సౌతాఫ్రికాకు చావో రేవో

నేడు కివీస్‌తో కీలక పోరు బర్మింగ్‌హామ్: వరుస ఓటములతో సతమతమవుతున్న దక్షిణాఫ్రికా కిందటి మ్యాచ్‌లో పసికూన అఫ్గానిస్థాన్‌పై గెలిచి కాస్త ఆత్మవిశ్వాసాన్ని మూటగట్టుకుంది. ఈ విజయం అందించిన స్ఫూర్తితో బుధవారం న్యూజిలాండ్‌తో జరిగే కీలక మ్యాచ్‌కు సమరోత్సాహంతో సిద్ధమైంది. సెమీఫైనల్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా భారీ తేడాతో గెలవక తప్పదు. ఇక, న్యూజిలాండ్ ఈ ప్రపంచకప్‌లో ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచుల్లో మూడు విజయాలు సాధించింది. భారత్‌తో జరిగిన మ్యాచ్ వర్షం […] The post సౌతాఫ్రికాకు చావో రేవో appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

నేడు కివీస్‌తో కీలక పోరు
బర్మింగ్‌హామ్: వరుస ఓటములతో సతమతమవుతున్న దక్షిణాఫ్రికా కిందటి మ్యాచ్‌లో పసికూన అఫ్గానిస్థాన్‌పై గెలిచి కాస్త ఆత్మవిశ్వాసాన్ని మూటగట్టుకుంది. ఈ విజయం అందించిన స్ఫూర్తితో బుధవారం న్యూజిలాండ్‌తో జరిగే కీలక మ్యాచ్‌కు సమరోత్సాహంతో సిద్ధమైంది. సెమీఫైనల్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా భారీ తేడాతో గెలవక తప్పదు. ఇక, న్యూజిలాండ్ ఈ ప్రపంచకప్‌లో ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచుల్లో మూడు విజయాలు సాధించింది. భారత్‌తో జరిగిన మ్యాచ్ వర్షం వల్ల రద్దయ్యింది. ప్రస్తుతం కివీస్ రెండో స్థానంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. కాగా, ఎడ్జ్‌బాస్టన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్‌లో కూడా విజయం సాధించాలని కివీస్ తహతహలాడుతోంది. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఇరు జట్లు దాదాపు సమంగా ఉన్నాయి. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బ్యాట్స్‌మెన్, బౌలర్లు, ఆల్‌రౌండర్లు రెండు జట్లకు అందుబాటులో ఉన్నారు. అయితే అగ్రశ్రేణి ఆటగాళ్లతో కూడిన సఫారీ జట్టు ఈ ప్రపంచకప్‌లో ఆశించిన స్థాయిలో ఆడలేక పోతోంది. తొలి మూడు మ్యాచుల్లో వరుస ఓటములు చవిచూడడంతో సౌతాఫ్రికా ఆత్మవిశ్వాసం పూర్తిగా దెబ్బతిన్నంది.

ఇలాంటి పరిస్థితుల్లో రానున్న మ్యాచ్‌లు సౌతాఫ్రికాకు సవాలుగా తయారయ్యాయి. మిగిలిన అన్ని మ్యాచుల్లోనూ గెలవాల్సిన ఒత్తిడి జట్టుపై నెలకొంది. ఒత్తిడి నేపథ్యంలో సౌతాఫ్రికా సహాజ సిద్ధ ఆటను కనబరచలేక పోతోంది. ఇప్పటి వరకు జరిగిన మ్యాచుల్లో ఈ విషయం స్పష్టంగా కనిపించింది. అయితే న్యూజిలాండ్‌ను ఓడించే సత్తా సౌతాఫ్రికాకు ఉందనే చెప్పాలి. ప్రపంచంలోని అత్యంత బలమైన జట్లలో సఫారీ ఒకటి. కొన్ని మ్యాచుల్లో ఓడి పోయినంత మాత్రాన ఆ జట్టును తక్కువ అంచనా వేయలేం. ఒకసారి గాడిలో పడితే సౌతాఫ్రికాను ఆపడం ఎంత పెద్ద జట్టుకైనా కష్టమే. డుప్లెసిస్, డికాక్, హాషిం ఆమ్లా, డుమినీ, తాహిర్, ఎంగిడి, ఫెలుక్‌వాయో, మోరిస్ తదితరులతో సౌతాఫ్రికా అత్యంత బలంగా ఉంది. కానీ, నిలకడలేమి ఒక్కటే జట్టుకు ప్రధాన సమస్యగా మారింది. కివీస్‌తో జరిగే మ్యాచ్‌లో గెలిస్తే సఫారీ జట్టు ఆత్మవిశ్వాసం రెట్టింపు కావడం ఖాయం. అంతేగాక సెమీస్ అవకాశాలు కూడా మెరుగ్గా ఉంటాయి. అత్యంత కీలకమైన ఈ మ్యాచ్‌లో గెలిచి విమర్శకులకు గట్టి సమాధానం చెప్పాలనే పట్టుదలతో సౌతాఫ్రికా పోరుకు సిద్ధమైంది. మరోవైపు కివీస్ కూడా తన అజేయ రికార్డును కాపాడు కోవాలని భావిస్తోంది. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఓటమి పాలుకాక పోవడంతో కివీస్‌కు ఊరటనిచ్చే అంశం.
మార్టిన్ గుప్టిల్, మన్రో, విలియమ్సన్, లాథమ్, రాస్ టైలర్, గ్రాండోమ్, నిషమ్ తదితరులతో కివీస్ బ్యాటింగ్ చాలా పటిష్టంగా ఉంది. అంతేగాక ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర బౌలర్లుగా పేరున్న సౌథి, ఫెర్గూసన్, హెన్రి, బౌల్ట్‌లు కూడా కివీస్‌కు అందుబాటులో ఉన్నారు. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన క్రికెటర్లు ఉండడంతో పోరు ఆసక్తికరంగా సాగడం ఖాయం.

new zealand vs south africa today match

Related Images:

[See image gallery at manatelangana.news]

The post సౌతాఫ్రికాకు చావో రేవో appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: