నితీశ్‌కు నిరసనల సెగ

ముజఫర్‌పూర్: బిహార్‌లో మెదడు వాపు వ్యాధి లక్షణాలతో 127 మంది చిన్నారులు మృతి చెందిన ముజఫర్‌పూర్‌లోని శ్రీకృష్ణ మెడికల్ కాలేజి ఆస్పత్రిని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మంగళవారం సందర్శించినప్పుడు బాధిత కుటుంబాలనుంచి తీవ్ర నిరసనలు ఎదురైనాయి. 17 రోజుల క్రితం జిల్లాలో ఈ వ్యాధి ప్రబలిన తర్వాత ముఖ్యమంత్రి ముజఫర్‌పూర్ సందర్శించడం ఇదే తొలిసారి. ఇదే ఆస్పత్రిలోనే ఎక్కువ మంది చిన్నారులు చనిపోయారు. ముఖ్యమంత్రి ఆస్పత్రికి చేరుకోగానే అప్పటికే ఆగ్రహంతో ఊగిపోతున్న తల్లిదండ్రులు ‘వాపస్ జావో’(వెనక్కి […] The post నితీశ్‌కు నిరసనల సెగ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ముజఫర్‌పూర్: బిహార్‌లో మెదడు వాపు వ్యాధి లక్షణాలతో 127 మంది చిన్నారులు మృతి చెందిన ముజఫర్‌పూర్‌లోని శ్రీకృష్ణ మెడికల్ కాలేజి ఆస్పత్రిని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మంగళవారం సందర్శించినప్పుడు బాధిత కుటుంబాలనుంచి తీవ్ర నిరసనలు ఎదురైనాయి. 17 రోజుల క్రితం జిల్లాలో ఈ వ్యాధి ప్రబలిన తర్వాత ముఖ్యమంత్రి ముజఫర్‌పూర్ సందర్శించడం ఇదే తొలిసారి. ఇదే ఆస్పత్రిలోనే ఎక్కువ మంది చిన్నారులు చనిపోయారు. ముఖ్యమంత్రి ఆస్పత్రికి చేరుకోగానే అప్పటికే ఆగ్రహంతో ఊగిపోతున్న తల్లిదండ్రులు ‘వాపస్ జావో’(వెనక్కి వెళ్లిపో) అంటూ నినాదాలు చేశారు. ఆస్పత్రిలోని డాక్టర్లు, ఇతర సిబ్బంది రోగులను పట్టించుకోవడం లేదని, వారు ఇతర విషయాలపైనే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని మొదటినుంచీ ఆరోపిస్తున్న తల్లిదండ్రులు పది రోజుల ముందే గనుక నితీశ్ ఇక్కడికి వచ్చి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదని, చాలా మంది చిన్నారులు బతికి బట్టకట్టేవారని విలేఖరులతో అన్నారు. ముఖ్యమంత్రి వస్తున్నారని తెలియగానే ఆస్పత్రికి వాటర్ ట్యాంకర్లు వచ్చాయని కూడా ఓ బాధితుడు అన్నారు.

ఇప్పటివరకు రాష్ట్రంలో మెదడువాపు వ్యాధి లక్షణాలతో 127 మంది చిన్నారులు మృతి చెందగా, వీరిలో 107 మంది ముజఫర్‌నగర్, దాని పొరుగు జిల్లాలకు చెందిన వారే. కాగా, ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీ వెంటరాగా ఆస్పత్రి సందర్శించిన ముఖ్యమంత్రి అక్కడ చికిత్స పొందుతున్న చిన్నారులు, వారి తల్లిదండ్రులతో మాట్లాడారు. కాగా ముఖ్యమంత్రి వెళ్లేటప్పుడు ఎలాంటి నిరసనలూ ఎదురు కాలేదు. కాగా ముఖ్యమంత్రి పేషంట్లు, వారి బంధువులతో మాట్లాడారని, పేషంట్లకు అందిస్తున్న చికిత్స పట్ల కూడా ఆయన సంతృప్తి వ్యక్తం చేశారని శ్రీకృష్ణ్ణ మెడికల్ కాలేజి ఆస్పత్రి సూపరింటెండెంట్ ఎస్‌కె షాహి చెప్పారు. ప్రతిరోజూ సాయంత్రం 3 గంటలకు ఒక బులెటిన్‌ను విడుదల చేయాలని సిఎం తమను ఆదేశించారని చెప్పిన షాహి ఆస్పత్రిలో చికిత్సకు తగిన సదుపాయాలు లేకపోవడం పట్ల బాధపడ్డారని తెలిపారు.

127 Childrens die with brain swelling in Bihar

Related Images:

[See image gallery at manatelangana.news]

The post నితీశ్‌కు నిరసనల సెగ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: