‘కౌసల్య కృష్ణమూర్తి’ టీజర్‌ను విడుదల చేసిన మెగాస్టార్

  ప్రముఖ సీనియర్ డైరెక్టర్ భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో క్రికెట్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కౌసల్య కృష్ణమూర్తి’.  ఈ చిత్రంలో నూతన నటి ఐశ్వర్యా రాజేశ్‌ టైటిల్‌ పాత్రలో నటిస్తుంది. తాజాగా ఈ చిత్రం టీజర్‌ను మెగాస్టార్‌ చిరంజీవి విడుదల చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. ‘టీజర్ చూడగానే సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అన్న ఆసక్తి కలిగింది. తప్పకుండా ‘కౌసల్య కృష్ణమూర్తి’ మంచి విజయం సాధిస్తుంది. స్పోర్ట్స్‌ బ్యాక్‌గ్రౌండ్‌ మూవీస్‌కి ప్రతి ఒక్కరూ కనెక్ట్‌ అవుతారు. […] The post ‘కౌసల్య కృష్ణమూర్తి’ టీజర్‌ను విడుదల చేసిన మెగాస్టార్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ప్రముఖ సీనియర్ డైరెక్టర్ భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో క్రికెట్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కౌసల్య కృష్ణమూర్తి’.  ఈ చిత్రంలో నూతన నటి ఐశ్వర్యా రాజేశ్‌ టైటిల్‌ పాత్రలో నటిస్తుంది. తాజాగా ఈ చిత్రం టీజర్‌ను మెగాస్టార్‌ చిరంజీవి విడుదల చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. ‘టీజర్ చూడగానే సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అన్న ఆసక్తి కలిగింది. తప్పకుండా ‘కౌసల్య కృష్ణమూర్తి’ మంచి విజయం సాధిస్తుంది. స్పోర్ట్స్‌ బ్యాక్‌గ్రౌండ్‌ మూవీస్‌కి ప్రతి ఒక్కరూ కనెక్ట్‌ అవుతారు. నేషనల్‌ వైడ్‌గా స్పోర్ట్స్‌ నేపథ్యంలో తీసిన ప్రతి సినిమా ఘన విజయం సాధించాయి. గేమ్స్‌కి అంతటి ప్రాధాన్యత ఉంది సాధారణ రైతు బిడ్డగా పుట్టి ఒక మహిళా క్రికెటర్‌గా అంతర్జాతీయ స్థాయికి ఎదిగే పాత్రలో ఐశ్వర్యా రాజేశ్‌ చక్కగా ఒదిగిపోయింది. ఈ పాత్రకోసం నాలుగైదు నెలల పాటు శిక్షణ తీసుకొని ఆ తర్వాత షూటింగ్‌ చేయడం ప్రారంభించిందంటే ఆ అమ్మాయికి ఉన్న నిబద్ధత, శ్రద్ధాసక్తులు అర్థమవుతున్నాయి. ఐశ్వర్యా రాజేష్‌ ఎవరో కాదు.. మా కొలీగ్‌ రాజేష్‌ కూతురు. కమెడియన్‌ శ్రీలక్ష్మీ మేనకోడలు. మన తెలుగు సినిమాల్లో తెలుగు అమ్మాయిలు కొరవడిపోతున్న ఈరోజుల్లో ఐశ్వర్యా రాజేష్‌ రావడం అన్నది శుభపరిణామం. ఆమెను మనస్ఫూర్తిగా అభినందిస్తూ.. స్వాగతం పలుకుతున్నాను’ అని అన్నారు.

కాగా, ఇందులో ఐశ్వర్య రాజేశ్‌ తండ్రి పాత్రలో రాజేంద్రప్రసాద్‌ నటించగా.. తమిళ హీరో శివ కార్తికేయన్‌ అతిథి పాత్రలో నటించారు. వీరితోపాటు ఝాన్సీ, వెన్నెల కిశోర్‌, రవి ప్రకాశ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. త్వరలో సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తుంది.

Kousalya Krishnamurthy teaser launch

The post ‘కౌసల్య కృష్ణమూర్తి’ టీజర్‌ను విడుదల చేసిన మెగాస్టార్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: