విద్యార్థి మర్మాంగాలను లైటర్ తో కాల్చి…

లండన్ : ముగ్గురు యువకులు ఓ పాఠశాల బాలుడి పట్ల అమానవీయంగా ప్రవర్తించారు. శీతల పానీయం కిందపోశాడన్న కారణంతో ఆ బాలుడికి ఆరు గంటల పాటు నరకం చూసించారు. అనంతరం ఆ బాలుడిని నగ్నంగా మార్చి అతడి మర్మాంగాలపై లైటర్ తో కాల్చారు. ఈ ఘటన  యుకెలోని వెస్ట్ మిడ్లాండ్స్‌లో గల హైగేట్‌లో  జరిగింది. బాధిత బాలుడి ఫిర్యాదు మేరకు ముగ్గురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరచారు. ఈ ఘటనలో కోర్టు ఆ […] The post విద్యార్థి మర్మాంగాలను లైటర్ తో కాల్చి… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

లండన్ : ముగ్గురు యువకులు ఓ పాఠశాల బాలుడి పట్ల అమానవీయంగా ప్రవర్తించారు. శీతల పానీయం కిందపోశాడన్న కారణంతో ఆ బాలుడికి ఆరు గంటల పాటు నరకం చూసించారు. అనంతరం ఆ బాలుడిని నగ్నంగా మార్చి అతడి మర్మాంగాలపై లైటర్ తో కాల్చారు. ఈ ఘటన  యుకెలోని వెస్ట్ మిడ్లాండ్స్‌లో గల హైగేట్‌లో  జరిగింది. బాధిత బాలుడి ఫిర్యాదు మేరకు ముగ్గురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరచారు. ఈ ఘటనలో కోర్టు ఆ ముగ్గురు నిందితులకు శిక్షను విధించింది. స్నేహితులైన కీలె ఆస్టన్, క్రిస్టోఫర్ ప్యాట్స్ పీర్స్ , లూసీ ప్యాట్ పీర్స్ లు తమ ఇంటికి రావాలని సదరు బాధిత బాలుడిని పిలిశారు. దీంతో అతడు వారింటికి వెళ్లాడు. వారు సదరు బాలుడికి ఇచ్చిన శీతల పానీయం కొంచెం కిందపడింది. దీంతో వారు ఆ బాలుడిపై దాడి చేశారు. ఆ బాలుడిని చిత్రహింసలకు గురి చేసిన దృశ్యాలను లూసీ ప్యాట్ పీర్స్ వీడియో కూడా తీసింది.  వారి నుంచి తప్పించుకున్న బాధిత బాలుడు తనపై జరిగిన దాడిని తల్లిదండ్రులకు వివరించాడు. ఈ ఘటనపై వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై కోర్టులో విచారణ జరిగింది. నేరం నిర్ధారణ కావడంతో కోర్టు ఆస్టన్ కు 8 ఏళ్లు, లూసీకి 4 ఏళ్లు, క్రిస్టోఫర్ కు 2 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది.

Youngstars Attack On Boy in UK

Related Images:

[See image gallery at manatelangana.news]

The post విద్యార్థి మర్మాంగాలను లైటర్ తో కాల్చి… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: