వారసుడి నిర్ణయం పార్టీదే

న్యూఢిల్లీ : తన వారసుడు ఎవరనేది పార్టీయే నిర్ణయిస్తుందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చెప్పారు. పదవి నుంచి వైదొలుగుతానని ప్రకటించిన రాహుల్ తదుపరి చర్యపై ఇప్పటికీ ఉత్కంఠ నెలకొని ఉంది. పలు రకాల ఊహాగానాలు తలెత్తుతున్నాయి. పార్టీ అధ్యక్ష స్థానంలోకి ఎవరు వస్తారనేది నిర్ణయించాల్సింది తాను కాదని, పార్టీనే అని రాహుల్ ఇప్పుడు స్పష్టం చేశారు. పార్లమెంట్ ఆవరణలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికలలో పార్టీ సరైన ఫలితాలు సాధించకపోవడంతో తాను వైదొలుగుతానని […] The post వారసుడి నిర్ణయం పార్టీదే appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

న్యూఢిల్లీ : తన వారసుడు ఎవరనేది పార్టీయే నిర్ణయిస్తుందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చెప్పారు. పదవి నుంచి వైదొలుగుతానని ప్రకటించిన రాహుల్ తదుపరి చర్యపై ఇప్పటికీ ఉత్కంఠ నెలకొని ఉంది. పలు రకాల ఊహాగానాలు తలెత్తుతున్నాయి. పార్టీ అధ్యక్ష స్థానంలోకి ఎవరు వస్తారనేది నిర్ణయించాల్సింది తాను కాదని, పార్టీనే అని రాహుల్ ఇప్పుడు స్పష్టం చేశారు. పార్లమెంట్ ఆవరణలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికలలో పార్టీ సరైన ఫలితాలు సాధించకపోవడంతో తాను వైదొలుగుతానని రాహుల్ ప్రకటించారు. అయితే ఆయన ప్రతిపాదనను సిడబ్లుసి తిరస్కరించింది. పార్టీ పునర్నిర్మాణ బాధ్యతను రాహుల్‌కే అప్పగిస్తున్నట్లు తెలిపింది. అయితే ఆ తరువాత కూడా రాహుల్ పార్టీ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనడం లేదు. ఇప్పుడు విలేకరుల ముందుకు వచ్చారు. రాఫెల్ ఒప్పందంలో చోరీ జరిగిందనే తన వాదనకు కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. మోడీ చౌకీదార్ కోణంలో రాహుల్ ఈ వ్యాఖ్యలకు దిగారు. పార్లమెంట్ ఉభయ సభలనుద్ధేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేసిన ప్రసంగంలో రాఫెల్ ప్రస్తావనపై రాహుల్ స్పందించారు. రాఫెల్ ఒప్పం దం ఖరారులో అవినీతి జరిగిందని రాహుల్ మరోసారి స్పష్టం చేశారు. ఈ ఒప్పందంపై క్షుణ్ణంగా దర్యాప్తు జరపాల్సి ఉందని అన్నారు. రాఫెల్ అవినీతిపై సివిసి దర్యాప్తునకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అభ్యర్థించింది, అయితే ఒప్పందంలో ఎటువంటి అవినీతి జరగలేదని, అక్రమాలు కానీ, కొందరి పట్ల మొగ్గు చూపడం కానీ జరగలేదని ప్రభుత్వం చెపుతూ వస్తోంది.

Rahul Gandhi announces to resign as Congress president

Related Images:

[See image gallery at manatelangana.news]

The post వారసుడి నిర్ణయం పార్టీదే appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.