ఆయన ఎందుకు వెళుతున్నారో నాకు చెప్పారు…

ఢిల్లీ : కాంగ్రెస్ నేత, మునుగోడు ఎంఎల్ఎ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపిలో చేరుతున్నట్టు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. రాజగోపాల్ రెడ్డి ఏ కారణాలతో బిజెపిలోకి వెళుతున్నారో తనకు చెప్పారని ఉత్తమ్ పేర్కొన్నారు. రాజకీయ కారణాలతో వెళ్లే వారి గురించి మాట్లాడొచ్చని, అయితే ఆర్థిక కారణాలతో వెళ్లే వారి గురించి ఏం మాట్లాడగలమని ఆయన ప్రశ్నించారు. పార్టీ మారాలనుకునే వారు ఎన్ని కారణాలైనా […] The post ఆయన ఎందుకు వెళుతున్నారో నాకు చెప్పారు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఢిల్లీ : కాంగ్రెస్ నేత, మునుగోడు ఎంఎల్ఎ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపిలో చేరుతున్నట్టు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. రాజగోపాల్ రెడ్డి ఏ కారణాలతో బిజెపిలోకి వెళుతున్నారో తనకు చెప్పారని ఉత్తమ్ పేర్కొన్నారు. రాజకీయ కారణాలతో వెళ్లే వారి గురించి మాట్లాడొచ్చని, అయితే ఆర్థిక కారణాలతో వెళ్లే వారి గురించి ఏం మాట్లాడగలమని ఆయన ప్రశ్నించారు. పార్టీ మారాలనుకునే వారు ఎన్ని కారణాలైనా చెబుతారని, రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్ఠానంతో చర్చిస్తానని ఉత్తమ్ పేర్కొన్నారు. నాయకులు పార్టీలు మారినంత మాత్రాన తమకు వచ్చే నష్టం ఏమీ లేదని, క్యాడర్ నుంచి లీడర్లు ఎదుగుతారని ఆయన పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తామని ఆయన పేర్కొన్నారు.

TPCC Chief Uttam Comments On MLA Raja Gopal Reddy

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఆయన ఎందుకు వెళుతున్నారో నాకు చెప్పారు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: