టచ్ మీ నాట్!

నెర్రలు వారినట్టు ఈ చెట్ల మధ్య పగుళ్లు కనిస్తాయి. వీటిని చూసినవారెవరైనా ‘ఇదేంటీ’ అనుకుంటారు. దీనికి కారణం చెట్లకున్న ఓ రకమైన తీరు. దీన్ని ‘క్రౌన్ షైనెస్’ అని పిలుస్తారు. * ఈ స్వభావం వల్లే చెట్లు ఒకదాన్నొకటి ‘అంటను ముట్టను’ అన్నట్లు భలేగా పెరుగుతాయి. గుబుర్లు గుబుర్లుగా, చెట్ల కొమ్మలన్నీ దట్టమైన ఆకులతో ఉన్నా పక్క చెట్టుకు తగలకుండా ఉంటాయి. అందుకే ఈ వృక్షాల పందిర్లపైన చివర్లో సన్నని కాలువల్లా ఖాళీ స్థలం కనిపించేస్తుంది. చూడ్డానికి […] The post టచ్ మీ నాట్! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

నెర్రలు వారినట్టు ఈ చెట్ల మధ్య పగుళ్లు కనిస్తాయి. వీటిని చూసినవారెవరైనా ‘ఇదేంటీ’ అనుకుంటారు. దీనికి కారణం చెట్లకున్న ఓ రకమైన తీరు. దీన్ని ‘క్రౌన్ షైనెస్’ అని పిలుస్తారు.

* ఈ స్వభావం వల్లే చెట్లు ఒకదాన్నొకటి ‘అంటను ముట్టను’ అన్నట్లు భలేగా పెరుగుతాయి. గుబుర్లు గుబుర్లుగా, చెట్ల కొమ్మలన్నీ దట్టమైన ఆకులతో ఉన్నా పక్క చెట్టుకు తగలకుండా ఉంటాయి. అందుకే ఈ వృక్షాల పందిర్లపైన చివర్లో సన్నని కాలువల్లా ఖాళీ స్థలం కనిపించేస్తుంది. చూడ్డానికి ఎవరో గీసిన చిత్రలేఖనంలా గమ్మత్తుగా అనిపిస్తుంది. అందుకే ఫొటోగ్రాఫర్లు కూడా కింది నుంచి వీటి అందాల్ని కెమెరాల్లో బంధించడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఎక్కువగా మలేషియా, ఇండోనేషియా దేశాల్లోని అడవుల్లో డ్రయోబలనొప్స్, యూకలిప్టస్ వంటి కొన్ని రకాల జాతి చెట్లలో చూడొచ్చు ఈ తీరు.

మొదటిసారిగా 1920లో చెట్లలోని ఈ క్రౌన్ షైనెస్ గురించి ప్రపంచానికి తెలిసింది.  టచ్ మి నాట్ అన్నట్టు చెట్లలో ఈ వింతేంటో అన్న దానిపై భిన్నమైన కారణాలున్నాయి అంటూ చెబుతున్నారు పరిశోధకులు. ఒకటేమో… ఆకులు తినే ఓ రకమైన పురుగులు ఒక చెట్టు నుంచి మరో చెట్టుపైకి చేరకుండా ఉండటానికే ఈ చెట్లు ఇలా ఖాళీ స్థలాల్ని వదులుతూ పెరుగుతాయని. రెండోదేమో ఒక చెట్టు ఆకులు మరో చెట్టుకు తగలకుండా, చెట్ల కిరణజన్యసంయోగ క్రియకు అడ్డు రాకుండా ఉండటానికేనని. కారణం కచ్చితంగా తెలియకపోయినా ఈ స్వభావంతో అందర్నీ ఆకట్టుకుంటున్నాయీ చెట్లు.

The Mysteries of Crown Shyness

Related Images:

[See image gallery at manatelangana.news]

The post టచ్ మీ నాట్! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.