కిలాడీ లేడీ మరో మోసం

హైదరాబాద్: మ్యాట్రిమోని వెబ్‌సైట్లలో నకిలీ ఫొటోలుపెట్టి విదేశాల్లో ఉన్న తెలుగు పెళ్లి కుమారులను మోసం చేస్తున్న కిలాడీని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. వివాహం చేసుకుంటానని చెప్పి అమెరికాలో ఉన్న యువకుడి వద్ద రూ.1,50,000 వసూలు చేసి మోసం చేసిన కోరం అర్చనను సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అర్చన తన సోదరుడిని కూడా మోసం చేసిందని కొత్తపేటకు చెందిన ఆడిటర్ మధుమోహన్ రాచకొండ […] The post కిలాడీ లేడీ మరో మోసం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్: మ్యాట్రిమోని వెబ్‌సైట్లలో నకిలీ ఫొటోలుపెట్టి విదేశాల్లో ఉన్న తెలుగు పెళ్లి కుమారులను మోసం చేస్తున్న కిలాడీని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. వివాహం చేసుకుంటానని చెప్పి అమెరికాలో ఉన్న యువకుడి వద్ద రూ.1,50,000 వసూలు చేసి మోసం చేసిన కోరం అర్చనను సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అర్చన తన సోదరుడిని కూడా మోసం చేసిందని కొత్తపేటకు చెందిన ఆడిటర్ మధుమోహన్ రాచకొండ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అరెస్టు చేశారు. నెల్లూరుకు చెందిన అర్చన(30) నగరంలోని వైభవ్ లేడిస్ హాస్టల్‌లో ఉంటోంది. భారత్ మ్యాట్రిమోని వెబ్‌సైట్‌లో నకిలీ ప్రొఫైల్‌ను పెట్టింది.

వెబ్‌సైట్‌లో అమెరికాలో ఉంటున్న సింహద్రి పవన్ కుమార్‌ను ఏప్రిల్, 13వ తేదీన సంప్రదించింది. తన పేరు పుష్టాయి అలియాస్ అర్చనగా చెప్పింది. తనకు సిస్కో కంపెనీలో ఉద్యోగం వచ్చిందని తను ఉన్న ప్రాంతానికి వెస్ట్‌పాలెం బీచ్‌కు గంట ప్రయాణం చేయాలని చెప్పింది. ట్రాన్స్‌పోర్టు, లగేజ్ షిఫ్టింగ్ కోసం డబ్బులు కావాలని చెప్పడంతో పవన్ నమ్మి రూ.4,00,000 పంపించాడు. అప్పటినుంచి పవన్ ఫోన్ చేసినా స్పందించలేదు. నిందితురాలిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలియడంతో పవన్ కుమార్ తన సోదరుడితో పోలీసులకు ఫిర్యాదు చేయించాడు. దీంతో అర్చనను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు.

Matrimonial Fraud in Hyderabad

Related Images:

[See image gallery at manatelangana.news]

The post కిలాడీ లేడీ మరో మోసం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: