ఆర్థిక వ్యవస్థ పట్టును కోల్పోతోంది

  ఎంపిసి సమావేశంలో ఆర్‌బిఐ గవర్నర్ ముంబై: దేశీయ ఆర్థిక వ్యవస్థ స్పష్టంగా పట్టును కొల్పోనుందని, వృద్ధిని ప్రోత్సహించేందుకు నిర్ణయాత్మక ద్రవ్యవిధానం అవసరమని ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) గవర్నర్ శక్తికాంత దాస్ వ్యాఖ్యానించారు. ఈ నెల ప్రారంభంలో ఎంపిసి సమావేశంలో ఇతర ఐదుగురు సభ్యులతో పావు శాతం రేటు కోత కోసం ఓటింగ్ సమయంలో ఆయన ఈ విధంగా అన్నారు. జూన్ 3 నుంచి 6 వరకు జరిగిన ఎంపిసి(మోనెటరీ పాలసీ కమిటీ) మినిట్స్ ప్రకారం, 2019 […] The post ఆర్థిక వ్యవస్థ పట్టును కోల్పోతోంది appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఎంపిసి సమావేశంలో ఆర్‌బిఐ గవర్నర్

ముంబై: దేశీయ ఆర్థిక వ్యవస్థ స్పష్టంగా పట్టును కొల్పోనుందని, వృద్ధిని ప్రోత్సహించేందుకు నిర్ణయాత్మక ద్రవ్యవిధానం అవసరమని ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) గవర్నర్ శక్తికాంత దాస్ వ్యాఖ్యానించారు. ఈ నెల ప్రారంభంలో ఎంపిసి సమావేశంలో ఇతర ఐదుగురు సభ్యులతో పావు శాతం రేటు కోత కోసం ఓటింగ్ సమయంలో ఆయన ఈ విధంగా అన్నారు. జూన్ 3 నుంచి 6 వరకు జరిగిన ఎంపిసి(మోనెటరీ పాలసీ కమిటీ) మినిట్స్ ప్రకారం, 2019 ఏప్రిల్‌లో సమీక్ష నుంచి ఆయన ఆర్థిక వ్యవస్థపై స్పష్టమైన విధానాన్ని కల్గి ఉన్నారు. గురువారం ఈ మినిట్స్‌ను ఆర్‌బిఐ విడుదల చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో 5.8 శాతంతో నాలుగో త్రైమాసికంలో జిడిపి వృద్ధి రేటు నెమ్మదించడంతో ఆర్థిక వ్యవస్థ పట్టుకోల్పోతోందనే విషయం స్పష్టంగా తెలుస్తోందని ఆయన అన్నారు.

Economic activity clearly losing traction

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఆర్థిక వ్యవస్థ పట్టును కోల్పోతోంది appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.