శంఖుస్థాపనలు పండుగల్లా జరగాలి

మన తెలంగాణ/హైదరాబాద్: పండుగ వాతావరణంలో టిఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాల శంఖుస్థాపనల కార్యక్రమాలను నిర్వహించాలని టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిజిల్లాలో పార్టీ కార్యాలయాల శంఖుస్థాపనలతో పాటు నిర్మాణ పనులు కూడా వేగవంతం చేయాలని ఆయన ఆదేశించారు. జిల్లాకార్యాలయాల నిర్మాణాలు పూర్తి అయితే ప్రజల సమస్యలను ఎక్కడికక్కడ పరిష్కారం చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. జిల్లాస్థాయిలో ఉండే సమస్యలను జిల్లాస్థాయిలోని ప్రజాప్రతినిధులు పరిష్కరించి రాష్ట్రానికి సంబంధించిన సమస్యలను ప్రభుత్వం […] The post శంఖుస్థాపనలు పండుగల్లా జరగాలి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మన తెలంగాణ/హైదరాబాద్: పండుగ వాతావరణంలో టిఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాల శంఖుస్థాపనల కార్యక్రమాలను నిర్వహించాలని టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిజిల్లాలో పార్టీ కార్యాలయాల శంఖుస్థాపనలతో పాటు నిర్మాణ పనులు కూడా వేగవంతం చేయాలని ఆయన ఆదేశించారు. జిల్లాకార్యాలయాల నిర్మాణాలు పూర్తి అయితే ప్రజల సమస్యలను ఎక్కడికక్కడ పరిష్కారం చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. జిల్లాస్థాయిలో ఉండే సమస్యలను జిల్లాస్థాయిలోని ప్రజాప్రతినిధులు పరిష్కరించి రాష్ట్రానికి సంబంధించిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి జిల్లానాయకులు తీసుకువస్తే ప్రజా సమస్యలు వేగవంతంగా పరిష్కారం అవడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు ప్రజలందరికి మరింత వేగంగా అందేవిధంగా క్షేత్రస్థాయిలో నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని కెటిఆర్ చెప్పారు. గురువారం ప్రగతిభవన్‌లో కెటిఆర్‌ను కలిసిన ముఖ్యనాయకులతో ఆయన మాట్లాడుతూ ఈవిషయాన్ని ప్రకటించారు.

ముఖ్యమంత్రి కెసిఆర్ పార్టీ కార్యవర్గ సంమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు 32 జిల్లా పార్టీకార్యాలయాలకు ఈనెల 24 శంఖుస్థాపన కార్యాక్రమాలు చేయాలని కెటిఆర్ నాయకులకు వివరించారు. ఇప్పటికే ప్రభుత్వం జిల్లాపార్టీ కార్యాలయాల నమూనాలు సైతం సిద్ధం చేసిందని చెప్పారు. అలాగే పార్టీ కార్యాలయాలకు స్థలాల కేటాయింపులు కూడా జరిగాయని ఆయన వివరించారు. జిల్లాపార్టీ కార్యాలయాల నిర్మాణాలకు పార్టీ నుంచే నిధులు కేటాయించిన నేపథ్యంలో త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేయనున్నట్లు కెటిఆర్ చెప్పారు. మంత్రులు ప్రాతినిథ్యం వహించే జిల్లాలో మంత్రులు జిల్లాపార్టీ కార్యాలయాలకు శంఖుస్థాపనలు చేయాలని కెటిఆర్ చెప్పరాఉ.. అలాగే మంత్రులు లేని జిల్లాచోట్ల పార్లమెంట్ సభ్యులు, నూతంనంగా ఎన్నికైన జిల్లా జెడ్‌పి చైర్మన్లు, స్థానిక శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు శంఖుస్థాపన కార్యక్రమాలను పూర్తి చేయాలని కెటిఆర్ ఆదేశించారు.
ప్రజలకు అందుబాటులో పార్టీ కార్యాలయాలు
జిల్లాపార్టీ కార్యాలయాల్లో ప్రజా అవసరాలకు అనుకూలంగా ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రజాఫిర్యాదులు, సమస్యల పరిష్కారం, జిల్లా స్థాయిలోని సంక్షేమపథకాల సమీక్షలు చేసేందుకు జిల్లా నాయకులకు పార్టీ కార్యాలయాల్లో ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి జిల్లా స్థాయి ప్రజాప్రతినిధుల కోసం ప్రత్యేక క్యాబిన్లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రజాప్రతినిధుల ఆధీనంలో పరిష్కారం అయ్యే సమస్యలను ఎక్కడి కక్కడ పరిష్కరించేందుకు పార్టీ కార్యాలయాల ఏర్పాటు చేస్తున్నట్లు పార్టీ ఇప్పటికే ప్రకటించింది. అలాగే టిఆర్‌ఎస్ పార్టీ శ్రేణులకు జిల్లాస్థాయి శిక్షణా తరగతులు నిర్వహించేందుకు అవసరమైన మౌలిక వసతతులను కూడా జిల్లాపార్టీ కార్యాలయాల్లో ఏర్పాటు చేస్తున్నారు. పార్టీ కార్యాలయాల శంఖుస్థాపనలన నుంచి నిర్మాణాలు పూర్తి అయ్యేంతవరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌కు టిఆర్‌ఎస్ అధిష్టానం బాధ్తలను అప్పగించింది. ఈ నేపథ్యంలో కెటిఆర్ జిల్లానాయకులతో ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ శంఖుస్థాపనపనులను సమీక్షిస్తున్నారు. జిల్లాల వారిగే అన్ని పార్టీ కార్యాలయాలు ఒకేవిధంగా ఉండే విధంగా నిర్మించేందుకు ఇప్పటికే పార్టీ అధిష్టానం నమూనాలను తయారు చేసింది.

Establishment of Trs party offices in each district

Related Images:

[See image gallery at manatelangana.news]

The post శంఖుస్థాపనలు పండుగల్లా జరగాలి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: