రాష్ట్రం కోసం..

మన తెలంగాణ/హైదరాబాద్: విభజన చట్టంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యల సాధనకోసం పార్ల్లమెంట్‌లో భావసారూప్యత గల సభ్యులతో కలిసి పోరాటం చేస్తామని పార్లమెంట్‌లో టిఆర్‌ఎస్ పక్షనేత నామానాగేశ్వర రావు చెప్పారు. మ ంగళవారం పార్లమెంట్ లో సభ్యుడిగా ప్రమాణం చేసిన అనంతరం నామా మీడియాతో మాట్లాడుతూ విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలను పరిష్కరించడంలో కేంద్రంనిర్లక్షంగా వ్యవహరించిందని ఆరోపించారు. బంగా రు తెలంగాణ సాధనకోసం ప్రజలు సిఎం కెసిఆర్‌పై భరోసాతో 9 మంది సభ్యులను పార్లమెంట్‌కు పంపించారని ఆయన […] The post రాష్ట్రం కోసం.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మన తెలంగాణ/హైదరాబాద్: విభజన చట్టంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యల సాధనకోసం పార్ల్లమెంట్‌లో భావసారూప్యత గల సభ్యులతో కలిసి పోరాటం చేస్తామని పార్లమెంట్‌లో టిఆర్‌ఎస్ పక్షనేత నామానాగేశ్వర రావు చెప్పారు. మ ంగళవారం పార్లమెంట్ లో సభ్యుడిగా ప్రమాణం చేసిన అనంతరం నామా మీడియాతో మాట్లాడుతూ విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలను పరిష్కరించడంలో కేంద్రంనిర్లక్షంగా వ్యవహరించిందని ఆరోపించారు. బంగా రు తెలంగాణ సాధనకోసం ప్రజలు సిఎం కెసిఆర్‌పై భరోసాతో 9 మంది సభ్యులను పార్లమెంట్‌కు పంపించారని ఆయన చెప్పారు. ప్రజల నమ్మకాన్ని కాపాడుతూ తెలంగాణ అభివృద్ధికోసం నిరంతరం శ్రమిస్తామని చెప్పారు. గత ఐదేళ్లలో తెలంగాణ అభివృద్దికోసం, ప్రాజెక్టుల నిర్మాణాల కోసం కేంద్రం నుంచి నిధులు రాలేదని నామ నాగేశ్వర రావు ఆరోపించారు. టిఆర్‌ఎస్ పార్టీ సూచన మేరకు తెలంగాణ అభవృద్ధి లక్షంగా పార్లమెంట్‌లో పోరాటం చేస్తామన్నారు. ఎస్‌సి,ఎస్‌టి మైనారిటీ సంక్షేమ పథకాలకు కేంద్రం నుంచి వచ్చేవాటా సాధనకోసం పోరాటాల్సి వవస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినప్పటి నుంచి కేంద్రం ప్రత్యేకంగా ఏ ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేయలేదని ఆయన ఆరోపించారు.

ఇప్పటికైనా కేంద్రం తెలంగాణ అభివృద్ధికోసం నిబంధనల మేరకు నిధులు మంజూరు చేయని పక్షంలో ఆందోళనలు అనివార్యమవుతాయని హెచ్చరించారు. తెలంగాణ ప్రజల సమస్యల సాధనకు పార్లమెంట్‌ను వేదికగా చేసుకుని పోరాటం చేస్తామన్నారు. పార్లమెంట్‌లో టిఆర్‌ఎస్ పక్ష ఉపనాయకుడు కొత్తప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రంతో పోరాడితే కానీ సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. నీళ్లు,నిధులు, నియామకాల నినాదంతో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి ఐదేళ్లు పూర్తి అయినా కేంద్రం ఈ మూడు అంశాలపట్ల ఇంతవరకు సహకరించలేదన్నారు. గడిచిన ఐదేళ్లలో టిఆర్‌ఎస్ ఆధినేత, రాష్ట్రముఖ్యమంత్రి కెసిఆర్ సూచనల మేరకు పార్లమెంట్‌లో అనేకపోరాటాలు చేయాల్సివచ్చిందన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీలను సైతం కేంద్రం విస్మరించడంతో పార్లమెంట్‌లో ఆందోళన అనివార్యమైందన్నారు. హైకోర్టు కోసం సంవత్సరాల తరబడి పార్లమెంట్‌లో ఆందోళనచేస్తే కాని సాధించుకోలేకపోయమన్నారు.

అలాగే రహదారుల విస్తరణకోసం ఎన్నో ఆందోళనలు చేయాల్సివచ్చిందన్నారు. కేంద్రం తెలంగాణ అభివృద్ధికి సహకరించనిపక్షంలో భవిష్యత్‌లో కూడా పోరాటాలు చేసి సాధించుకుంటామన్నారు. ఐదేళ్లలో బిజెపి తెలంగాణకు సహకరించలేదని ఆరోపించారు. విభజన హామీలపై పార్లమెంట్‌లో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు.

Nama Nageswara Rao takes Oath as MP in Lok Sabbha

 

Related Images:

[See image gallery at manatelangana.news]

The post రాష్ట్రం కోసం.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: