24 నుంచి ఎంసెట్ కౌన్సెలింగ్

మన తెలంగాణ/హైదరాబాద్ : ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 24 నుంచి ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. ఎంసెట్‌లో ఉత్తీర్ణత సాధించిన ఇంటర్ ఎంపిసి విద్యార్థులు ఈ నెల 24 నుంచి జూలై 1వ తేదీ వరకు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. విద్యార్థులు ఎంపిక చేసుకున్న సహాయ కేంద్రాలలో ఈ నెల 27 నుంచి జూలై 3వరకు ధృవపత్రాల పరిశీలన నిర్వహించనున్నారు. ఈ మేరకు ఎంసెట్ ప్రవేశాల […] The post 24 నుంచి ఎంసెట్ కౌన్సెలింగ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మన తెలంగాణ/హైదరాబాద్ : ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 24 నుంచి ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. ఎంసెట్‌లో ఉత్తీర్ణత సాధించిన ఇంటర్ ఎంపిసి విద్యార్థులు ఈ నెల 24 నుంచి జూలై 1వ తేదీ వరకు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. విద్యార్థులు ఎంపిక చేసుకున్న సహాయ కేంద్రాలలో ఈ నెల 27 నుంచి జూలై 3వరకు ధృవపత్రాల పరిశీలన నిర్వహించనున్నారు. ఈ మేరకు ఎంసెట్ ప్రవేశాల కమిటీ కన్వీనర్ నవీన్ మిట్టల్ షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈనెల 24 నుంచి జూలై 4వరకు వెబ్ ఆప్షన్ల ఎంపిక చేసుకునేందుకు అవకాశం కల్పించి, జూలై 6వ తేదీన ఇంజనీరింగ్, పార్మసీ సీట్లు కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. సీట్లు పొందిన విద్యార్థులు జూలై 12 వరకు ఫీజు చెల్లించి, ఆన్‌లైన్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని తెలిపారు. ఇతర వివరాల కోసం www.tseamcet.nic.in వెబ్‌సైట్‌లో చూడాలని పేర్కొన్నారు.
22 నుంచి ఇసెట్ కౌన్సెలింగ్
డిప్లొమా విద్యార్థులకు బి.టెక్, బి.ఫార్మసీ, బిఎస్‌సి కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఇసెట్) కౌన్సెలింగ్ ఈ నెల 22 నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 22,23 తేదీలలో ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి,సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. ఈ నెల 24 నుంచి 26 వరకు వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇసెట్ ప్రవేశాల కమిటీ కన్వీనర్ నవీన్ మిట్టల్ షెడ్యూల్‌ను విడుదల చేశారు. విద్యార్థులు ఎంపిక చేసుకున్న సహాయ కేంద్రాలలో ఈ నెల 24 నుంచి 26 ధృవపత్రాల పరిశీలన నిర్వహించనున్నట్లు తెలిపారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఈ నెల 24 నుంచి 27 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ నెల 29న సీట్లు కేటాయించనున్నట్లు వెల్లడించారు. సీట్లు పొందిన అభ్యర్థులు జూలై 4వ తేదీ వరకు ఫీజు చెల్లించి, ఆన్‌లైన్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని తెలిపారు. ఇతర వివరాల కోసం www.tsecet.nic.in వెబ్‌సైట్‌లో చూడాలని తెలిపారు.
కౌన్సెలింగ్‌లో కొత్తగా స్లాట్ బుకింగ్ విధానం
రాష్ట్రంలో ఎంసెట్, ఇసెట్ కౌన్సెలింగ్‌లో ప్రవేశాలకు నిర్వహించే కౌన్సెలింగ్‌లో ఈ సారి స్లాట్ బుకింద్ విధానం అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ విధానంలో విద్యార్థులు కోరుకున్న హెల్ప్‌లైన్ కేంద్రాలలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయించుకునే అవకాశం ఉంటుంది. ఈ విధానం వల్ల విద్యార్థి సమయం ఆదా కావడంతో పాటు దూర ప్రాంతాలకు వెళ్లే శ్రమ తగ్గుతుంది. ఇప్పటివరకు విద్యార్థులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం తమ ర్యాంకు ప్రకారం కేటాయించిన హెల్ప్‌లైన్ కేంద్రానికి వెళ్లి చేయించుకోవాల్సి వచ్చేది. ఇందుకోసం ఒక్కోసారి ఎక్కువ దూరం వెళ్లాల్సి వచ్చేది. అలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు సాంకేతిక విద్యాశాఖ స్లాట్ బుకింగ్ విధానానికి శ్రీకారం చుట్టింది. విద్యార్థులు తమకు అందుబాటులో ఉన్న హెల్ప్‌లైన్ కేంద్రానికి వెళ్లి, తమకు నచ్చిన తేదీల్లో, వీలైన సమయంలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకునేలా స్లాట్ బుకింగ్ విధానం అమల్లోకి తెచ్చింది. ఈ విధానాన్ని ఎంసెట్, ఇసెట్ సహా అన్ని వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల ప్రవేశాల కౌన్సెలింగ్‌ల్లో అమలు చేయాలని నిర్ణయించింది.

TS Engineering Counselling Notification on June 24

 

Related Images:

[See image gallery at manatelangana.news]

The post 24 నుంచి ఎంసెట్ కౌన్సెలింగ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: