జులైలోగా మున్సిపల్ ఎన్నికలు

మన తెలంగాణ/హైదరాబాద్: ఇరుగు పొరుగు రాష్ట్రాలతో సానుకూలంగా ఉండాలని రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. ఇరుగు పొరుగు రాష్ట్రాలతో కొనసాగించాల్సిన సంబంధాలు, రాబట్టాల్సిన ఫలితాలు.. తద్వారా రాష్ట్ర పురోగతికి దోహదపడే అంశాలపై కేబినెట్ సమావేశంలో విస్తృతంగా చర్చించినట్టు సిఎం తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌తో చాలా స్నేహపూర్వకమైన, ప్రేమపూర్వకమైన, ఉల్లాసభరితమైన సంబంధాన్ని కొనసాగించాలని కేబినెట్ స్పష్టమైన అవగాహనతో కూడిన నిర్ణయానికి వచ్చిందని వ్యాఖ్యానించారు. ఇటీవల జరిగిన పరిణామాల తో తెలుగు రాష్ట్రాల మధ్య మంచి వాతావరణం […] The post జులైలోగా మున్సిపల్ ఎన్నికలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మన తెలంగాణ/హైదరాబాద్: ఇరుగు పొరుగు రాష్ట్రాలతో సానుకూలంగా ఉండాలని రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. ఇరుగు పొరుగు రాష్ట్రాలతో కొనసాగించాల్సిన సంబంధాలు, రాబట్టాల్సిన ఫలితాలు.. తద్వారా రాష్ట్ర పురోగతికి దోహదపడే అంశాలపై కేబినెట్ సమావేశంలో విస్తృతంగా చర్చించినట్టు సిఎం తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌తో చాలా స్నేహపూర్వకమైన, ప్రేమపూర్వకమైన, ఉల్లాసభరితమైన సంబంధాన్ని కొనసాగించాలని కేబినెట్ స్పష్టమైన అవగాహనతో కూడిన నిర్ణయానికి వచ్చిందని వ్యాఖ్యానించారు. ఇటీవల జరిగిన పరిణామాల తో తెలుగు రాష్ట్రాల మధ్య మంచి వాతావరణం ఏర్పడిందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన మంగళవారం ప్రగతిభవన్‌లో జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలను సిఎం కెసిఆర్ మీడియాకు వెల్లడించారు. తెలంగాణ రాకముందు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలతో రోజూ బస్తీమే సవాల్ అనే పరిస్థితులు ఉండేవని సిఎం కెసిఆర్ అన్నారు. గతంలో అనేక వివాదాలు, కోర్టు వ్యా జ్యాలు ఉండేవని చెప్పారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కర్ణాటకతో మంచి సత్సంబంధాల్ని కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు.

కృష్ణ, గోదావరి వరదనీటిని పూర్తిగా వాడుకుంటాం…పొరుగు రాష్ట్రాలతో బలపడుతున్న మైత్రి 21న కాళేశ్వరం ప్రారంభం, 27న ప్రస్తుతమున్న చోటనే కొత్త సచివాలయానికి శంకుస్థాపన, ఎర్రమంజిల్‌లో నూతన అసెంబ్లీ భవనానికి పునాది రాయి పిఆర్‌సి, రిటైర్మెంట్ వయసు పెంపుపై త్వరలో సిబ్బంది సంఘాలతో చర్చించి నిర్ణయం రాష్ట్రం కోసం మోడీని అవసరమైతే నిలదీస్తాం, సహకరిస్తాం.పరస్పరం పంపిణీ చేసుకున్నామని వివరించారు.లోయర్ పెన్‌గంగ ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల నినాదమని, గత ప్రభుత్వం దశాబ్దాలుగా లోయర్ పెన్‌గంగను పెండింగ్‌లో పెట్టిందని విమర్శించారు. లోయర్ పెన్‌గంగ ప్రాజెక్టు చనాఖా కొరాటా రూపంలో త్వరలో పూర్తి కాబోతోందని వెల్లడించారు. మహారాష్ట్రతో సత్సంబంధాలు కొనసాగించడం వల్ల కాళేశ్వరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసి ప్రారంభించుకోబోతున్నామని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు 45 లక్షల ఎకరాలకు నీరిస్తుందని అన్నారు.దాంతోపాటు పారిశ్రామిక అవసరాలకు, తాగునీటి అవసరాలకు నీటిని అందిస్తుందని పేర్కొన్నారు. ప్రాజెక్టు వేగంగా పూర్తి కావడంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారని సిఎం వ్యాఖ్యానించారు

Municipal elections in July 2019 

Related Images:

[See image gallery at manatelangana.news]

The post జులైలోగా మున్సిపల్ ఎన్నికలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: