రెండో రోజూ ఎంపిల ప్రమాణాలు

ప్రముఖుల్లో సోనియా, ములాయం, మేనక తదితరులు న్యూఢిల్లీ: యుపిఎ చైర్‌పర్సన్ సోనియా గాంధీతో పాటు మంగళవారం లోక్‌సభ సభ్యులుగా పలువురు ప్రమాణం చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో రాయ్‌బరేలిస్థానంనుంచి తిరిగి గెలుసొందిన సోనియా 17వ లోక్‌సభ తొలి సమావేశాల రెండో రోజున హిందీలోప్రమాణం చేశారు. ఆమె కుమారుడు, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రతిపక్ష స్థానాలనుంచి తన తల్లి ప్రమాణం చేయడాన్ని తన మొబైల్‌లో బంధిస్తూ కనిపించారు. సోనియా ప్రమాణం చేస్తున్నప్పుడు ప్రతిపక్ష కాంగ్రెస్ సభ్యులు పెద్దగా […] The post రెండో రోజూ ఎంపిల ప్రమాణాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.


ప్రముఖుల్లో సోనియా, ములాయం, మేనక తదితరులు
న్యూఢిల్లీ: యుపిఎ చైర్‌పర్సన్ సోనియా గాంధీతో పాటు మంగళవారం లోక్‌సభ సభ్యులుగా పలువురు ప్రమాణం చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో రాయ్‌బరేలిస్థానంనుంచి తిరిగి గెలుసొందిన సోనియా 17వ లోక్‌సభ తొలి సమావేశాల రెండో రోజున హిందీలోప్రమాణం చేశారు. ఆమె కుమారుడు, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రతిపక్ష స్థానాలనుంచి తన తల్లి ప్రమాణం చేయడాన్ని తన మొబైల్‌లో బంధిస్తూ కనిపించారు. సోనియా ప్రమాణం చేస్తున్నప్పుడు ప్రతిపక్ష కాంగ్రెస్ సభ్యులు పెద్దగా బల్లలు చరుస్తూ హర్షధ్వానాలు చేయగా, హిందీలో ప్రమాణం చేసినందు కు అధికార పక్ష సభ్యులు ఆమెను అభినందిస్తూ వ్యాఖ్యలు చేయడం వినిపించింది. సోనియా ప్రమాణం చేసిన వెంటనే ఆమె తోడికోడలు మేన కా గాంధీ ప్రమాణం చేశారు. ఒకరికొకరు ఎదురుపడ్డ ఇద్దరూ చేతులు జోడించి పరస్పరం అభివాదం చేసుకోవడం కనిపించింది, మేనకా గాంధీ యుపిలోని సుల్తాన్‌పూర్‌నుంచి గెలుపొందిన విషయం తెలిసిందే. కాగా పిల్భిత్‌నుంచి గెలుపొందిన ఆమె కుమారుడు వరుణ్ గాంధీ కూడా ఈ రోజు ఎంపిగా ప్రమాణం చేశారు.

ఇంకా ప్రమాణం చేసిన ప్రముఖుల్లో యుపి మాజీ సిఎం ములాయం సింగ్ యాదవ్ ఉన్నారు. ఆయనను వీల్‌చైర్‌లో తీసుకొచ్చారు. వెంట ఆయన కమారుడు అఖిలేష్ యాదవ్ వచ్చా రు. ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఒవైసి, తెలంగాణ ఎంపిలు కూడా ప్రమాణం చేశారు. తెలంగాణ ఎంపిలు ప్రమాణం చేసిన తర్వాత అత్యధిక మంది జై తెలంగాణ నినాదాలు చేశారు. పలువురు ఎంపిలు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి అభివాదం చేయడం కనిపించింది. మాజీ ఆర్థికమంత్రి చిదంబరం కుమారుడు కార్తీ కూడా ఎంపిగా ప్రమా ణం చేశారు. దీన్ని చిదంబరం విజిటర్ గ్యాలరీ ఉండి వీక్షించారు. రెండో రోజు ఎంపిల అందరి ప్రమాణాలు ముగిసాయి. సోమవారం ప్రారంభమైన కొత్త లోక్‌సభ సమావేశాల తొలి రోజున ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా, రవాణా శాఖ మంత్రి నితిన్ గడరీ తదితర ప్రముఖులు ప్రమాణం చేసిన విషయం తెలిసిందే.

Oath-taking ceremony of newly elected MPs continued on 2nd day

Related Images:

[See image gallery at manatelangana.news]

The post రెండో రోజూ ఎంపిల ప్రమాణాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.