అందాల అరకు

ప్రకృతి పచ్చని చీర సింగారించుకుందా అనిపించే అందమైన లోకం.. మానసికోల్లాసాన్ని పెంచే కొండలు, కోనలు, వాగులు.. అబ్బుర పరిచే సంస్కృతి, సంప్రదాయాలు .. మండే ఎండల్లో సైతం.. చల్లని చిరుగాలులతో ఆహ్లాదాన్ని పెంచే మహత్తర ప్రదేశం. అటు యాత్రా స్థలంగా, ఇటు టూరిస్టు స్పాట్‌గా తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకున్న అందమైన అద్భుత ప్రదేశమది.. అదే.. విశాఖ జిల్లాలో ఉన్న అరకు.. అరకులోయగా కూడా పిలుచుకునే ఈ దివ్య క్షేత్రంలో విహారం ఇక్కడకు చేరుకునేవారికి కొత్త అనుభూతుల్ని […] The post అందాల అరకు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ప్రకృతి పచ్చని చీర సింగారించుకుందా అనిపించే అందమైన లోకం.. మానసికోల్లాసాన్ని పెంచే కొండలు, కోనలు, వాగులు.. అబ్బుర పరిచే సంస్కృతి, సంప్రదాయాలు .. మండే ఎండల్లో సైతం.. చల్లని చిరుగాలులతో ఆహ్లాదాన్ని పెంచే మహత్తర ప్రదేశం. అటు యాత్రా స్థలంగా, ఇటు టూరిస్టు స్పాట్‌గా తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకున్న అందమైన అద్భుత ప్రదేశమది.. అదే.. విశాఖ జిల్లాలో ఉన్న అరకు.. అరకులోయగా కూడా పిలుచుకునే ఈ దివ్య క్షేత్రంలో విహారం ఇక్కడకు చేరుకునేవారికి కొత్త అనుభూతుల్ని సొంతం చేస్తుంది. ఏర్పడ్డాయి. ఈ ఆకారాలు రకరకాల జంతు, వస్తు, మానవ ఆకృతులతో విద్యుత్తు కాంతులతో వెలుగులీనుతున్నాయి.

ఇక్కడి గిరిజనులు ఈ ఆకృతులనే దేవతలుగా కొలుస్తున్నారు. బొర్రా గుహలకు వందమీటర్ల వ్యాసంతో ప్రవేశద్వారం ఉంది. కిలోమీటరు పొడవునా సొరంగం ఉంటుంది. ఇందులో చాలా చోట్ల మూడు అరలు కలిగిన సొరంగాలు ఉన్నాయి. బొర్రా గుహలకు ఐదు కిలోమీటర్ల దూరంలో కటిక జలపాతం ఉంది. కొత్తవలస – కిరండోల్ రైలు మార్గంలో 44వ టన్నెల్ వద్ద ఈ జలపాతం దర్శనమిస్తుంది.

దీనిని దాటుకుని ముందుకు వెళితే భూలోక స్వర్గం లాంటి అరకు వస్తుంది. ఇక్కడి వాతావరణం మామూలు వాతావరణానికి కొంచెం భిన్నంగా ఉంటుంది. నిత్యం వచ్చిపోయే పర్యాటకులతో, గిరిజనులతో అరకు అలరారుతూ ఉంటుంది.
అరకులో చెప్పుకోదగ్గ ఆలయాల్లో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం ఒకటి. ఇది ఎప్పుడు నిర్మించిందీ ఇతిమిద్దమైన ఆధారాలు లేకపోయినప్పటికీ, బహుళ ప్రాచుర్యం పొందింది. అందువల్ల అరకుకు వెళ్ళగానే వేంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాను.
అరకులో ఉన్న మరో ముఖ్యమైన ఆలయం గంగాలమ్మ ఆలయం. ఈవిడే ఈ అరకు గ్రామ దేవత. గంగాలమ్మ ఆశీస్సులు తీసుకుంటే అంతా మంచే జరుగుతుందని ఇక్కడి గిరిజనులు నమ్ముతారు.

ఇక అరకులో అత్యంత సాధారణంగా కనిపించేది ఇక్కడున్న ధింసా నృత్యం. ఇది ఈ ప్రాంతానికే అత్యంత పేరు ప్రతిష్టలు తీసుకొచ్చింది. పదులకొద్ది గిరిజన మహిళలు రకరకాల వరుసల్లో ధింసా నృత్యం చేస్తుంటే ఆ ఆనందమే వేరు…అంత చక్కగా ఉంటుందిది. పర్యాటక శాఖ ప్రత్యేకంగా ఇక్కడ ధింసా నృత్యాన్ని ఏర్పాటు చేసింది.
ఇక అరకులో ఏదైనా వెరైటీగా తినాలంటే బొంగు చికెన్‌కు ఆర్డరివ్వాల్సిందే..

అరకులో ఎక్కడ చూసినా ఈ ‘బొంగు’ చికెన్ కనిపిస్తుంది. వెదురు బొంగుల్లో వండే ఈ చికెన్ భలే రుచిగా ఉంటుంది.
అరకు గ్రామంలో తిరిగిన తరువాత బాగా ఆకలి కావడంతో నేనుకూడా బొంగు చికెన్ రుచులు ఆస్వాదించాను.
ఇక అరకులో పనస వైన్ కూడా బాగా ఫేమస్. అరకు వెళ్ళిన వారు దీనిని తప్పక చేయాల్సిందే.. నేత్రానందాన్ని, జిహ్వరుచిని అందించే అరకుకు చుట్టు పక్కల అనేక సుందరమైన ప్రదేశాలున్నాయి. వాటిలో ముఖ్యమైనది ఇక్కడున్న గిరిజన మ్యూజియం. మన్యం ప్రజల జీవన విధానం, వారి ఆచార, సంప్రదాయాలను తెలుసుకోవాలంటే తప్పకుండా ఈ మ్యూజియాన్ని సందర్శించాల్సిందే. ఇక్కడి చూడచక్కని బొమ్మలు భలే ఆకట్టుకుంటాయి. ఇక్కడ దింసా నృత్య ప్రతిమలు ఫొటోలు, సెల్ఫీలు తీసుకునేందుకు బాగుంటాయి. గిరిజన వస్తువులు ఇక్కడ తక్కువ ధరకే లభిస్తాయి.

అరకులోయలోని పద్మావతి ఉద్యానవన కేంద్రం పర్యాటకులకు కనువిందు చేస్తుంది. ఇక్కడి అందాలను వీక్షించేందుకు దేశ,విదేశాల పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడి చెట్లపై నిర్మించిన హట్స్ పర్యాటకులకు మరువలేని అనుభూతిని కల్గిస్తాయి. చల్లని వాతావరణం మధ్య హ ట్స్‌లో బస చేసే సౌకర్యం ఉంది. గార్డెన్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన గిరిజన మహిళ, మత్స్యకన్య, అ ల్లూరి సీతారామరాజు, శివపార్వతుల విగ్రహాలు, టాయ్ ట్రైన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గార్డెన్‌లో గులాబీ మొక్కలు సందర్శకుల ను ఎంతగానో ఆకట్టుకుంటాయి. అరకు లోయ వస్తే తప్పకుండా ఈ ఉద్యానవనాన్ని సందర్శించాలి.
అరకులోయకు ఆరు కిలోమీటర్ల దూరంలో రణ జిల్లెడ జలపాతం ఉంది. పద్మాపురం ఉద్యానవనం సందర్శించిన తర్వాత ఈ ప్రాంతాన్ని సందర్శించవచ్చు.

అరకులోయకు 13 కిలోమీటర్ల దూరంలో చాపరాయి జలపాతం వుంది. నునుపైన రాళ్ళపై నుంచి నీళ్ళు జాలువారుతుంటే ఆ అనుభూతే వేరు. నీటి వేగం తక్కువగా ఉన్నప్పుడు ఇక్కడ స్నానాలు కూడా చేయొచ్చు. ఇక అరకులో సాయంత్రం వేళ్లలో వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. వర్షపు తుంపర్లతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ తుంపర జల్లులలో తడుస్తూ వేడి వేడి చికెన్ పకోడీలు తింటే ఆ అనుభూతే వేరు.. ఇలాంటి మధురానుభూతులెన్నింటినో అరకు ఇచ్చింది. ఆ అవ్యక్తమైన అనుభూతులతో తిరిగి అరకు నుంచి విశాఖకు తిరుగు పయనమయ్యాను.

                                                                                  దాసరి దుర్గాప్రసాద్, 77940 96169

Related Images:

[See image gallery at manatelangana.news]

The post అందాల అరకు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.