‌కు ‘సాహో’.
* రానా దగ్గుబాటి: ‘సాహో’ టీజర్ వచ్చేసింది.. సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాను.
* నితిన్: ‘సాహో’ టీజర్ చాలా ఆసక్తికరంగా ఉంది. నా డార్లింగ్ ఫ్రెండ్ ప్రభాస్‌కు ఆల్ ది బెస్ట్.
* శర్వానంద్: టీజర్ అదిరిపోయింది.
* మంచు విష్ణు: బాబోయ్.. ఆ టీజర్ ఏంటి? బ్రిలియంట్. చూడబోతే ప్రభాస్, దర్శకుడు సుజిత్ కలిసి ఏదో అద్భుతాన్ని సృష్టించబోతున్నారు. టీజర్ చాలా నచ్చింది.
* సురేందర్‌రెడ్డి: టీజర్ ఫెంటాస్టిక్‌గా ఉంది. ప్రభాస్, సుజీత్, శ్రద్ధా కపూర్, యూవీ క్రియేషన్స్‌కు ఆల్ ది బెస్ట్.
* పరుచూరి గోపాలకృష్ణ: ‘సాహో’.. ఓహో అని ప్రేక్షకుల నీరాజనాలు పొందాలని కోరుకుంటూ, మా ప్రభాస్ ప్రభాకర తేజస్సుతో వెలిగి పోవాలని ఆశీర్వదిస్తున్నాను.
* బెల్లంకొండ శ్రీనివాస్: వాట్ ఎ యాక్షన్ టీజర్.. చాలా బాగుంది. చిత్రబృందానికి బెస్ట్ విషెస్.
* మారుతి: ఇలాంటి స్టఫ్ ఇస్తే ఫ్యాన్సే కాదు ప్రతీ సినీ ప్రేమికుడు ‘సాహో’కి డై హార్డ్ ఫ్యానే.
* ఛార్మి: ఓహో డార్లింగ్ ప్రభాస్..‘సాహో’ టీజర్ సూపర్.
* సందీప్ కిషన్: అదిరిపోయింది.. తెలుగు సినిమా ఎక్కడికో వెళ్లిపోయింది ప్రభాస్ అన్నా.
* సాయి ధరమ్ తేజ్: కొత్త ట్రెండ్‌లు సెట్ చేస్తున్నారు. సినిమా బ్లాక్‌బస్టర్ అయిపోతుంది.
* పూరీ జగన్నాథ్: సాహో.. హ్యాట్సాఫ్.
* తమన్నా: సాహో టీజర్ గురించి ఎంత పొగిడినా తక్కువే. చాలా నచ్చింది. సినిమా కోసం ఎదురుచూస్తున్నాను.
* గోపీచంద్: సూపర్ ఫెంటాస్టిక్ టీజర్. నా స్నేహితుడు ప్రభాస్‌కి ఆల్ ది బెస్ట్.

Prabhas Saaho Teaser Creates New Records

Related Images:

[See image gallery at manatelangana.news]

The post సాహో…ఓహో! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: