మృత్యుంజయుడు… (వీడియో)

భువనేశ్వర్‌: భూమ్మిద నూకలు ఉంటే ఏంతటి ప్రమాదం సంభవించిన ప్రాణాలతో బతికి బయటపడే అవకాశం ఉంటుందని పెద్దల మాట. అలాంటి సంఘటనే ఇది. ఒడిశాలోని ఝర్సుగూడ రైల్వే స్టేషన్‌లో ఓ ప్రయాణికుడు కదులుతున్న రైలు ఎక్కుతుండగా అదుపుతప్పి పట్టాలపై జారిపడిన ఆ వ్యక్తి ప్రాణాలతో బతికి బయట పడ్డాడు. రాజేశ్‌ తల్వార్‌ అనే ప్రయాణికుడు హవ్‌రా నుంచి సాంబల్‌పూర్‌కు ట్రైన్ లో వెళ్తున్నాడు. కాగా, ఝర్సుగూడ రైల్వేస్టేషన్‌లో రైలు ఆగింది. టీ తాగుదామని అతను కిందకు దిగాడు. […] The post మృత్యుంజయుడు… (వీడియో) appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

భువనేశ్వర్‌: భూమ్మిద నూకలు ఉంటే ఏంతటి ప్రమాదం సంభవించిన ప్రాణాలతో బతికి బయటపడే అవకాశం ఉంటుందని పెద్దల మాట. అలాంటి సంఘటనే ఇది. ఒడిశాలోని ఝర్సుగూడ రైల్వే స్టేషన్‌లో ఓ ప్రయాణికుడు కదులుతున్న రైలు ఎక్కుతుండగా అదుపుతప్పి పట్టాలపై జారిపడిన ఆ వ్యక్తి ప్రాణాలతో బతికి బయట పడ్డాడు. రాజేశ్‌ తల్వార్‌ అనే ప్రయాణికుడు హవ్‌రా నుంచి సాంబల్‌పూర్‌కు ట్రైన్ లో వెళ్తున్నాడు. కాగా, ఝర్సుగూడ రైల్వేస్టేషన్‌లో రైలు ఆగింది.

టీ తాగుదామని అతను కిందకు దిగాడు. టీ తాగే వచ్చే లో రైలు కదిలింది. దీంతో రైలును ఎక్కడానికి యత్నించగా రాజేశ్‌ పట్టాలపై జారి పడ్డాడు. దీంతో తక్షణమే అప్రమత్తమైన రైల్వే పోలీసులు రైలును ఆపి బాధితుడిని పట్టాలపై నుంచి బయటకు తీశారు. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన రాజేశ్‌ ప్రస్తుతం దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.

A Man Survives After He Fell on The Tracks

Related Images:

[See image gallery at manatelangana.news]

The post మృత్యుంజయుడు… (వీడియో) appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: