పాక్ జట్టును నిషేధించాలంటూ.. కోర్టులో అభిమాని పిటిషన్

లాహోర్: చిరకాల ప్రత్యర్థులు భారత్‌పాకిస్థాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ అంటే ఇరు దేశాల అభిమానులు ఒక యుద్ధంలా భావిస్తారు. ఏ జట్టు ఓడినా ఆ దేశ అభిమానులు జీర్ణించుకోరు. తమ అభిమాన క్రికెటర్లపై దూషణలకు దిగుతారు. కొన్నిసార్లు వారి ఇళ్లపై కూడా దాడులు చేస్తారు. ఇటీవల కాలంలో సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పోస్ట్‌లు పెడుతున్నారు. ఇక, తాజాగా ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ ఘోర పరాజయం పాలైన విషయం […] The post పాక్ జట్టును నిషేధించాలంటూ.. కోర్టులో అభిమాని పిటిషన్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

లాహోర్: చిరకాల ప్రత్యర్థులు భారత్‌పాకిస్థాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ అంటే ఇరు దేశాల అభిమానులు ఒక యుద్ధంలా భావిస్తారు. ఏ జట్టు ఓడినా ఆ దేశ అభిమానులు జీర్ణించుకోరు. తమ అభిమాన క్రికెటర్లపై దూషణలకు దిగుతారు. కొన్నిసార్లు వారి ఇళ్లపై కూడా దాడులు చేస్తారు. ఇటీవల కాలంలో సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పోస్ట్‌లు పెడుతున్నారు. ఇక, తాజాగా ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. కాగా, టీమిండియా చేతిలో పాక్ ఓటమిని ఆ దేశ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

ఓటమి అనంతరం పాక్ ప్రదర్శనపై, ఆ జట్టు కెప్టెన్‌పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి న్యాయ పోరాటం వరకూ వెళ్లారు. భారత్‌తో ఓడిపోయినందుకు గానూ పాక్ జట్టును నిషేధించాలంటూ ఓ అభిమాని కోర్టు మెట్లెక్కాడు. మ్యాచ్ ఓటమికి జట్టుతో పాటు సెలక్షన్ కమిటీ కూడా బాధ్యత వహించాలంటూ పంజాబ్ ప్రావిన్స్‌లోని గుజ్రన్‌వాలా సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. పాక్ జట్టును, ఇంజమామ్ ఉల్ హక్ అధ్యక్షతన ఉన్న సెలక్షన్ కమిటీపై నిషేధం విధించాలని పిటిషన్‌లో పేర్కొన్నాడు.

సివిల్ కోర్టు న్యాయమూర్తి ఈ పిటిషన్‌ను విచారించి.. దీనిపై నివేదికలు అందించాల్సిందిగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పిసిబి)కు ఆదేశాలు జారీ చేశారు. ఇదిలావుండగా భారత్ చేతిలో ఓటమి నేపథ్యంలో పిసిబి కూడా ప్రక్షాళన చర్యలు చేపట్టనున్నట్టు సమాచారం. జట్టు మేనేజ్‌మెంటులో భారీ మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదిలావుండగా పాక్ అభిమాని కోర్టుకు వెళ్లిన విషయం క్రికెట్ ప్రపంచంలో సంచలనంగా మారింది.

 

Related Images:

[See image gallery at manatelangana.news]

The post పాక్ జట్టును నిషేధించాలంటూ.. కోర్టులో అభిమాని పిటిషన్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: