లండన్‌లో భారత్ సందడి

లండన్: ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న టీమిండియా ఆటగాళ్లు ప్రస్తుతం కుటుంబ సభ్యులతో కలిసి లండన్ వీధుల్లో సందడి చేస్తున్నారు. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో మ్యాచ్ అనంతరం టీమిండియాకు ఐదు రోజుల పాటు విశ్రాంతి లభించింది. దీన్ని ఆటగాళ్లు సద్వినియోగం చేసుకుంటున్నారు. భారత క్రికెట్ బోర్డు కూడా ఆటగాళ్లకు తమ కుటుంబ సభ్యులతో గడిపేందుకు అవకాశం కల్పించింది. దీంతో ఆటగాళ్లు తమ కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడుపుతున్నారు. బిసిసిఐ అనుమతించడంతో కెప్టెన్ విరాట్ కోహ్లితో సహా […] The post లండన్‌లో భారత్ సందడి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

లండన్: ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న టీమిండియా ఆటగాళ్లు ప్రస్తుతం కుటుంబ సభ్యులతో కలిసి లండన్ వీధుల్లో సందడి చేస్తున్నారు. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో మ్యాచ్ అనంతరం టీమిండియాకు ఐదు రోజుల పాటు విశ్రాంతి లభించింది. దీన్ని ఆటగాళ్లు సద్వినియోగం చేసుకుంటున్నారు. భారత క్రికెట్ బోర్డు కూడా ఆటగాళ్లకు తమ కుటుంబ సభ్యులతో గడిపేందుకు అవకాశం కల్పించింది. దీంతో ఆటగాళ్లు తమ కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడుపుతున్నారు.

బిసిసిఐ అనుమతించడంతో కెప్టెన్ విరాట్ కోహ్లితో సహా కొందరు ఆటగాళ్లు తమ భార్యా పిల్లలతో కలిసి సందడి చేస్తున్నారు. కాగా, ఆటగాళ్ల విజ్ఞప్తి మేరకు రెండు రోజుల పాటు ప్రాక్టీస్ సెషన్‌కు కూడా రద్దు చేశారు. కొందరూ ఆటగాళ్లు ఈ సందర్భంగా విశ్రాంతి తీసుకోగా, మరికొందరూ కుటుంబ సభ్యులతో క లిసి షికార్లు చేశారు. ఇక టీమిండియా కెప్టెన్ కోహ్లి తన భార్య అనుష్కశర్మతో కలిసి లండన్ వీధుల్లో చక్కర్లు కొడుతున్నాడు. ఈ సందర్భంగా కోహ్లి, అనుష్కల జంట లండన్‌లోని ఓల్ బాండ్ స్ట్రీట్‌లో కనిపించడంతో అభిమానులు తమ కెమెరాకి పనిచెప్పారు.

ఆ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. అలాగే ఓపెనర్లు రోహిత్‌శర్మ, శిఖర్‌ధావన్ తమ భార్యా పిల్లలతో కలిసి ఉన్న ఫొటోలు కూడా ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. కాగా, టీమిండియా వరల్డ్‌కప్‌లో తన తర్వాతి మ్యాచ్ పసికూన అఫ్గానిస్థాన్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్ శనివారం జరుగుతుంది.

Anushka Sharma spotted with Virat Kohli on London street

Related Images:

[See image gallery at manatelangana.news]

The post లండన్‌లో భారత్ సందడి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: