బరువు తగ్గనున్న ఆ నటుడు

హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ’సైరా‘ సినిమా షూటింగ్ లో ఉన్నారు. అక్టోబర్ 2న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా తరువాత చిరంజీవి ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో నటించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. సైరా కోసం చిరంజీవి బరువు పెరిగారు. అయితే కొరటాల శివ సినిమాలో చిరంజీవి స్లిమ్ గా కనిపించనున్నారని, ఈ క్రమంలోనే బరువు తగ్గాలని కొరటాల చిరంజీవికి సూచించారని టాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. దీంతో చిరంజీవి […] The post బరువు తగ్గనున్న ఆ నటుడు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ’సైరా‘ సినిమా షూటింగ్ లో ఉన్నారు. అక్టోబర్ 2న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా తరువాత చిరంజీవి ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో నటించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. సైరా కోసం చిరంజీవి బరువు పెరిగారు. అయితే కొరటాల శివ సినిమాలో చిరంజీవి స్లిమ్ గా కనిపించనున్నారని, ఈ క్రమంలోనే బరువు తగ్గాలని కొరటాల చిరంజీవికి సూచించారని టాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. దీంతో చిరంజీవి బరువు తగ్గేందుకు జిమ్ కు వెళుతున్నారని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. కొరటాల శివ సినిమా కథలో సందేశం ఉంటుందని, చిరు మార్క్ ఫైట్లు ఉంటాయని, ఈ క్రమంలోనే తన పాత్రకు అనుగుణంగా చిరంజీవి బరువు తగ్గుతున్నారని తెలుస్తోంది. అయితే చిరంజీవితో సినిమా కావడంతో కొరటాల శివ సినిమా స్క్రిప్టును పక్కాగా రూపొందిస్తున్నారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. చిరు, కొరటాల సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.

Chiranjeevi Weight Loss For Director Koratala Film

Related Images:

[See image gallery at manatelangana.news]

The post బరువు తగ్గనున్న ఆ నటుడు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.