నిరుపేదలకు అండగా సిఎం సహాయనిధి…

  సిద్దిపేట : నిరుపేదలకు అండగా సిఎం సహాయనిధి నిలుస్తుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. మంగళవారం పట్టణంలోని ఆయన స్వగృహంలో లబ్దిదారులకు సిఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేసిన అనంతరం మాట్లాడారు. వివిధ కారణాలతో అనారోగ్యానికి గురై ఆర్థిక స్థోమత లేక ఆస్పత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు సిఎం సహయనిధి అండగా నిలుస్తుందన్నారు. సిఎం సహాయనిధి ఆర్థిక భరోసా కల్పించడమే కాకుండా ప్రజల్లో ఆత్మవిశ్వాసం కలుగజేస్తుందన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో 56 మందికి రూ. […] The post నిరుపేదలకు అండగా సిఎం సహాయనిధి… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

సిద్దిపేట : నిరుపేదలకు అండగా సిఎం సహాయనిధి నిలుస్తుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. మంగళవారం పట్టణంలోని ఆయన స్వగృహంలో లబ్దిదారులకు సిఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేసిన అనంతరం మాట్లాడారు. వివిధ కారణాలతో అనారోగ్యానికి గురై ఆర్థిక స్థోమత లేక ఆస్పత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు సిఎం సహయనిధి అండగా నిలుస్తుందన్నారు. సిఎం సహాయనిధి ఆర్థిక భరోసా కల్పించడమే కాకుండా ప్రజల్లో ఆత్మవిశ్వాసం కలుగజేస్తుందన్నారు.

సిద్దిపేట నియోజకవర్గంలో 56 మందికి రూ. 17.22 లక్షల విలువైన సిఎం సహాయనిధి చెక్కులు మంజూరయ్యాయన్నారు. సిద్దిపేట పట్టణంలో 25 మందికి రూ. 7,92,500 , సిద్దిపేట రూరల్‌లో నలుగురికి రూ. 1,03,000, సిద్దిపేట అర్భన్‌లో ఇద్దరికి రూ. 97,000, చిన్నకోడూరులో 16 మందికి రూ. 4,44,000, నంగునూరు మండలంలో ఏడుగురికి రూ. 1,99,500, నారాయణరావుపేట మండలంలో ఇద్దరికి రూ. 86 వేలు విలువ గల చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ ఛైర్మన్ కడవేర్గు రాజనర్సు, చందర్‌రావు, ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు ఉన్నారు.

Financial Assistance to Poor People with CM Relief Fund

Related Images:

[See image gallery at manatelangana.news]

The post నిరుపేదలకు అండగా సిఎం సహాయనిధి… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.