ప్రపంచకప్ నుంచి ధావన్ ఔట్

లండన్: వరుస విజయాలతో జోరుమీదున్న టీమిండియాకు షాక్ తగిలింది. కొంతకాలంగా గాయంతో బాధపడుతున్న స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ ప్రపంచకప్ నుంచి వైదొలిగాడు. ఎడమచేతి బొటనవేలుకు గాయం కారణంగా ఓపెనర్ శిఖర్ ధావన్ ప్రపంచకప్ టోర్నీకి దూరమయ్యాడు. ఈ విషయాన్ని భారత క్రికెట్ బోర్డు అధికారులు ధ్రువీకరించారు. కాగా, ధావన్ స్థానంలో రిషబ్ పంత్‌ను జట్టులోకి తీసుకోనున్నారు. వరల్డ్‌కప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ధావన్ గాయపడిన విషయం తెలిసిందే. కౌల్టర్‌నైల్ విసిరిన బంతి ధావన్ చేతికి […] The post ప్రపంచకప్ నుంచి ధావన్ ఔట్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

లండన్: వరుస విజయాలతో జోరుమీదున్న టీమిండియాకు షాక్ తగిలింది. కొంతకాలంగా గాయంతో బాధపడుతున్న స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ ప్రపంచకప్ నుంచి వైదొలిగాడు. ఎడమచేతి బొటనవేలుకు గాయం కారణంగా ఓపెనర్ శిఖర్ ధావన్ ప్రపంచకప్ టోర్నీకి దూరమయ్యాడు. ఈ విషయాన్ని భారత క్రికెట్ బోర్డు అధికారులు ధ్రువీకరించారు. కాగా, ధావన్ స్థానంలో రిషబ్ పంత్‌ను జట్టులోకి తీసుకోనున్నారు. వరల్డ్‌కప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ధావన్ గాయపడిన విషయం తెలిసిందే. కౌల్టర్‌నైల్ విసిరిన బంతి ధావన్ చేతికి బలంగా తగిలింది.

ఆ మ్యాచ్‌లో ఒకవైపు నొప్పి బాధిస్తున్నా ధావన్ అసాధారణ బ్యాటింగ్‌ను కనబరిచాడు. నొప్పితో ఇబ్బంది పడ్డప్పటికీ అతడు 109 బంతుల్లో 117 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. కాగా, ఆ మ్యాచ్‌లో ధావన్ ఫీల్డింగ్‌కు దిగలేదు. వైద్య పరీక్షల్లో ధావన్ బొటనవేలుకు గాయమైనట్టు తేలింది. ఈ సందర్భంగా ధావన్‌కు మూడు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు స్పష్టం చేశారు. అయితే బిసిసిఐ మాత్రం ధావన్‌ను ఇంగ్లండ్‌లోనే ఉంచి చికిత్స చేయించాలని నిర్ణయించింది.

కాగా, ప్రపంచకప్ ముగిసే వరకు ధావన్ కోలుకునే అవకాశం కనిపించడం లేదు. దీంతో అతను వరల్డ్‌కప్‌కు దూరంకాక తప్పలేదు. ఇదిలావుండగా ధావన్ గాయానికి గురైన నేపథ్యంలో స్టాండ్‌బైగా ఉన్న రిషబ్ పంత్‌ను ఇంగ్లండ్‌కు రప్పించారు. ఇప్పటికే అతను జట్టుతో పాటు సాధన చేస్తున్నాడు. త్వరలోనే దీనిపై బిసిసిఐ అధికార ప్రకటన చేయనుంది.

Shikhar Dhawan ruled out of World Cup

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ప్రపంచకప్ నుంచి ధావన్ ఔట్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: