ఆంత్రాక్స్ నివారణకు కొత్త వ్యాక్సిన్

న్యూఢిల్లీ : ఆంత్రాక్స్ ప్రాణాంతక వ్యాధి. మనుషులకే కాదు జంతువులను కూడా బలిగొంటుంది. ఆంత్రాక్స్ నివారణకు ప్రస్తుతం మార్కెట్లో వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నప్పటికీ వాటన్నిటి కన్నా సమర్థంగా ఆంత్రాక్స్ విషాన్ని దాని మూలాలను నిర్మూలించగల కొత్త వ్యాక్సిన్‌ను భారత శాస్త్రవేత్తల బృందం రూపొందించింది. బ్యాక్టీరియా బాసిల్లస్ ఆంత్రాసిస్ వల్ల ఆంత్రాక్స్ సంక్రమిస్తుంది. గుర్రాలు, గొర్రెలు, మేకలు, పశువుల మందలపై ఇది తీవ్ర ప్రభావం చూపిస్తుంది. వీటితో పోల్చుకుంటే మనుషులు, పందులు, కుక్కలపై ఈ వ్యాధి తక్కువగా సంక్రమిస్తుందని […] The post ఆంత్రాక్స్ నివారణకు కొత్త వ్యాక్సిన్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

న్యూఢిల్లీ : ఆంత్రాక్స్ ప్రాణాంతక వ్యాధి. మనుషులకే కాదు జంతువులను కూడా బలిగొంటుంది. ఆంత్రాక్స్ నివారణకు ప్రస్తుతం మార్కెట్లో వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నప్పటికీ వాటన్నిటి కన్నా సమర్థంగా ఆంత్రాక్స్ విషాన్ని దాని మూలాలను నిర్మూలించగల కొత్త వ్యాక్సిన్‌ను భారత శాస్త్రవేత్తల బృందం రూపొందించింది. బ్యాక్టీరియా బాసిల్లస్ ఆంత్రాసిస్ వల్ల ఆంత్రాక్స్ సంక్రమిస్తుంది. గుర్రాలు, గొర్రెలు, మేకలు, పశువుల మందలపై ఇది తీవ్ర ప్రభావం చూపిస్తుంది. వీటితో పోల్చుకుంటే మనుషులు, పందులు, కుక్కలపై ఈ వ్యాధి తక్కువగా సంక్రమిస్తుందని చెబుతున్నారు. 2001లో ఈ ఆంత్రాక్స్ మూలకణాలు భౌతిక ఉగ్రవాద ఏజెంట్లుగా ఉపయోగపడిన సంఘటన జరిగింది.

ఆంత్రాక్స్ మూలకణాల ప్రభావిత అక్షరాలు గల ఉత్తరాలు అమెరికా లోని కొంతమందికి పంపడంతో ఈ వ్యాధి విపరీతంగా విస్తరించింది. ఈ వ్యాధి మూలకణాలు నేలలో కొన్నేళ్ల పాటు నిగూఢంగా ఉంటాయి. అనుకూలమైన వాతావరణం ఏర్పడితే అవి చురుకుదనం పొంది వ్యాధిని సంక్రమింప చేయడానికి సిద్ధ పడతాయి. సాధారణంగా జంతువులు మేత మేసేటప్పుడు ఈ ఆంత్రాక్స్ మూలాలను గ్రహిస్తుంటాయి. శరీరంలో ఇవి అల్లుకుపోయి విషాన్ని చిమ్ముతుంటాయి. మార్కెట్‌లో లభ్యమయ్యే యాంటీ ఆంత్రాక్స్ వ్యాక్సిన్లు బ్యాక్టీరియా బాసిల్లస్ ప్రొటీన్‌ను ప్రతిఘటించే సామర్థాన్ని కలిగిస్తాయి. ఈ ప్రొటీన్ బాసిల్లస్ విషం కణాల్లో సరఫరా కావడానికి సహకరిస్తుంది. అంటే ఆంత్రాక్స్ మూలకణాలు శరీరంలో మొలకెత్తి ప్రొటీన్లు ఉత్పత్తి కావడం ప్రారంభమైనప్పుడే ప్రతిఘటన సామర్ధం ప్రేరేపితమవుతుంది.

ఇదితప్ప మిగతా సమయాల్లో వ్యాక్సిన్‌ను ప్రతిఘటించే సామర్థం ఏర్పడదు. ఈ నేపథ్యంలో చేపట్టిన అధ్యయనాలు అచేతనంగా ఉన్న మూలకణాలను వ్యాక్సిన్‌తోపాటు శరీరం లోకి ఇంజెక్టు చేస్తే బ్యాసిల్లస్ నుంచి రక్షణ విస్తరిస్తుందని నిరూపించాయి. డిఫెన్స్ రీసెర్చి అండ్ డెవలప్‌మెంట్ లేబొరేటరీ (డిఆర్‌డిఎ) మైసూరు, జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జెఎన్‌యు),ఏకైక వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడానికి నిర్ణయించాయి. ఈ వ్యాక్సిన్, బ్యాక్టీరియా విషాన్నే కాకుండా దాని మూలకణాలను కూడా నిర్మూలించే శక్తి గలది. ఈ ప్రక్రియలో రెండు జన్యువులను ఏకం చేసే పని చేపట్టాయి. ఒకటి యాంటిజెన్ ప్రొటీన్‌ను రక్షించేది, మరొకటి మూలకణాల బాహ్య పొరలో ఉంటే ప్రొటీన్ ఒకటి.

ఈరెండు ప్రొటీన్ల ఏకీకరణ వల్ల ఏర్పడిన ప్రొటీన్‌ను ఎలుకలో ప్రయోగాత్మకంగా శాస్త్రవేత్తలు ఇంజెక్టు చేయగలిగారు. కొన్ని రోజుల తరువాత ఎలుక రక్తంలో విలీనమైన ప్రొటీన్లను వ్యతిరేకించే అత్యధిక సాంద్రత గల యాంటీ బాడీస్‌ను గమనించారు. ఇంజెక్టు అయిన ప్రొటీన్‌ను ప్రతిఘటించే సామర్థం కనిపించింది. విలీనమైన ప్రొటీన్ బ్యాక్టీరియా విషాన్ని దాని మూలాలను ప్రతిఘటించే సామర్థం ఈ కొత్త వ్యాక్సిన్‌కు ఉందని రుజువైందని డిఆర్‌డిఎల్ శాస్త్రవేత్త జోసఫ్ కింగ్‌స్టన్ వివరించారు. ఆంత్రాక్స్ నివారణకు యాంటీబయోటిక్స్ మార్కెట్‌లో లభ్యమవుతున్నప్పటికీ వ్యాక్సిన్లు మాత్రం చాలా అవసరం. లేకుంటే ఈ వ్యాధి ప్రభావం రెండుమూడు రోజుల్లో మరణానికి దారి తీస్తుంది.

Vaccines for Preventing Anthrax

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఆంత్రాక్స్ నివారణకు కొత్త వ్యాక్సిన్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.