పైరు పచ్చగా తెలుగు నేల…

కృష్ణ, గోదావరి వరదనీటిని పూర్తిగా వాడుకుంటాం…పొరుగు రాష్ట్రాలతో బలపడుతున్న మైత్రి 21న కాళేశ్వరం ప్రారంభం, 27న ప్రస్తుతమున్న చోటనే కొత్త సచివాలయానికి శంకుస్థాపన, ఎర్రమంజిల్‌లో నూతన అసెంబ్లీ భవనానికి పునాది రాయి పిఆర్‌సి, రిటైర్మెంట్ వయసు పెంపుపై త్వరలో సిబ్బంది సంఘాలతో చర్చించి నిర్ణయం రాష్ట్రం కోసం మోడీని అవసరమైతే నిలదీస్తాం, సహకరిస్తాం.పరస్పరం పంపిణీ చేసుకున్నామని వివరించారు.లోయర్ పెన్‌గంగ ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల నినాదమని, గత ప్రభుత్వం దశాబ్దాలుగా లోయర్ పెన్‌గంగను పెండింగ్‌లో పెట్టిందని విమర్శించారు. […] The post పైరు పచ్చగా తెలుగు నేల… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

కృష్ణ, గోదావరి వరదనీటిని పూర్తిగా వాడుకుంటాం…పొరుగు రాష్ట్రాలతో బలపడుతున్న మైత్రి 21న కాళేశ్వరం ప్రారంభం, 27న ప్రస్తుతమున్న చోటనే కొత్త సచివాలయానికి శంకుస్థాపన, ఎర్రమంజిల్‌లో నూతన అసెంబ్లీ భవనానికి పునాది రాయి పిఆర్‌సి, రిటైర్మెంట్ వయసు పెంపుపై త్వరలో సిబ్బంది సంఘాలతో చర్చించి నిర్ణయం రాష్ట్రం కోసం మోడీని అవసరమైతే నిలదీస్తాం, సహకరిస్తాం.పరస్పరం పంపిణీ చేసుకున్నామని వివరించారు.లోయర్ పెన్‌గంగ ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల నినాదమని, గత ప్రభుత్వం దశాబ్దాలుగా లోయర్ పెన్‌గంగను పెండింగ్‌లో పెట్టిందని విమర్శించారు. లోయర్ పెన్‌గంగ ప్రాజెక్టు చనాఖా కొరాటా రూపంలో త్వరలో పూర్తి కాబోతోందని వెల్లడించారు. మహారాష్ట్రతో సత్సంబంధాలు కొనసాగించడం వల్ల కాళేశ్వరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసి ప్రారంభించుకోబోతున్నామని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు 45 లక్షల ఎకరాలకు నీరిస్తుందని అన్నారు.దాంతోపాటు పారిశ్రామిక అవసరాలకు, తాగునీటి అవసరాలకు నీటిని అందిస్తుందని పేర్కొన్నారు. ప్రాజెక్టు వేగంగా పూర్తి కావడంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారని సిఎం వ్యాఖ్యానించారు.
ఎపి, తెలంగాణ ప్రతి అంగుళానికి నీళ్లు తీసుకెళ్తాం
ఈ నెల 27 లేదా 28 తేదీల్లో ఎపి నీటిపారుదల శాఖ బృందం హైదరాబాద్‌కు వస్తుందని సిఎం తెలిపారు. సమావేశం తర్వాత క్షేత్రస్థాయిలో సంయుక్త బృందాలు పరిశీలనకు వెళ్తాయని అన్నారు. ఆ తర్వాత విజయవాడలో ఇరు రాష్ట్రాల బృందాల సమావేశం ఉంటుందని పేర్కొన్నారు. దాదాపు 5 వేల టిఎంసిల నీళ్లు రెండు రాష్ట్రాల్లో ప్రతి అంగులానికీ తీసుకెళ్తామని తెలిపారు. ఎపి ప్రభుత్వం మారడంతో సచివాలయం, శాసనసభ భవనాల అప్పగింత ప్రక్రియ జరుగుతోందని అన్నారు. సచివాలయం, అసెంబ్లీ భవనాల నిర్మాణంపైనా కేబినెట్ సమామేశంలో చర్చించామని తెలిపారు. వివిధ అంశాల్లో ఎపి ప్రభుత్వం చూపుతున్న చొరవ అభినందనీయమని అన్నారు. సచివాలయం, అసెంబ్లీ భవనాల నిర్మాణంపైనా చర్చించామని తెలిపారు.

పిఆర్‌సిపై తర్వలోనే సమావేశం
ప్రభుత్వ ఉద్యోగుల పిఆర్‌సిపై త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తామని సిఎం కెసిఆర్ వెల్లడించారు. ఉద్యోగుల పదవీ విరమణ వయసును 61 ఏళ్లకు పెంచుతామని తాము ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చామని,పిఆర్‌సి, పదవివిరమణ వయసుపై ఉద్యోగ సంఘాలతో చర్చించి అన్ని కలిపి ఒక ప్యాకేజీలాగా ఇవ్వాలని భావిస్తున్నామని అన్నారు.
జులైలో పురపాలక ఎన్నికలు
పురపాలక ఎన్నికలు వీలైనంత త్వరలో నిర్వహించాలని నిర్ణయించామని సిఎం తెలిపారు. నూతన మున్సిపల్ చట్టం తీసుకువస్తామని అన్నారు. వీలైనంత త్వరగా రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేసి జులైలో ఎన్నికలు ముగించే ప్రయత్నం చేస్తామని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికలు ముగిస్తే ఇక ప్రజలు పాల్గొనే ఎన్నికలు ఉండవని తెలిపారు. ఈ ఎన్నికలు ముగిస్తే పూర్తిగా పాలనపై దృష్టి సారిస్తామని వెల్లడించారు. నూతన పంచాయతీ రాజ్ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని నిర్ణయించామని అన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థను క్రియాశీలం చేయడంతో పాటు హరితహారం, నరేగ పనులు, పరిశుభ్రతపై అవవగాహన కల్పిస్తామని చెప్పారు. ఎవరెవరికి ఏదీ అప్పగించాలన్న దానిపై చర్చిస్తామని పేర్కొన్నారు. పంచాయతీలకు అవసరమైన నిధులు సమకూర్చి క్రియాశీలం చేస్తామని అన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థకు అధికారాల అప్పగింతను పరిశీలిస్తాం సిఎం కెసిఆర్ వెల్లడించారు.

Using Of Godavari and Krishna River Water

Related Images:

[See image gallery at manatelangana.news]

The post పైరు పచ్చగా తెలుగు నేల… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: